జీ సినిమాలు ( 16th జూలై )

Monday,July 15,2019 - 10:58 by Z_CLU

నెక్స్ట్ నువ్వే

నటీనటులు : ఆది, వైభవి

ఇతర నటీనటులు : బ్రహ్మాజీ, రశ్మి గౌతమ్, హిమజ, L.B. శ్రీరామ్, శ్రీనివాస్ అవసరాల, రామ్ జగన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్

డైరెక్టర్ : ప్రభాకర్

ప్రొడ్యూసర్ : K.E. జ్ఞానవేల్ రాజా, బన్నివాస్

రిలీజ్ డేట్ : నవంబర్ 3, 2017

ఆది, వైభవి జంటగా నటించిన కామెడీ థ్రిల్లర్ నెక్స్ట్ నువ్వే. కిరణ్ (ఆది) తన గర్ల్ ఫ్రెండ్ తో పాటు మరో ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి రిసార్ట్ నడుపుతుంటాడు. అయితే మిస్టీరియస్ గా ఆ రిసార్ట్ కి గెస్ట్ గా వచ్చిన వాళ్ళంతా చనిపోతుంటారు. ఆది & ఫ్రెండ్స్ కి ఏం చేయాలో అర్థంకాక ఆ శవాలను ఎవరికీ తెలియకుండా పూడ్చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఆ రిసార్ట్ లో పనిచేసే వ్యక్తి ఆ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో కథ అడ్డం తిరుగుతుంది.

ఎవరైతే ఆ రిసార్ట్ లో ఇప్పటి వరకు చనిపోయారో, వారి వివరాలను పరిశీలించిన పోలీసులు, అవన్నీ ఆల్రెడీ చనిపోయిన వారి వివరాలని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. చనిపోయినవాళ్ళు మళ్ళీ చనిపోవడమేంటి..? అసలు ఆ రిసార్ట్ కి వరసగా వచ్చిన వాళ్ళెవరు..? వారికి ఆ రిసార్ట్ కి ఉన్న సంబంధమేంటి అనేదే ఈ సినిమాలోని ప్రధాన కథాంశం.

==============================================================================

ఒక ఊరిలో
నటీనటులు : తరుణ్, రాజా, సలోని
ఇతర నటీనటులు : చంద్ర మోహన్, నరేష్, కల్పన, రామరాజు, యమునా, నిరోషా
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : రమేష్ వర్మ
ప్రొడ్యూసర్ : చంటి అడ్డాల
రిలీజ్ డేట్ : 1 జూలై 2005
లవర్ బాయ్ తరుణ్, తెలుగమ్మాయి సలోని జంటగా నటించిన లవ్ ఎంటర్ టైనర్ ఒక ఊరిలో. ఒక అందమైన ఊరిలో మొదలైన ప్రేమకథ ఏ మలుపు తిరిగింది. చివరికి ఏమైంది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ సినిమా అనిపించుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలెట్.

==============================================================================

సైజ్ జీరో
నటీనటులు : అనుష్క శెట్టి, ఆర్య
ఇతర నటీనటులు ప్రకాష్ రాజ్, ఊర్వశి, సోనాల్ చౌహాన్, అడివి శేష్, బ్రహ్మానందం, గొల్లపూడి మారుతి రావు, తనికెళ్ళ భరణి మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి
డైరెక్టర్ : ప్రకాష్ కోవెలమూడి
ప్రొడ్యూసర్ : ప్రసాద్ వి. పొట్లూరి
రిలీజ్ డేట్ : 27 నవంబర్ 2015
అధిక బరువు ఉన్నప్పటికీ ఏ మాత్రం కాన్ఫిడెన్స్ తగ్గని సౌందర్య అభిషేక్ తో ప్రేమలో పడుతుంది. తన ప్రేమని పొందటం కోసం, అతి తక్కువ కాలంలో బరువు తగ్గించే క్లినిక్ లో కూడా జాయిన్ అవుతుంది. సౌందర్య అక్కడేం తెలుసుకుంటుంది..? చివరికి సౌందర్య బరువు తగ్గుతుందా..? అభిషేక్ ప్రేమను తను పొందగలుగుతుందా..? అనేదే ఈ సినిమా కథ. అనుష్క పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది.

==============================================================================

నాగవల్లి
నటీనటులు : వెంకటేష్, అనుష్క శెట్టి
ఇతర నటీనటులు : రజినీకాంత్, జ్యోతిక, రిచా గంగోపాధ్యాయ, శ్రద్దా దాస్, కమలినీ ముఖర్జీ, పూనం కౌర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : గురుకిరణ్
డైరెక్టర్ : P. వాసు
ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 16 డిసెంబర్ 2010
విక్టరీ వెంకటేష్, అనుష్క నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ నాగవల్లి. రజినీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ ఈ సినిమా. అనుష్క నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.

==============================================================================

శైలజా రెడ్డి అల్లుడు
నటీనటులు : నాగ చైతన్య, అనూ ఇమ్మాన్యువెల్
ఇతర నటీనటులు : రమ్య కృష్ణన్, నరేష్, మురళీ శర్మ, కళ్యాణి నటరాజన్, వెన్నెల కిషోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : గోపీ సుందర్
డైరెక్టర్ : మారుతి దాసరి
ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ
రిలీజ్ డేట్ : 13 సెప్టెంబర్ 2018
ఈగోకి బ్రాండ్ అంబాసిడర్ అయిన పెద్ద వ్యాపారవేత్త (మురళి శర్మ) ఏకైక కొడుకు చైతు(నాగచైతన్య). తన తండ్రిలా కాకుండా కాస్త సహనం, ఓపికతో జీవితాన్ని కూల్ గా గడుపుతుంటాడు. ఓ సందర్భంలో చైతూకి ఈగో కు మారుపేరైన అను(అను ఇమ్మానియేల్) పరిచయమవుతుంది. ఆ పరిచయం వారిద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. అలా తండ్రి , ప్రియురాలి ఈగోల మధ్య నలిగిపోయే చైతూ జీవితంలోకి అనుకోకుండా పౌరుషంతో గల ఈగో ఉన్న మరో వ్యక్తి వస్తుంది.. ఆవిడే శైలజా రెడ్డి(రమ్యకృష్ణ).
తన ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లడం కోసం స్నేహితుడు చారి(వెన్నెల కిషోర్)తో కలిసి అత్తయ్య శైలజారెడ్డి ఇంట్లో అడుగుపెడతాడు చైతూ. మామయ్య సహకారంతో తల్లికూతురుని చైతూ ఎలా కలిపాడు, వాళ్ల ఇగోల్ని ఎలా జయించాడు అనేది బ్యాలెన్స్ కథ.

==============================================================================

ఒంగోలు గిత్త

నటీనటులు : రామ్ పోతినేని, కృతి కర్బందా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కిషోర్ దాస్, ప్రభు, అజయ్, అభిమన్యు సింగ్, ఆహుతి ప్రసాద్, రమాప్రభ, రఘుబాబు, సంజయ్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : భాస్కర్

ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్

రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013

రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి, ఆ కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.