
రారాజు
నటీనటులు : గోపీచంద్, మీరా జాస్మిన్
ఇతర నటీనటులు : అంకిత, శివాజీ, ఆశిష్ విద్యార్థి, జయ ప్రకాష్ రెడ్డి, చంద్ర మోహన్
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : ఉదయ శంకర్
ప్రొడ్యూసర్ : GVG రాజు
రిలీజ్ డేట్ : 20 అక్టోబర్ 2006
గోపీచంద్ హీరోగా ఉదయ్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కింది రారాజు. అతి సున్నితమైన లవ్ స్టోరి కి మాస్ ఎలిమెంట్స్ జోడించి ఇంటరెస్టింగ్ గా తెరకెక్కించాడు. ఈ సినిమాలో కలెక్టర్ కావాలని కలలు కనే ఆంబీషియస్ అమ్మాయిగా మీరా జాస్మిన్ సరికొత్తగా కనిపిస్తుంది. మణిశర్మ మ్యూజికే సినిమాకి హైలెట్.
==============================================================================

ప్రేమాభిషేకం
నటీనటులు : శ్రీహరి, వేణుమాధవ్, ప్రియా మోహన్
ఇతర నటీనటులు : రుతిక, ఆలీ, నాగబాబు, తదితరులు..
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి
డైరెక్టర్ : విక్రమ్ గాంధీ
ప్రొడ్యూసర్ : వేణు మాధవ్
రిలీజ్ డేట్ : 14 మార్చి 2008
వేణుమాధవ్, ప్రియా మోహన్ హీరో హీరోయిన్లుగా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ ప్రేమాభిషేకం. విక్రం గాంధీ డైరెక్షన్ చేసిన ఈ సినిమాకి చక్రి సంగీతం అందించాడు. శ్రీహరి పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచింది.
==============================================================================

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
నటీనటులు : వెంకటేష్, త్రిష
ఇతర నటీనటులు : శ్రీకాంత్, K. విశ్వనాథ్, కోట శ్రీనివాస రావు, స్వాతి రెడ్డి, సునీల్, ప్రసాద్ బాబు, సుమన్ శెట్టి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా
డైరెక్టర్ : శ్రీ రాఘవ
ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్, S. నాగ అశోక్ కుమార్
రిలీజ్ డేట్ : 27 ఏప్రియల్ 2007
వెంకటేష్, త్రిష నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా ఒక సరికొత్త లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇప్పటికే హాయ్ ఎండ్ ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉన్న వెంకటేష్ ని ఫ్యాన్స్ కి మరింత దగ్గర చేసిందీ సినిమా. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఈ సినిమాకే హైలెట్.
==============================================================================

తాజ్ మహల్
నటీ నటులు : శ్రీకాంత్, మోనికా బేడి, సంఘవి
ఇతర నటీనటులు : శ్రీహరి, రంగనాథ్, కోట శ్రీనివాస రావు, నూతన్ ప్రసాద్, సుధ, బ్రహ్మానందం
మ్యూజిక్ డైరెక్టర్ : M.M. శ్రీలేఖ
డైరెక్టర్ : ముప్పలనేని శివ
ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు
రిలీజ్ డేట్ : 25 మే 1995
శ్రీకాంత్ హీరోగా ముప్పలనేని శివ డైరెక్షన్ లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ తాజ్ మహల్. శ్రీకాంత్ ని లవర్ బాయ్ గా సిల్వర్ స్క్రీన్ పై లవర్ బాయ్ గా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా ఇది. శ్రీకాంత్ సరసన మోనికా బేడీ, సంఘవి నటించారు. M.M. శ్రీలేఖ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలెట్.
=============================================================================

బంపర్ ఆఫర్
నటీనటులు : సాయి రామ్ శంకర్, బిందు మాధవి
ఇతర నటీనటులు : సాయాజీ షిండే, చంద్ర మోహన్, కోవై సరళ, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్, అలీ, జయప్రకాశ్, వేణు మాధవ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె
డైరెక్టర్ : జయ రవీంద్ర
ప్రొడ్యూసర్ : పూరి జగన్నాథ్
రిలీజ్ డేట్ : 23 అక్టోబర్ 2009
సాయి రామ్ శంకర్, మిందు మాధవి జంటగా జయ రవీంద్ర దర్శకత్వం లో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మించిన సినిమా ‘బంపర్ ఆఫర్’. ఓ లో క్లాస్ కూర్రాడికి హై క్లాస్ అమ్మాయి కి మధ్య జరిగే లవ్ స్టోరీ తో మాస్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సాయి రామ్ శంకర్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్,బిందు మాధవి గ్లామర్, కోవై సరళ, ధర్మ వరపు, బ్రహ్మానందం, ఎమ్.ఎస్ కామెడీ, రఘు కుంచె మ్యూజిక్, షాయాజీ షిండే-సాయి రామ్ శంకర్ మధ్య వచ్చే సీన్స్ హైలైట్స్. అన్ని అంశాలు కలగలిపిన ఈ మాస్ ఎంటర్టైనర్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.
==============================================================================

ఒంగోలు గిత్త
నటీనటులు : రామ్ పోతినేని, కృతి కర్బందా
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కిషోర్ దాస్, ప్రభు, అజయ్, అభిమన్యు సింగ్, ఆహుతి ప్రసాద్, రమాప్రభ, రఘుబాబు, సంజయ్ రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్
డైరెక్టర్ : భాస్కర్
ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్
రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013
రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి, ఆ కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.
==============================================================================

బాణం
హీరో హీరోయిన్లు – నారా రోహిత్ ,వేదిక
ఇతర నటీనటులు – రాజీవ్ కనకాల, సాయాజీ షిండే తదితరులు
సంగీతం – మణిశర్మ
దర్శకత్వం – చైతన్య దంతులూరి
విడుదల తేదీ – 2009
ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న నారా రోహిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘బాణం’. తొలి సినిమా అయినప్పటికీ కథానాయకుడిగా నారా రోహిత్ తన దైన నటనతో మంచి మార్కులు అందుకున్నాడు. 2009 లో విడుదలైన ఈ చిత్రం లో నారా రోహిత్ సరసన వేదిక కథానాయికగా నటించింది. సందేశం తో కూడిన ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో నారా రోహిత్- వేదిక జంట అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో నారా రోహిత్ సీరియస్ యాక్టింగ్ తో పాటు మణి శర్మ అందించిన సంగీతం సినిమాకు హైలైట్. దర్శకుడి చైతన్య స్క్రీన్ ప్లే, మాటలు అందరినీ ఆకట్టుకొని పాత్ బ్రేకింగ్ హానెస్ట్ మూవీ గా నిలిచిపోయింది.