జీ సినిమాలు ( 16th నవంబర్ )

Thursday,November 15,2018 - 10:03 by Z_CLU

ఇది మా ప్రేమకథ
నటీనటులు : రవి, మేఘనా లోకేష్
ఇతర నటీనటులు : ప్రభాస్ శ్రీను, ప్రియదర్శి, తులసి శివమణి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : కార్తీక్ కొడకండ్ల
డైరెక్టర్ : అయోధ్య కార్తీక్
ప్రొడ్యూసర్ : P.L. K. రెడ్డి
రిలీజ్ డేట్ : డిసెంబర్ 15, 2017
రవి, మేఘన లోకేష్ జంటగా నటించిన ఇమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ ఇది మా ప్రేమకథ’. అప్పటివరకు టెలివిజన్ షోస్ లో ఎంటర్టైన్ చేసిన రవి ఏ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. హీరోయిన్ మేఘా లోకేష్ కి కూడా ఇది డెబ్యూ మూవీ కావడం విశేషం.
ఇక సినిమా విషయానికి వస్తే అరుణ్ (రవి) సంధ్యను చూసి చూడగానే ప్రేమలో పడతాడు. కొన్నాళ్ళకు సంధ్య కూడా రవికి దగ్గరవుతుంది. ఈ లవ్ స్టోరీ సరిగ్గా ట్రాక్ లో పడే మూమెంట్ లో ప్రియ అనే అమ్మాయి రావడం, దానికి మరికొన్ని ఇన్సిడెంట్స్ జతై అరుణ్, సంధ్య విడిపోతారు. అసలు అంతగా ప్రేమించుకున్న జంట విడిపోవడానికి కారణమేంటి..? వీళ్ళిద్దరినీ మళ్ళీ ఒకటి చేసిన సందర్భమేమిటన్నది జీ సినిమాలు చూడాల్సిందే.

=============================================================================

చిరుత

నటీనటులు : రామ్ చరణ్ తేజనేహా శర్మ

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్ఆశిష్ విద్యార్థిబ్రహ్మానందంఆలీసాయాజీ షిండే, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : పూరి జగన్నాథ్

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 28 సెప్టెంబర్ 2007

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ రామ్ చరణ్ లోని పర్ఫామెన్స్ ని స్టామినాని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసింది. దానికి తోడు మణిశర్మ  సంగీతం సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది.  

==============================================================================

తులసి

నటీనటులు : వెంకటేష్, నయనతార

ఇతర నటీనటులు : రమ్యకృష్ణ,  శ్రియ, మాస్టర్ అతులిత్, ఆశిష్ విద్యార్థి, రాహుల్ దేవ్, శివాజీ, జయ ప్రకాష్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : బోయపాటి శ్రీను

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 12 డిసెంబర్ 2007

వెంకటేష్, నయనతార జంటగా నటించిన అల్టిమేట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ తులసి. బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన ప్రతి సెంటర్ లోను సూపర్ హిట్టయింది. సెంటిమెంట్, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి. రమ్యకృష్ణ క్యారెక్టర్ సినిమాకి ప్లస్.

==============================================================================

భగీరథ

నటీనటులు  : రవితేజ, శ్రియ

ఇతర నటీనటులు :  ప్రకాష్ రాజ్, నాజర్, విజయ్ కుమార్, బ్రహ్మానందం, జీవ, నాజర్, సునీల్, రఘునాథ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : రసూల్ ఎల్లోర్

ప్రొడ్యూసర్ :మల్లిడి సత్య నారాయణ రెడ్డి

రిలీజ్ డేట్ : అక్టోబర్ 13, 2005

రవి తేజ, శ్రియ హీరో హీరోయిన్స్ గా రసూల్ ఎల్లోర్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా          ‘భగీరథ’. ఈ సినిమాకు ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) కథ ను అందించారు. కృష్ణ లంక అనే పల్లెటూరి లో జనాలు పడే ఇబ్బందులను ఓ యువకుడు ఎలా పరిష్కరించాడు అనే కథతో ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో రవితేజ నటన, శ్రియ గ్లామర్, పల్లెటూరి సీన్స్, చక్రి పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రవి తేజ-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే పోటా పోటీ సీన్స్ అందరినీ అలరిస్తాయి.

==============================================================================

లై

నటీనటులు : నితిన్, మేఘా ఆకాష్

ఇతర నటీనటులు : అర్జున్ సర్జా, శ్రీకాంత్, అజయ్, రవి కిషన్, నాజర్, ద్రుతిమాన్ ఛటర్జీ, బ్రహ్మాజీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : హను రాఘవపూడి

ప్రొడ్యూసర్స్ : రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర, వెంకట్ బోయనపల్లి

రిలీజ్ డేట్ : 11 ఆగష్టు 2017

లై సినిమా స్టోరీ అంతా టైటిల్ కు తగ్గట్టు అబద్ధాలు, తెలివితేటల మీదే నడుస్తుంది. ఓ సూటు చుట్టూ అల్లుకున్న ఇంటలిజెంట్ స్టోరీలైన్ ఇది. పాతబస్తీ కుర్రాడికి, లాస్ వెగాస్ లో ఉన్న విలన్ ఎలా కనెక్ట్ అవుతాడు, వీళ్లిద్దరి మధ్య ఉన్న దోబూచులాడిన సూటు చివరికి ఏమైంది.. హీరో-విలన్ మధ్య హీరోయిన్ పరిస్థితేంటనేది లై’ స్టోరీ లైన్. సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా నితిన్ ని డిఫెరెంట్ డైమెన్షన్ లో ప్రెజెంట్ చేసింది.  

==============================================================================

కొత్త బంగారు లోకం

నటీనటులు : వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, జయసుధ, ఆహుతి ప్రసాద్, రజిత, బ్రహ్మానందం మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ జె. మేయర్

డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 9 అక్టోబర్ 2008

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన కొత్త బంగారు లోకంలో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ హీరో హీరోయిన్ గా నటించారు. రిలీజయిన ప్రతి సెంటర్ లోను అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్. మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.