జీ సినిమాలు ( 15th ఏప్రిల్ )

Sunday,April 14,2019 - 10:02 by Z_CLU

మేము
నటీనటులు : సూర్యఅమలా పాల్
ఇతర నటీనటులు : రామ్ దాస్కార్తీక్ కుమార్విద్యా ప్రదీప్బిందు మాధవినిశేష్వైష్ణవి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ఆరోల్ కోలేరి
డైరెక్టర్ : పాండిరాజ్
ప్రొడ్యూసర్స్ : సూర్యపాండిరాజ్
రిలీజ్ డేట్ : 24th డిసెంబర్ 2015
పిల్లల్లో హైపర్ ఆక్టివిటీని ఎలా హ్యాండిల్ చేయాలి అనే సెన్సిటివ్ టాపిక్ తో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మేము. ఈ సినిమాలో సూర్యఅమలా పాల్ నటన హైలెట్ గా నిలిచింది.

==============================================================================

అందాల రాముడు

నటీనటులు : సునీల్, ఆర్తి అగర్వాల్

ఇతర నటీనటులు : ఆకాశ్, వడివుక్కరసి, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, ధర్మవరపు, వేణు మాధవ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్

డైరెక్టర్ : P. లక్ష్మి కుమార్

ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్, పరాస్ జైన్

రిలీజ్ డేట్ : ఆగష్టు 11, 2006

సునీల్ తన కరియర్ లో ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా నటించిన చిత్రం అందాల రాముడు. ఈ సినిమా సునీల్ కరియర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది. ఆర్తి అగర్వాల్ నటన సినిమాకే హైలెట్.

=============================================================================

శతమానం భవతి
నటీనటులు : శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, జయసుధ, నరేష్, ఇంద్రజ, రాజా రవీంద్ర, హిమజ, ప్రవీణ్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ. జే. మేయర్
డైరెక్టర్ : సతీష్ వేగేశ్న
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
రిలీజ్ డేట్ : 14 జనవరి 2017
ఆత్రేయ పురం అనే గ్రామంలో రాఘవ రాజు(ప్రకాష్ రాజ్) జానకమ్మ(జయసుధ) అనే దంపతులు తమ పిల్లలు విదేశాల్లో స్థిరపడి తమను చూడడానికి రాకపోవడంతో కలత చెంది తన మనవడు రాజు (శర్వానంద్) తో కలిసి సొంత ఊరిలోనే జీవిస్తుంటారు. ఈ క్రమంలో పిల్లల్ని ఎలాగైనా సంక్రాంతికి తమ ఊరికి రప్పించాలని రాజు గారిని కోరుతుంది జానకమ్మ. తన భార్య కోరిక మేరకూ ఎప్పుడు కబురుపెట్టినా రాని పిల్లల కోసం ఒక పథకం వేసి సంక్రాంతికి ఊరు రప్పిస్తాడు రాఘవ రాజు. ఇంతకీ రాజు గారు వేసిన ఆ పథకం ఏమిటి? రాజు గారి కబురు మేరకు స్వదేశం తిరిగొచ్చిన పిల్లలు తాము దూరంగా ఉండడం వల్ల తల్లిదండ్రుల పడుతున్న భాధ ఎలా తెలుసుకున్నారు? అనేది ఈ సినిమా కథాంశం.

==============================================================================

లింగ

నటీనటులు : రజినీకాంత్అనుష్క శెట్టిసోనాక్షి సిన్హా

ఇతర నటీనటులు : జగపతి బాబు, K. విశ్వనాథ్, N. సంతానంకరుణాకరన్దేవ్ గిల్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహ్మాన్

డైరెక్టర్ : K.S. రవి కుమార్

ప్రొడ్యూసర్ : రాక్ లైన్ వెంకటేష్

రిలీజ్ డేట్ : 12 డిసెంబర్ 2014

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన డైరెక్ట్ సినిమా ‘లింగ’. రెండు డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ ఓ ఉండే ఈ సినిమాలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడు.  అనుష్కసోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.

==============================================================================

లండన్  బాబులు 

నటీనటులు : స్వాతిరక్షిత్

ఇతర నటీనటులు : మురళి శర్మఆలీరాజా రవీంద్రజీవాసత్యధనరాజ్అజయ్ ఘోష్సాయిసత్యకృష్ణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కె.

డైరెక్టర్ : చిన్నికృష్ణ

ప్రొడ్యూసర్ మారుతి

రిలీజ్ డేట్ : 17 నవంబర్ 2017

అంతర్వేది అనే పల్లెటూరిలో సాధారణ కుర్రాడిగా జీవితాన్ని గడిపే గాంధీ(రక్షిత్) అప్పుల కారణంగా దొంగదారిన లండన్ వెళ్లి డబ్బు సంపాదించాలని స్నేహితుడు(సత్య)తో కలిసి హైదరాబాద్ వస్తాడు. పాస్ పోర్టు నుంచి ఇమ్మిగ్రేషన్ వీసా వరకూ జరిగే అన్యాయం నేపథ్యంలో గాంధీ… సూర్య కాంతం( స్వాతి)ని ఎలా కలుస్తాడు. ఈ క్రమంలో గాంధీ కి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి..లండన్ వెళ్లాలని ఎన్నో కలలు కన్న గాంధీ చివరికీ లండన్ వెళ్లగలిగాడా… అనేది సినిమా కథాంశం.

==============================================================================

కణం
నటీనటులు : నాగశౌర్యసాయి పల్లవి
ఇతర నటీనటులు : బేబీ వెరోనికాప్రియదర్శి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : C. స్యామ్
డైరెక్టర్ : A.L. విజయ్
ప్రొడ్యూసర్స్ లైకా ప్రొడక్షన్స్
కృష్ణ (నాగ శౌర్య)తులసి (సాయి పల్లవి) టీనేజ్ లో ప్రేమించుకొని పెద్దలు ఐదేళ్ళు గడిచాక పెళ్లి చేస్తాం అని చెప్పడంతో విడిపోయి సెటిల్ అయ్యాక పెళ్ళిచేసుకొని దంపతులుగా మారతారు. అయితే టీనేజ్ లో ఇద్దరూ కలిసి చేసిన ఓ తప్పు ను కప్పిపుచ్చడానికి వీరి కుటుంబాలు తీసుకున్న ఓ నిర్ణయం వల్ల అందరూ వరుసగా మృత్యువాత పడతారు. ఇంతకీ కృష్ణ – తులసి చేసిన తప్పేంటి… ఆ ఐదేళ్ళ తర్వాత వీరి జీవితం ఎలా సాగింది. పెళ్లి తర్వాత వీరి జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి.. అనేది మిగతా కథ.