జీ సినిమాలు ( 14th ఆగష్టు )

Monday,August 13,2018 - 10:34 by Z_CLU

లక్కున్నోడు

నటీనటులు : విష్ణు మంచు, హన్సిక మోత్వాని

ఇతర నటీనటులు : రఘుబాబు, జయప్రకాష్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ప్రవీణ్ లక్కరాజు

డైరెక్టర్ : రాజ కిరణ్

ప్రొడ్యూసర్ : M.V.V. సత్య నారాయణ

రిలీజ్ డేట్ : జనవరి 26, 2017

చిన్నతనం నుంచి లక్ వెంట తెచ్చి అంతలోనే లక్ ను దూరం చేసే లక్కీ(విష్ణు) ని అన్ లక్కీ గా భావించి దూరం పెడతాడు లక్కీ తండ్రి భక్త వత్సల. ఇక ఉద్యోగ అవకాశం కోసం హైదరాబాద్ వచ్చిన లక్కీ కి పాజిటీవ్ గా ఆలోచించే పద్మ(హన్సిక ) పరిచయం అవుతుంది. తొలి చూపులోనే పద్మ ను చూసి ప్రేమలో పడిన లక్కీ, పద్మ ను ఎలా దక్కించుకున్నాడు? క్రమంలో తన అన్ లక్ కి కారణమైన జె.కె(ఎం.వి.వి.సత్యనారాయణ)ను ఎలా ఎదుర్కున్నాడు? చివరిగా 25 ఏళ్ళు దూరమైన తన తండ్రికి  మళ్ళీ ఎలా దగ్గరయ్యాడు? అనేది సినిమా కథాంశం.

=============================================================================

కళ్యాణ వైభోగమే

నటీనటులు : నాగశౌర్య, మాళవిక నాయర్

ఇతర నటీనటులు : రాశి, ఆనంద్, ప్రగతి, నవీన్ నేని, ఐశ్వర్య, తాగుబోతు రమేష్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కళ్యాణ్ కోడూరి

డైరెక్టర్ : B.V. నందిని రెడ్డి

ప్రొడ్యూసర్ : K.L. దామోదర్ ప్రసాద్

రిలీజ్ డేట్ : 4 మార్చి 2016

నందిని రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కళ్యాణ వైభోగమే. కేవలం పెద్దల బలవంతం పై పెళ్లి చేసుకున్న ఒక యువజంట పెళ్లి తరవాత ఏం చేశారు..? అనేదే సినిమా ప్రధానాంశం. యూత్ ఫుల్ కామెడీ సినిమాలో పెద్ద హైలెట్.

==============================================================================

బ్రహ్మోత్సవం

టీనటులు : మహేష్ బాబు, సమంత రుత్ ప్రభు, కాజల్ అగర్వాల్

ఇతర నటీనటులు : ప్రణీత సుభాష్, నరేష్, సత్యరాజ్, జయసుధ, రేవతి, శుభలేఖ సుధాకర్ మరియు తదితరులు…

మ్యూజిక్ డైరెక్టర్స్ : మిక్కీ జె. మేయర్, గోపీ సుందర్

డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల

ప్రొడ్యూసర్ : ప్రసాద్ V. పొట్లూరి

రిలీజ్ డేట్ :  20 మే 2016

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘బ్రహ్మోత్సవం.’ కుటుంబ విలువలను వాటి ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మహేష్ బాబును సరికొత్త ఆంగిల్ లో ప్రెజెంట్ చేశాడు. ఎప్పటికీ తన కుటుంబ సభ్యులు కలిసి మెలిసి ఉండాలన్న తన తండ్రి ఆలోచనలు పుణికి పుచ్చుకున్న హీరో, తన తండ్రి కలను ఎలా నేరవేరుస్తాడు అన్నదే సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

చిరుత

నటీనటులు : రామ్ చరణ్ తేజ, నేహా శర్మ

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, ఆలీ, సాయాజీ షిండే, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : పూరి జగన్నాథ్

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 28 సెప్టెంబర్ 2007

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన యాక్షన్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ రామ్ చరణ్ లోని పర్ఫామెన్స్ ని స్టామినాని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసింది. దానికి తోడు మణిశర్మ  సంగీతం సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది.  

==============================================================================

బాడీగార్డ్

నటీనటులు : వెంకటేష్, త్రిష, సలోని అశ్వని,

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, జయ ప్రకాష్ రెడ్డి, సుబ్బరాజు, తనికెళ్ళ భరణి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని

ప్రొడ్యూసర్ : బెల్లం కొండ సురేష్

రిలీజ్ డేట్ : 14 జనవరి 2012

వెంకటేష్, త్రిష జంటగా నటించిన మోస్ట్ హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ బాడీగార్డ్. గోపీచంద్ మాలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలో విక్టరీ వెంకటేష్ వెంకటేష్ పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

=============================================================================

ప్రేమలీల

నటీనటులు : సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్

ఇతర నటీనటులు : నీల్ నితిన్ ముకేష్, అనుపం ఖేర్, అర్మాన్ కోహ్లీ, స్వర భాస్కర్, ఆషిక భాటియా మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : హిమేష్ రేషమ్మియా

డైరెక్టర్ : సూరజ్ R. B.

ప్రొడ్యూసర్ : అజిత్ కుమార్ B.  కమాల్ కుమార్ B. రాజ్ కుమార్ B.

రిలీజ్ డేట్ : 12 నవంబర్ 2015

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ డ్యూయల్ రోల్ ప్లే చేసిన ఇమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రేమలీల. ప్రిన్స్ యువరాజ్ సింగ్ పట్టాభిషేకం జరిగే సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్లేస్ లో యువరాజ్ లా కనిపించే ప్రేమ్ చేరతాడు. తరవాత ప్రేమ్ తో రాకుమారి మైథిలి తో ఎంగేజ్ మెంట్ కూడా జరుగుతుంది. అసలు ప్రేమ్ యువరాజ్ ని రీప్లేస్ చేయాల్సిన అవసరం ఏంటి..? అసలు ప్రేమ్ అక్కడికి ఎందుకు వచ్చాడు అనేది సినిమాలోని ప్రధాన కథాంశం.