జీ సినిమాలు ( 13th సెప్టెంబర్)

Tuesday,September 12,2017 - 10:02 by Z_CLU

రారాజు

నటీనటులు : గోపీచంద్, మీరా జాస్మిన్

ఇతర నటీనటులు : అంకిత, శివాజీ, ఆశిష్ విద్యార్థి, జయ ప్రకాష్ రెడ్డి, చంద్ర మోహన్

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : ఉదయ శంకర్

ప్రొడ్యూసర్ : GVG రాజు

రిలీజ్ డేట్ : 20 అక్టోబర్ 2006

గోపీచంద్ హీరోగా ఉదయ్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కింది రారాజు. అతి సున్నితమైన లవ్ స్టోరి కి  మాస్ ఎలిమెంట్స్ జోడించి ఇంటరెస్టింగ్ గా తెరకెక్కించాడు. ఈ సినిమాలో కలెక్టర్ కావాలని కలలు కనే ఆంబీషియస్ అమ్మాయిగా మీరా జాస్మిన్ సరికొత్తగా కనిపిస్తుంది.  మణిశర్మ మ్యూజికే సినిమాకి హైలెట్.

=============================================================================

 

శశిరేఖా పరిణయం

హీరో హీరోయిన్లు – తరుణ్ ,జెనీలియా

ఇతర నటీనటులు – పరుచూరి గోపాలకృష్ణ, ఆహుతి ప్రసాద్, సుబ్బరాజు, రఘు బాబు తదితరులు

సంగీతం      –  మణిశర్మ, విద్య సాగర్

దర్శకత్వం  –  కృష్ణ వంశీ

విడుదల తేదీ – 2009

 వరుస ప్రేమ కథా చిత్రాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ అందుకొని లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న తరుణ్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసిన చిత్రం ‘శశిరేఖ పరిణయం’. జెనీలియా శశి రేఖ గా నటించిన ఈ చిత్రం  2009 లో విడుదలైంది. ఈ చిత్రం తో తొలి సారిగా జత కట్టారు తరుణ్-జెనీలియా. కాబోయే భార్య భర్తల మధ్య ఎమోషనల్ సన్నివేశాలతో లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా బాగా అలరించింది. ఈ చిత్రం లో పెళ్లంటే భయపడే అమ్మాయి పాత్రలో  జెనీలియా నటన, ఒక అమ్మాయి గురించి తన జీవితం గురించి ఆలోచించే యువకుడి పాత్రలో తరుణ్ అందరినీ ఆకట్టుకున్నారు. తన ప్రతి సినిమాలో కుటుంబ విలువలను చాటి చెప్పే క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ఈ చిత్రాన్ని కూడా అదే కోవలో ఫ్యామిలీ అంశాలతో కూడిన లవ్ ఎంటర్టైనర్ గా రూపొందించి అలరించారు.

=============================================================================

 

బొమ్మరిల్లు

నటీనటులు : సిద్ధార్థ్, జెనీలియా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, జయసుధ, సత్య కృష్ణన్, సుదీప పింకీ, సురేఖా వాణి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : భాస్కర్

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 9 ఆగష్టు 2006

తండ్రి కొడుకుల అనుబంధాన్ని అద్భుతంగా తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బొమ్మరిల్లు. న్యాచురల్ పర్ఫామెన్స్ అలరించిన జెనీలియా, సిద్ధార్థ్ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

=============================================================================

 

మహానంది

నటీనటులు – సుమంత్, అనుష్క

ఇతర నటీనటులు – శ్రీహరి, సుమన్, కోటశ్రీనివాసరావు, సాయికిరణ్

సంగీత దర్శకుడు –  కృష్ణమోహన్

దర్శకుడు – సముద్ర

విడుదల తేదీ – 2005, డిసెంబర్ 3

సూపర్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన అనుష్క.. తన రెండో ప్రయత్నంగా చేసిన మూవీ మహానంది. సూపర్ తో సక్సెస్ కొట్టిన స్వీటీ… మహానందితో కూడా మరో సక్సెస్ అందుకుంది. ఆర్ ఎస్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీహరి ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించారు. ఈ సినిమా హిందీలో ఏక్ ఔర్ మహాయుధ్… మలయాళంలో ఉల్లాసం పేర్లతో డబ్ అయింది.

==============================================================================

 

కొత్తజంట

నటీనటులు :అల్లు శిరీష్ , రెజీనా

ఇతర నటీనటులు : మధు నందన్, సప్తగిరి, మధురిమ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జె.బి

డైరెక్టర్ : మారుతి

ప్రొడ్యూసర్ : బన్నీ వాస్

రిలీజ్ డేట్ : మే 1 , 2014

అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘కొత్త జంట’ ఓ సందర్భం లో కలిసిన ఓ ఇద్దరు టి.వి. ప్రోగ్రాం ద్వారా ఎలా పరిచయం అయ్యి ప్రేమలో పడ్డారు అనే కధాంశం తో దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ చిత్రం లో అల్లు శిరీష్, రెజీనా మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, ప్రోగ్రాం కామెడీ, మ్యూజిక్ హైలైట్స్.

=============================================================================

యుగానికొక్కడు

నటీనటులు : కార్తీ, రీమా సేన్ , ఆండ్రియా

మ్యూజిక్ డైరెక్టర్ : జి.వి.ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : సెల్వ రాఘవన్

ప్రొడ్యూసర్ : ఆర్.రవీంద్రన్

విడుదల : జనవరి 14 , 2010

కార్తీ, రీమా సేన్, ఆండ్రియా లతో దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన ఎడ్వెంచర్ ఎంటర్టైనర్ చిత్రం ‘యుగానికొక్కడు’. చోళుల సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలనుకొనే ఓ అమ్మాయి ఓ ఇద్దరి సహాయం తో ఆ స్థలాన్ని చివరికీ ఎలా కనిపెట్టింది అనే కధాంశం తో తెరకెక్కిన ఈ చిత్రం లో చోళుల సామ్రాజ్యానికి ప్రయాణించే సీన్స్, చోళుల సామ్రాజ్యం లోకి ప్రవేశించే సీన్స్, ప్రవేశించిన తరువాత థ్రిల్లింగ్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. ఈ చిత్రం లో కార్తీ నటన, రీమా సేన్, ఆండ్రియా గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్స్.