జీ సినిమాలు ( 18th జూన్)

Monday,June 17,2019 - 10:00 by Z_CLU

కళ్యాణ వైభోగమే

నటీనటులు : నాగశౌర్యమాళవిక నాయర్

ఇతర నటీనటులు : రాశిఆనంద్ప్రగతినవీన్ నేనిఐశ్వర్యతాగుబోతు రమేష్ మరియుతదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కళ్యాణ్ కోడూరి

డైరెక్టర్ : B.V. నందిని రెడ్డి

ప్రొడ్యూసర్ : K.L. దామోదర్ ప్రసాద్

రిలీజ్ డేట్ : 4 మార్చి 2016

నందిని రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కళ్యాణ వైభోగమేకేవలం పెద్దల బలవంతం పై పెళ్లి చేసుకున్న ఒక యువజంట పెళ్లి తరవాత ఏం చేశారు..? అనేదే  సినిమా ప్రధానాంశంయూత్ ఫుల్ కామెడీ  సినిమాలో పెద్ద హైలెట్.

________________________________________________

వసంతం 

నటీనటులు : వెంకటేష్ఆర్తి అగర్వాల్కళ్యాణి

ఇతర నటీనటులు : V.V.S. లక్ష్మణ్ఆకాష్సునీల్చంద్ర మోహన్తనికెళ్ళ భరణిధర్మవరపు సుబ్రహ్మణ్యం మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్

డైరెక్టర్ విక్రమన్

ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్

రిలీజ్ డేట్ : 11 జూలై 2003

స్నేహానికిప్రేమకు మధ్య డిఫెరెన్స్ ని అద్భుతంగా ఎలివేట్ చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వసంతం. ఎంత పెద్ద త్యాగానికైనా వెనకాడని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కథే ఈ సినిమా. ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి.

_________________________________________________

బాబు బంగారం

నటీనటులు వెంకటేష్నయనతార

ఇతర నటీనటులు : సంపత్ రాజ్మురళీ శర్మజయప్రకాష్బ్రహ్మానందంపోసాని కృష్ణ మురళి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్

డైరెక్టర్ మారుతి

ప్రొడ్యూసర్ : S . నాగవంశీ, P . D . V .  ప్రసాద్

రిలీజ్ డేట్ : 12 ఆగష్టు 2016

తాత జాలిగుణం వారసత్వం గా అందుకున్న కృష్ణ (వెంకటేష్) అనే పోలీస్ ఆఫీసర్ ఆ జాలి గుణం తోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకానొక సందర్భం లో తన లాగే జాలి గుణం తో ఉండే శైలు (నయనతార) ను చూసి ఇష్టపడతాడు కృష్ణ. ఇక తాను ప్రేమిస్తున్న శైలు కుటుంబానికి ఎం.ఎల్.ఏ పుచ్చప్ప (పోసాని),  మల్లేష్(సంపత్) లతో ఆపద ఉందని తెలుసుకున్న కృష్ణ ఆ ఫామిలీ ను అలాగే శైలు నాన్న ను ఎలా కాపాడాడుచివరికి కృష్ణ ఆ ఇద్దరి ఆట ఎలా కట్టించాడుఅనేది చిత్ర కధాంశం.

________________________________________________________

పిల్ల జమీందార్

నటీనటులు నానిహరిప్రియబిందు మాధవి

ఇతర నటీనటులు : శ్రీనివాస్ అవసరాల, M.S.నారాయణరావు రమేష్శివ ప్రసాద్తాగుబోతు రమేష్ధనరాజ్వెన్నెల కిశోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ సెల్వ గణేష్

డైరెక్టర్ : G. అశోక్

ప్రొడ్యూసర్ : D.S. రావు

రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011

న్యాచురల్ స్టార్ నాని తన కరియర్ లో చాలా ఇష్టపడి చేసిన సినిమా పిల్ల జమీందార్. పుట్టుకతో కోటీశ్వరుడైన యువకుడు జీవితం విలువ ఎలా తెలుసుకున్నాడు..అనే సున్నితమైన కథాంశంతోపర్ ఫెక్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది పిల్ల జమీందార్. అష్టా చెమ్మా తరవాత నానిఅవసరాల కలిసి చేసిన సినిమా ఇదే.

_____________________________________

విన్నర్

నటీనటులు : సాయి ధరమ్ తేజ్రకుల్ ప్రీత్ సింగ్

ఇతర నటీనటులు జగపతి బాబుఠాకూర్ అనూప్ సింగ్ఆదర్శ్ బాలకృష్ణప్రియదర్శి పుల్లికొండముకేష్ రిషిఆలీవెన్నెల కిషోర్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్

డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని

ప్రొడ్యూసర్ : నల్లమలుపు బుజ్జిఠాగూర్ మధు

రిలీజ్ డేట్ : 24 ఫిబ్రవరి 2017

సిద్దార్థ్ అనే యువకుడు (సాయి ధరమ్ తేజ్) చిన్నతనంలో కొన్ని సంఘటనల వల్ల తన తండ్రి మహేందర్ రెడ్డి(జగపతి బాబు) కి దూరంగా ఉంటూ రేసింగ్గుర్రాలపై ద్వేషం పెంచుకుంటాడు.. అలా తండ్రికి దూరంగా ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న సిద్దార్థ్ ఒక సందర్భంలో సితార(రకుల్) అనే రన్నర్ ని చూసి ప్రేమలో పడతాడు. అలా తన ప్రేమలో పడిన సిద్దార్థ్ ను ఓ అనుకోని సందర్భంలో ఆది అనే రేసింగ్ జాకీ తో బెట్ కట్టిస్తుంది సితార. అలా సితార ప్రేమ కోసం తనకిష్టం లేని రేసింగ్ మొదలుపెట్టిన సిద్దార్థ్… ఆ రేసింగ్ లో ఎలా గెలిచాడు.. చివరికి తనకు 20 ఏళ్ల క్రితం దూరమైన తండ్రికి ఎలా దగ్గరయ్యాడు.. అనేది సినిమా కథాంశం.

___________________________________

కాష్మోరా

నటీనటులు : కార్తీనయనతార

ఇతర నటీనటులు సి.దివ్యశరత్ లోహిత్ వాలామధుసూదన్ రావుపట్టిమంద్రం రాజా మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సంతోష్ నారాయణన్

డైరెక్టర్ గోకుల్

ప్రొడ్యూసర్ : S.R. ప్రకాష్ బాబు, S.R. ప్రభు

రిలీజ్ డేట్ : 28 అక్టోబర్ 2016

ప్రజల బలహీనతను వాడుకుంటూ దొంగ బాబాగా జీవితాన్ని కొనసాగించే కాష్మోరా(కార్తీ) కు అతని మంత్రశక్తులకు లోబడిన మినిస్టర్ అండదండగా నిలుస్తాడు. అలా దొంగ బాబాగా ప్రజల నుండి డబ్బు దండుకునే కాష్మోరా అనుకోకుండా రాజ్ నాయక్(కార్తీ) అనే ఓ ప్రేతాత్మ తో ఓపాడుబడ్డ బంగ్లాలో బంధించబడతాడు. అసలింతకీ రాజ్ నాయక్ అనే ఆ ప్రేతాత్మ ఎవరుఅతను ఎందుకు ప్రేతాత్మగా మారాడుఆ ప్రేతాత్మకి.. ఈ కాష్మోరాకి సంబంధం ఏమిటిచివరికి కాష్మోరా ఆ దుష్టశక్తీని ఏ శక్తితో ఎదిరించి అంతమొందించాడుఅనేది చిత్ర కథాంశం.