జీ సినిమాలు ( 17th జూన్ )

Friday,June 16,2017 - 10:07 by Z_CLU

ఆదివిష్ణు

హీరోహీరోయిన్లు – దాసరి అరుణ్, స్నేహ

ఇతర నటీనటులు – ఐశ్వర్య, కోటశ్రీనివాసరావు,  ప్రదీప్ రావత్, సుమన్, వేణుమాధవ్, అలీ, ఎమ్మెస్ నారాయణ

సంగీతం – ఎం.ఎం. శ్రీలేఖ

దర్శకత్వం – భరత్ పారేపల్లి

విడుదల తేదీ – 2008, ఆగస్ట్ 21

అప్పటికే హీరోగా మారిన దాసరి అరుణ్ కుమార్ చేసిన మరో ప్రయత్నమే ఆదివిష్ణు. అప్పుడప్పుడే టాలీవుడ్  లో పేరుతెచ్చుకుంటున్న స్నేహ ఈ సినిమాలో అరుణ్ సరసన హీరోయిన్ గా నటించింది. కోట శ్రీనివాసరావు, సుమన్ లాంటి సీనియర్ నటులు ఈ సినిమాలో నటించడం ఒక  స్పెషల్ అయితే… ఎమ్మెస్ నారాయణ, అలీ, ధర్మవరపు సుబ్రమణ్యం, వేణుమాధవ్ పండించిన కామెడీ సినిమాకు మరో ఎట్రాక్షన్.

==============================================================================

బొమ్మరిల్లు

నటీనటులు : సిద్ధార్థ్, జెనీలియా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, జయసుధ, సత్య కృష్ణన్, సుదీప పింకీ, సురేఖా వాణి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : భాస్కర్

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 9 ఆగష్టు 2006

తండ్రి కొడుకుల అనుబంధాన్ని అద్భుతంగా తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బొమ్మరిల్లు. న్యాచురల్ పర్ఫామెన్స్ అలరించిన జెనీలియా, సిద్ధార్థ్ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

==========================================================================

 భాయ్

నటీ నటులు : నాగార్జున, రీచా గంగోపాధ్యాయ్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆశిష్ విద్యార్థి, సోను సూద్, ముకుల్  దేవ్, సాయాజీ షిండే, నాగి నీదు, ఎం.ఎస్.నారాయణ, జయప్రకాశ్ రెడ్డి, చలపతి రావు,కె.విశ్వనాధ్, ఎం.ఎస్.నారాయణ, రఘు బాబు,వెన్నెల కిషోర్,అజయ్, ఆదిత్య మీనన్,  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

రచన, స్క్రీన్ ప్లే ,డైరెక్టర్ : వీర భద్రం చౌదరి

ప్రొడ్యూసర్ : అక్కినేని నాగార్జున

రిలీజ్ డేట్ : 25 అక్టోబర్ 2013

నాగార్జున కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘భాయ్’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మాణం లో దర్శకుడు వీరభద్రం తెరకెక్కిన ఈ చిత్రం లో భాయ్ గా నాగార్జున నటన, యాక్షన్ ఎపిసోడ్, రీచా గంగోపాధ్యాయ్ గ్లామర్,  దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలైట్స్. ఈ చిత్రం లో బ్రహ్మానందం, రఘు బాబు, వెన్నెల కిషోర్ కామెడీ అలరిస్తుంది.

============================================================================

భీమిలి కబడ్డీ జట్టు

నటీ నటులు : నాని, శరణ్య మోహన్

ఇతర నటులు : కిషోర్, ధనరాజ్, వినయ్, సంతోష్, శివ, రమేష్, కృష్ణ, చంటి

మ్యూజిక్ : V. సెల్వ గణేష్

డైరెక్టర్ : తాతినేని సత్య

నిర్మాత : NV ప్రసాద్, పరాస్ జైన్

తమిళంలో సూపర్ హిట్టయిన ‘వెన్నిల కబడీ కుజు’ సినిమాను భీమిలి కబడ్డీ జట్టు గా తెరకెక్కించారు. వైజాగ్ పరిసర ప్రాంతమైన భీమిలి పరిసర ప్రాంతాల్లో జరిగే సెన్సిటివ్ కథగా తెరకెక్కింది భీమిలి కబడ్డీ జట్టు. సెన్సిటివ్ ప్రేమ కథతో మొదలైన కథే అయినా, తన జట్టును గెలిపించడం కోసం, ఆఖరి శ్వాస వరకు పోరాడే యువకుడి క్యారెక్టర్ లో నాని నటన అద్భుతం.

============================================================================

నటీనటులు : జీవా, నయనతార

ఇతర నటీనటులు : పశుపతి, ఆశిష్ విద్యార్థి, కరుణాస్, రాజేష్, అజయ్ రత్నం, చరణ్ రాజ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీకాంత్ దేవ

డైరెక్టర్ : S.P. జగన్నాథన్

ప్రొడ్యూసర్ : R.B.చౌదరి

రిలీజ్ డేట్ : 20 అక్టోబర్ 2006

బాధ్యతా రాహిత్యంగా తిరిగే ఒక మాస్ కుర్రాడు, ఒక బార్ డ్యాన్సర్ జ్యోతిని కలుసుకుంటాడు. అతని గతాన్ని తెలుసుకున్న జ్యోతి, చిన్నగా అతనికి జీవితమంటే ఏంటో, దాని విలువేంటో తెలియజేసే ప్రయత్నం చేస్తుంటుంది. ఇంతలో వారికి తెలిసిన ఒక నిజం ఇద్దరి జీవిత లక్ష్యాన్నే  మార్చేస్తుంది. జీవా, నయనతార నటించిన సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్టయింది.

==============================================================================

ధీరుడు

నటీ నటులు : విశాల్, ఐశ్వర్య అర్జున్

ఇతర నటీనటులు : సంతానం, జగన్, జాన్ విజయ్, ఆదిత్య ఓం, మురళి శర్మ, సీత తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : తమన్

డైరెక్టర్ : భూపతి పాండ్యన్

ప్రొడ్యూసర్ : మైకేల్ రాయప్పన్

రిలీజ్ డేట్ : 26 జూలై 2013

సినిమా సినిమాకి వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడతాడు విశాల్. సీనియర్ నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటించిన తొలి తమిళ చిత్రం “పట్టాతు యానై” సినిమాకి డబ్బింగ్ వర్షన్ ఈ ధీరుడు. ఈ సినిమా రెండు భాషలలోను ఒకేసారి రిలీజయింది. సంతానం కామెడీ సినిమాకే హైలెట్ గా నిలిచింది.