జీ సినిమాలు (16th ఫిబ్రవరి)

Saturday,February 15,2020 - 10:00 by Z_CLU

కుక్కలున్నాయి జాగ్రత్త

నటీనటులు : సిబిరాజ్అరుంధతి

ఇతర నటీనటులు : ఇదోబాలాజీ వేణుగోపాల్మనోబాలమయిల్ సామిప్రింజ్ నితిక్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ధరన్ కుమార్

డైరెక్టర్ : శక్తి సౌందర్ రాజన్

ప్రొడ్యూసర్ సత్యరాజ్మహేశ్వరి సత్యరాజ్

రిలీజ్ డేట్ : 21 నవంబర్ 2014

సిబిరాజ్అరుంధతి జంటగా నటించిన ఇమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ ‘కుక్కలున్నాయి జాగ్రత్త’. మోస్ట్ ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ లో కుక్క కీ రోల్ ప్లే చేసింది. ఒక అమ్మాయి కిడ్నాప్ కేసును ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ లో తన ఫ్రెండ్ ని కోల్పోతాడు పోలీసాఫీసర్ కార్తీక్. ఆ కిడ్నాపర్లను అంతం చేసే ప్రాసెస్ లో ఉన్న కార్తీక్ కి అనుకోకుండా మిలిటరీ ట్రైన్డ్ కుక్క స్నేహం ఏర్పడుతుంది. ఆ కుక్క పోలీసాఫీసర్ కార్తీక్ కి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఎలా సహాయపడింది..అనేదే ఈ సినిమాలో మోస్ట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్.

______________________________

స్పైడర్

నటీనటులు : మహేష్ బాబురకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : S.J. సూర్యభరత్, RJ బాలాజీప్రియదర్శిజయప్రకాష్సాయాజీ షిండే
మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్
డైరెక్టర్ : A.R. మురుగదాస్
ప్రొడ్యూసర్ : N.V. కుమార్ఠాగూర్ మధు
రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2017


ఇంటలిజెన్స్ బ్యూరో లో పనిచేసే శివ(మహేష్ బాబు) అందరి కాల్స్ ట్రాప్ చేస్తూ తను రెడీ చేసుకున్న ఓ సాఫ్ట్ వేర్ ద్వారా సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికెళ్లి ఎలాంటి తప్పు జరగకుండా అడ్డుపడుతుంటాడు.. అలా సాటి మనిషికి ఎటువంటి బాధ కలగకూడదనే వ్యక్తిత్వంతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా జీవితాన్నిగడిపే శివట్రాప్ ద్వారా ఓ కాల్ వింటాడు. అనుకోకుండా విన్న ఆ కాల్ శివ జీవితంలో ఓ పెద్ద మార్పు తీసుకొస్తుంది.. ఆ ఫోన్ కాల్ విన్న మరసటి రోజే శివ జీవితంలోకి వస్తాడు భైరవుడు… ఇంతకీ భైరవుడు ఎవరు ? అసలు శివకి భైరవుడికి మధ్య ఏం జరిగింది ? చివరికి శివ భైరవుడిని ఎలా అంతమొందించి ప్రజల్ని కాపాడాడనేది సినిమా కథాంశం.

____________________________________________

బలుపు

నటీ నటులు : రవితేజశృతి హాసన్
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్ఆషుతోష్ రాణాఅడివి శేష్సనబ్రహ్మానందం.
మ్యూజిక్ డైరెక్టర్ : S.తమన్
డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని
ప్రొడ్యూసర్ : వరప్రసాద్ పొట్లూరి
రిలీజ్  : 28 జూన్ 2013

రవితేజ కరియర్ లోనే భారీ సూపర్ హిట్ ‘బలుపు’. బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్ గా పనిచేసే రవితేజసిటీలో తండ్రితో పాటు కాలం గడుపుతుంటాడు. నిజానికి వారి గతం ఏంటి..వారిద్దరూ నిజంగా తండ్రీ కొడుకు లేనా..అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోనూ సూపర్ హిట్ అయింది.

_____________________________________________

రాయుడు

నటీనటులు : విశాల్శ్రీదివ్య

ఇతర నటీనటులు : R.K. సురేష్కుళ్ళప్పులి లీలరాధారవిసూరిఆదిర పాండిలక్ష్మిఆరుళ్ దాస్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : D. ఇమ్మన్

డైరెక్టర్ : M. ముత్తయ్య

ప్రొడ్యూసర్ : G.N. అంబు చెళియన్   

రిలీజ్ డేట్ : 20 మే 2016

విశాల్శ్రీదివ్య జంటగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ రాయుడు. విశాల్ ఈ సినిమాలో సాధారణ కూలీగా నటించాడు. తను ప్రేమించిన భాగ్యలక్ష్మి ని చంపాలని చూస్తున్న రోలెక్స్ కి ఎదురు తిరిగిన రాయుడుఎలాంటి పరిస్థితులు ఎదురుకుంటాడు..అసలు రోలెక్స్ భాగ్యలక్ష్మిని ఎందుకు చంపాలనుకుంటాడు అనేదే ఈ సినిమాలోని ప్రధాన కథాంశం. యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాలో హైలెట్ గా నిలిచాయి.

________________________________________

అ..ఆ

నటీనటులు : నితిన్సమంతా అక్కినేని , అనుపమ పరమేశ్వరన్

ఇతర నటీనటులు : నరేష్నదియాహరితేజఅనన్యరావు రమేష్శ్రీనివాస్ అవసరాల మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ.జె.మేయర్

డైరెక్టర్ : త్రివిక్రమ్

ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ

రిలీజ్ డేట్ : 2 జూన్ 2016

నితిన్సమంతా జంటగా నటించిన బ్యూటిఫుల్ లవ్ ఎంటర్ టైనర్ అ..ఆ. రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అనసూయ (సమంతా)తల్లి క్రమశిక్షణతో విసుగెత్తి పోతుంది. దానికి తోడు తన ఇష్టా ఇష్టాలతో సంబంధం కుదర్చడం మరో తలపోతులా ఫీలవుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తండ్రి సలహా మేరకు తన మేనత్త ఇంటికి  వెళ్తుంది. ఆనంద్  విహారి ( నితిన్) తో పాటుతక్కిన ఫ్యామిలీని కలుసుకుంటుంది. ఆస్తిఆర్భాటాలు లేకపోయినా అనురాగ ఆప్యాయతలతో  ఉండే ఆ ఫ్యామిలీని ఇష్టపడటమే కాదు ఆనంద్ విహారితో ప్రేమలో కూడా పడుతుంది అనసూయ.  ఆ తరవాత ఏం జరుగుతుంది..అనేదే ఈ సినిమాలో ప్రధాన కథాంశం.

_______________________________________

బ్రాండ్ బాబు

నటీనటులు సుమంత్ శైలేంద్రఈషా రెబ్బ

ఇతర నటీనటులు : పూజిత పున్నాడమురళీ శర్మరాజా రవీంద్రసత్యం రాజేష్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : J.B.

డైరెక్టర్ ప్రభాకర్ P.

ప్రొడ్యూసర్ : A. శైలేంద్ర బాబు

రిలీజ్ డేట్ ఆగష్టు 3, 2018

వ్యాపారవేత్త డైమండ్ రత్నం (మురళీ శర్మ)కు బ్రాండ్స్ అంటే పిచ్చి. డబ్బున్నవాళ్ల స్టేటస్ మొత్తం వాళ్లు వాడే బ్రాండ్స్ లోనే కనిపిస్తుందనేది అతడి ప్రగాఢ విశ్వాసం. అతడి నమ్మకాలకు తగ్గట్టే కొడుకును పెంచుతాడు రత్నం. వాడే స్పూన్ నుంచి వేసుకునే అండర్ వేర్ వరకు ఇలా ప్రతిది బ్రాండ్ వాడే హీరో (సుమంత్ శైలేంద్ర) డైమండ్.. తనకు కాబోయే భార్య కూడా ఆల్-బ్రాండ్ అమ్మాయిగా ఉండాలని భావిస్తాడు.

అయితే ఒకసారి తనకొచ్చిన ఓ  మెసేజ్ చూసి హోం మినిస్టర్ కూతురు తనను ప్రేమిస్తుందని భ్రమపడతాడు. తనను ఇంప్రెస్ చేసేందుకు తన ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతుంటాడు. ఈ క్రమంలో హోం మినిస్టర్ కూతురు అనుకొనిఆ ఇంట్లో పనిచేస్తున్న రాధ (ఇషా రెబ్బా)ను ప్రేమిస్తాడు. అక్కడే అసలు కథ బిగిన్ అవుతుంది. బ్రాండ్ నే నమ్ముకున్న డిమాండ్పని  మనిషితో  ప్రేమలో పడితే ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.