జీ సినిమాలు ( 16th జూన్ )

Thursday,June 15,2017 - 10:07 by Z_CLU

రంగ ది దొంగ 

హీరో హీరోయిన్లు – శ్రీకాంత్, విమలా రామన్

ఇతర నటీనటులు – రమ్యకృష్ణ, తెలంగాణ శకుంతల, జీవీ, నాగబాబు

సంగీతం – చక్రి

దర్శకత్వం – జీవీ సుధాకర్ నాయుడు

విడుదల తేదీ – 2010, డిసెంబర్ 30

ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించిన జీవీ… దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా రంగ ది దొంగ. అప్పటికే దర్శకుడిగా మారి నితిన్ తో ఓ సినిమా తీసిన జీవీ… ఈసారి ఓ విభిన్న కథాంశంతో శ్రీకాంత్ ను హీరోగా పెట్టి రంగ ది దొంగ సినిమాను తెరకెక్కించాడు. సినిమాలో  విమలారామన్ పోలీస్ గా కనిపిస్తే… మరో కీలకపాత్రలో రమ్యకృష్ణ నటించింది.  తెరపై భయంకరమైన విలనిజం చూపించిన జీవీ… దర్శకుడిగా మాత్రం ఈ సినిమాలో మంచి కామెడీ పండించాడు. 2010లో విడుదలైన ఈ సినిమాకు చక్రి సంగీతం అందించాడు.

==============================================================================

బంగారు బాబు

నటీ నటులు : జగపతి బాబు, మీరా జాస్మీన్

ఇతర నటీ నటులు :శశాంక్, గౌరీ ముంజల్, సోను సూద్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఎం.ఎం.శ్రీలేఖ

డైరెక్టర్ : జొన్నలగడ్డ శ్రీనివాస్

ప్రొడ్యూసర్ : కె.రామ కృష్ణ ప్రసాద్

రిలీజ్ డేట్ : 2009

జగపతి బాబు, మీరా జాస్మీన్ జంటగా దర్శకుడు జొన్నల గడ్డ శ్రీనివాస్ తెరకెక్కించిన ఫామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘బంగారు బాబు’ ఈ సినిమాలో జగపతి బాబు-మీరా జాస్మీన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, పాటలు హైలైట్స్.

=============================================================================

ఆట

నటీనటులు : సిద్ధార్థ్ నారాయణ్, ఇలియానా డిక్రూజ్

ఇతర నటీనటులు : మున్నా, శరత్ బాబు, సునీల్, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, సాయాజీ షిండే, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అనురాధా తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : V.N.ఆదిత్య

ప్రొడ్యూసర్ : M.S. రాజు

రిలీజ్ డేట్ : 9 మే 2007

చిన్నప్పటి నుండి సినిమాలు చూస్తూ పెరిగిన శ్రీకృష్ణ, తన లైఫ్ ని కూడా హీరోలా లీడ్ చేయాలనుకుంటాడు. అంతలో సత్యతో ప్రేమలో పడిన శ్రీకృష్ణ ఆ తరవాత తన లైఫ్ లో వచ్చిన సమస్యల్ని ఎలా ఎదుర్కున్నాడు…? అనేదే ఈ సినిమా ప్రధానాంశం. ఈ సినిమాకి DSP మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది.

==============================================================================

బొబ్బిలి రాజా 

హీరోహీరోయిన్లు – వెంకటేశ్, దివ్యభారతి

ఇతర నటీనటులు – వాణిశ్రీ, సత్యనారాయణ, కోటశ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబుమోహన్, గుమ్మడి

సంగీత దర్శకుడు –  ఇళయరాజా

దర్శకుడు – బి.గోపాల్

విడుదల తేదీ – 1990

ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్ కలగలిసిన ఓ మంచి కథకు, అదిరిపోయే సంగీతం యాడ్ అయితే ఎలా ఉంటుందో అదే బొబ్బిలి రాజా సినిమా. బి.గోపాల్,వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా వెంకీ కెరీర్ లో ఓ తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది. అటు సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ కు కూడా భారీగా లాభాలు తెచ్చిపెట్టిన మూవీస్ లో ఇది కూడా ఒకటి. అయ్యో..అయ్యో..అయ్యయ్యో అనే సూపర్ హిట్ డైలాగ్ ఈ సినిమాలోనిదే. రీసెంట్ గా బాబు బంగారం సినిమాలో కూడా వెంకీ ఇదే డైలాగ్ ఉపయోగించారు. ఇక ఈ సినిమాలో పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన సంగీతంతో ఇళయరాజా ఈ సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లారు. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు అంతే ఫ్రెష్ గా ఉంటాయి. వెంకటేశ్ కెరీర్ లోనే మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ సినిమాగా పేరుతెచ్చుకున్న బొబ్బిలిరాజా.. 3 సెంటర్లలో 175 రోజులు ఆడింది. తర్వాత ఇదే మూవీ తమిళ్ లో వాలిబన్, హిందీలో రామ్ పూర్ కా రాజా పేరుతో విడుదలై…  అక్కడ కూడా విజయం సాధించడం కొసమెరుపు.

==============================================================================

 

అవును 2

నటీ నటులు : పూర్ణ, హర్షవర్ధన్ రాణే

ఇతర నటీనటులు : రవి బాబు, సంజన గల్రాని, నిఖిత తుక్రాల్, రవి వర్మ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : రవి బాబు

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 3 ఏప్రిల్ 2015

రవిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ అవును సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది అవును 2. ఈ సినిమా కూడా రవిబాబు మార్క్ తో సూపర్ హిట్ అనిపించుకుంది. హీరోయిన్ పూర్ణ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

==============================================================================

 

ఏక్ నిరంజన్ 

నటీ నటులు : ప్రభాస్, కంగనా రనౌత్

ఇతర నటీనటులు : సోను సూద్, ముకుల్ దేవ్, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, వేణు మాధవ్, మర్కాండ్ దేశ్ పాండే తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : పూరి జగన్నాథ్

ప్రొడ్యూసర్ : ఆదిత్య రామ్ మూవీస్

రిలీజ్ డేట్ : 30 అక్టోబర్ 2009

ప్రభాస్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్ ఎంటర్ టైనర్ ఏక్ నిరంజన్. చోటు గా ప్రభాస్ ఆక్టింగ్ సినిమాకే హైలెట్. ఓ వైపు పోలీసులకు హెల్ప్ చేస్తూ మరోవైపు తన తలిదండ్రులను వెదుక్కుంటూ ఉంటాడు. ప్రభాస్, కంగనా రనౌత్ ల మధ్య సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా తెరకెక్కించాడు పూరి జగన్నాథ్.

===========================================================================

ద స్పై నెక్స్ట్ డోర్

నటీనటులు : జాకీచాన్, అంబర్ వ్యాలెట

ఇతర నటీనటులు : మాగ్నస్ షేవింగ్, మ్యడేలిన్ క్యారోల్, విల్ శ్యాడ్, అలినా ఫోలి, జార్జ్ లోపెజ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : డేవిడ్ న్యూమెన్

డైరెక్టర్ : బ్రయన్ లీవెంట్

ప్రొడ్యూసర్ : రాబర్ట్ సైమండ్స్

రిలీజ్ డేట్ : జనవరి 15, 2010

జాకీచాన్ నటించిన అద్భుత కామెడీ చిత్రం ద స్పై నెక్స్ట్ డోర్. బ్రైన్ లీవెంట్ దరేక్షన్ చేసిన ఈ సినిమాని రాబర్ట్ సైమండ్స్ నిర్మించాడు. డేవిడ్ న్యూమెన్ సంగీతం అందించిన ఈ సినిమాలో అంబర్ వ్యాలెట హీరోయిన్ గా నటించింది. కామెడీ ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది.