జీ సినిమాలు ( 16th ఫిబ్రవరి )

Friday,February 15,2019 - 10:03 by Z_CLU

ఒక ఊరిలో

నటీనటులు : తరుణ్, రాజా, సలోని

ఇతర నటీనటులు : చంద్ర మోహన్, నరేష్, కల్పన, రామరాజు, యమునా, నిరోషా

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : రమేష్ వర్మ

ప్రొడ్యూసర్ : చంటి అడ్డాల

రిలీజ్ డేట్ : 1 జూలై 2005

లవర్ బాయ్ తరుణ్, తెలుగమ్మాయి సలోని జంటగా నటించిన లవ్ ఎంటర్ టైనర్ ఒక ఊరిలో. ఒక అందమైన ఊరిలో మొదలైన ప్రేమకథ ఏ మలుపు తిరిగింది. చివరికి ఏమైంది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ సినిమా అనిపించుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలెట్.

==============================================================================

ఒంగోలు గిత్త

నటీనటులు రామ్ పోతినేనికృతి కర్బందా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్కిషోర్ దాస్ప్రభుఅజయ్అభిమన్యు సింగ్ఆహుతి ప్రసాద్రమాప్రభరఘుబాబుసంజయ్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ భాస్కర్

ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్

రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013

రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.

==============================================================================

రామయ్యా వస్తావయ్యా

నటీనటులు : NTR, శృతి హాసన్సమంత రుత్ ప్రభు

ఇతర నటీనటులు : విద్యుల్లేఖ రమణ్, P.రవి శంకర్ముకేష్ రిషికోట శ్రీనివాస్ రావురావు రమేష్తనికెళ్ళ భరణి

సంగీతం : S.S. తమన్

డైరెక్టర్ : హరీష్ శంకర్

నిర్మాత దిల్ రాజు

జూనియర్ ఎన్టీఆర్ కరియర్ లోనే కలర్ ఫుల్ గా ఎంటర్ టైనర్ గా నిలిచింది రామయ్యా వస్తావయ్య. శృతి హాసన్సమంతా లు హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ లో లవర్ బాయ్ లాజాలీగా ఉండే కుర్రాడిలా ఉండే NTR, ఇంటర్వెల్ బ్యాంగ్ తరవాత తన విశ్వరూపం చూపిస్తాడు. ఎక్స్ పెక్ట్ చేయని ట్విస్టు లతో సినిమాని చాలా ఇంటరెస్టింగ్ గా తెరకెక్కించాడు హరీష్ శంకర్. S.S. తమన్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

==============================================================================

లౌక్యం

నటీనటులు : గోపీచంద్రకుల్ ప్రీత్ సింగ్

ఇతర నటీనటులు : బ్రహ్మానందంముకేష్ రిషిసంపత్ రిషిచంద్ర మోహన్రాహుల్ దేవ్మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : శ్రీవాస్

ప్రొడ్యూసర్ : V. ఆనంద్ ప్రసాద్

రిలీజ్ డేట్ : 26 సెప్టెంబర్ 2014

గోపీచంద్రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లౌక్యంతన ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా ఆఇంట్లోంచి  అమ్మాయిని ఎత్తుకొచ్చి  వారిద్దరి పెళ్ళి చేస్తాడు వెంకీదాంతో  అమ్మాయి అన్న వెంకీపై కక్ష కడతాడు ఇన్సిడెంట్ తరవాత వెంకీ ఒక ఆమ్మాయి ప్రేమలో పడతాడుతర్వాతఆ లోకల్ క్రిమినల్ మరో చెల్లెలే తను ప్రేమించిన అమ్మాయి అని తెలుసుకుంటాడుఅప్పుడువెంకీ ఏం చేస్తాడు..? అనేదే  సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

హలో

నటీనటులు : అఖిల్ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్
ఇతర నటీనటులు : జగపతి బాబు, రమ్యకృష్ణ, అజయ్, సత్య కృష్ణన్, అనీష్ కురువిల్ల మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్
డైరెక్టర్ : విక్రమ్ కుమార్
ప్రొడ్యూసర్ : నాగార్జున అక్కినేని
రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2017

చిన్నతనంలో తల్లితండ్రులకు కోల్పోయి అనాధగా ఉన్న శీను(అఖిల్)కి స్నేహితురాలుగా పరిచయం అవుతుంది జున్ను(కల్యాణి). అలా అనుకోకుండా ఒక్కటైన శీను, జున్ను కొన్ని రోజులకే విడిపోతారు. అనాధగా ఉన్న శీనుని ఒకానొక పరిస్థితుల్లో అవినాష్ గా పేరు మార్చి దత్తత తీసుకొని పెంచి పెద్ద చేస్తారు సరోజిని(రమ్యకృష్ణ)- ప్రకాష్(జగపతి బాబు). అలా పెరిగి పెద్దవాడైన అవినాష్ కు 15 ఏళ్ళ తర్వాత తన ప్రియురాలిని కలిసే అవకాశం వస్తుంది. అయితే తన ప్రేయసిని కలవడానికి ఒకే ఒక్క ఆధారమైన ఫోన్ పోగొట్టుకుంటాడు. ఇంతకీ అవినాష్ ఫోన్ దొంగలించింది ఎవరు? అవినాష్ ప్రియగా పేర్లు మార్చుకున్న వీరిద్దరూ చివరికి ఎలా కలిశారు.. అనేది సినిమా స్టోరీ.

==============================================================================

 

DJ – దువ్వాడ జగన్నాథం

నటీనటులు : అల్లు అర్జున్, పూజా హెగ్డే

ఇతర నటీనటులు : చంద్ర మోహన్, రావు రమేష్, మురళి శర్మ, సుబ్బరాజు, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : హరీష్ శంకర్

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 23 జూన్ 2017

విజయవాడలో సత్యనారాయణపురం అగ్రహారం అనే ఊళ్ళో బ్రాహ్మణ కుర్రాడిగా కుటుంబంతో కలిసి పెళ్లిళ్లకు వంటచేసే దువ్వాడ జగన్నాథం(అల్లు అర్జున్) చిన్నతనంలో తనకు ఎదురైన కొన్ని సంఘటనల వల్ల సమాజంలో అన్యాయాలు జరగకుండా ఓ మార్పు తీసుకురావాలనుకుంటాడు. ఇందుకోసం ఓ పోలీస్ అధికారి పురుషోత్తం(మురళి శర్మ) సహాయం అందుకున్న దువ్వాడ సమాజంలో ప్రజలకి అన్యాయం చేసే వారిని ఎలా ఏ విధంగా ఎదుర్కున్నాడు.. చివరికి పెద్ద రియల్టర్ గా పేరొంది ప్రజల నుంచి డబ్బు దండుకున్న రొయ్యల నాయుడును ఏ విధంగా ఎదిరించి అంతమొందిచాడు.. అనేది సినిమా కథాంశం.

==============================================================================

కణం
నటీనటులు : నాగశౌర్యసాయి పల్లవి
ఇతర నటీనటులు : బేబీ వెరోనికాప్రియదర్శి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : C. స్యామ్
డైరెక్టర్ : A.L. విజయ్
ప్రొడ్యూసర్స్ : లైకా ప్రొడక్షన్స్
కృష్ణ (నాగ శౌర్య)తులసి (సాయి పల్లవి) టీనేజ్ లో ప్రేమించుకొని పెద్దలు ఐదేళ్ళు గడిచాక పెళ్లి చేస్తాం అని చెప్పడంతో విడిపోయి సెటిల్ అయ్యాక పెళ్ళిచేసుకొని దంపతులుగా మారతారు. అయితే టీనేజ్ లో ఇద్దరూ కలిసి చేసిన ఓ తప్పు ను కప్పిపుచ్చడానికి వీరి కుటుంబాలు తీసుకున్న ఓ నిర్ణయం వల్ల అందరూ వరుసగా మృత్యువాత పడతారు. ఇంతకీ కృష్ణ – తులసి చేసిన తప్పేంటి… ఆ ఐదేళ్ళ తర్వాత వీరి జీవితం ఎలా సాగింది. పెళ్లి తర్వాత వీరి జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి.. అనేది మిగతా కథ.