జీ సినిమాలు ( 13th అక్టోబర్ )

Friday,October 12,2018 - 08:06 by Z_CLU

స్ట్రాబెర్రీ

నటీనటులు : పా. విజయ్ అవని మోడీ

ఇతర నటీనటులు :  సముథిరఖని యువీని పార్వతివేత్రిదేవయానికవితాలయ కృష్ణన్ తదిరులు

మ్యూజిక్ డైరెక్టర్ : తాజ్ నూర్ 

డైరెక్టర్ : పా.విజయ్

ప్రొడ్యూసర్ : పా.విజయ్

రిలీజ్ డేట్ : 11 సెప్టెంబర్  2015

పా. విజయ్ హీరోగా స్వీయ దర్శకత్వం లో  తెరకెక్కిన హారర్ కామెడీ ఎంటర్టైనర్  ‘స్ట్రాబెరి’. ఈ సినిమాలో హారర్ కామెడీ రొమాంటిక్ సీన్స్తాజ్ నూర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అలరిస్తాయి. ఆధ్యంతం ఉతకంత భరితమైన స్క్రీన్ ప్లే సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లింగ్ ప్రతి క్షణం థ్రిల్ కలిగిస్తుంది. ఫస్ట్ సీన్ నుండి క్లైమాక్స్ వరకూ భయపెట్టే స్క్రీన్ ప్లే ఈ సినిమాకు హైలైట్.

==============================================================================

కొత్త బంగారు లోకం 

నటీనటులు : వరుణ్ సందేశ్శ్వేత బసు ప్రసాద్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్జయసుధఆహుతి ప్రసాద్రజితబ్రహ్మానందం మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ జె. మేయర్

డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 9 అక్టోబర్ 2008

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన కొత్త బంగారు లోకంలో వరుణ్ సందేశ్శ్వేతా బసు ప్రసాద్ హీరో హీరోయిన్ గా నటించారు. రిలీజయిన ప్రతి సెంటర్ లోను అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్. మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

==============================================================================

దమ్ము

నటీనటులు : N.T.R, త్రిష కృష్ణన్, కార్తీక నాయర్

ఇతర నటీనటులు : వేణు తొట్టెంపూడి, అభినయ, భానుప్రియ, నాజర్, సుమన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, సంపత్ రాజ్, కిషోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి

డైరెక్టర్ : బోయపాటి శ్రీను

ప్రొడ్యూసర్ : అలెగ్జాండర్ వల్లభ

రిలీజ్ డేట్ : 27 ఏప్రియల్ 2012

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన అల్టిమేట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ దమ్ము. N.T.R స్టామినా పర్ ఫెక్ట్ గా ఎలివేట్ అయిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించాడు. యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

దంగల్
నటీనటులు : ఆమీర్ ఖాన్, సాక్షి తన్వర్, ఫాతిమా సన షేక్, జైరా వసీం, సాన్య మల్హోత్రా తదితరులు
డైరెక్టర్ : ప్రీతమ్
డైరెక్టర్ : నితేష్ తివారి
ప్రొడ్యూసర్ : అమీర్ ఖాన్, కిరణ్ రావ్, సిద్ధార్థ్ రాయ్ కపూర్
రిలీజ్ డేట్ : డిసెంబర్ 21, 2016
తన లైఫ్ లో గోల్డ్ మెడల్ సాధించలేదని దిగులుగా ఉన్నా, తన కూతుళ్ళను ప్రపంచం గుర్తించే స్థాయిలో బాక్సింగ్ చాంపియన్ చేసే ఒక తండ్రి కథే దంగల్. కథ ప్రాధాన్యత ఉన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది.

=============================================================================

కణం

నటీనటులు : నాగశౌర్య, సాయి పల్లవి

ఇతర నటీనటులు : బేబీ వెరోనికా, ప్రియదర్శి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : C. స్యామ్

డైరెక్టర్ : A.L. విజయ్

ప్రొడ్యూసర్స్ : లైకా ప్రొడక్షన్స్

కృష్ణ (నాగ శౌర్య), తులసి (సాయి పల్లవి) టీనేజ్ లో ప్రేమించుకొని పెద్దలు ఐదేళ్ళు గడిచాక పెళ్లి చేస్తాం అని చెప్పడంతో విడిపోయి సెటిల్ అయ్యాక పెళ్ళిచేసుకొని దంపతులుగా మారతారు. అయితే టీనేజ్ లో ఇద్దరూ కలిసి చేసిన ఓ తప్పు ను కప్పిపుచ్చడానికి వీరి కుటుంబాలు తీసుకున్న ఓ నిర్ణయం వల్ల అందరూ వరుసగా మృత్యువాత పడతారు. ఇంతకీ కృష్ణ తులసి చేసిన తప్పేంటిఆ ఐదేళ్ళ తర్వాత వీరి జీవితం ఎలా సాగింది. పెళ్లి తర్వాత వీరి జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి.. అనేది మిగతా కథ.

=============================================================================

 

ఆచారి అమెరికా యాత్ర

నటీనటులు : మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్

ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్, రాజా రవీంద్ర, ఠాకూర్ అనూప్ సింగ్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. థమన్

డైరెక్టర్ : G. నాగేశ్వర రెడ్డి

ప్రొడ్యూసర్స్ : కీర్తి చౌదరి, కిట్టు

రిలీజ్ డేట్ : 27 ఏప్రిల్ 2018  

కృష్ణమా చారి( విష్ణు), అప్పలా చారి (బ్రహ్మానందం) గురు శిష్యులుతమ టీంతో కలిసి పూజలు చేస్తుంటారు.అయితే ఓసారి చక్రపాణి(కోట శ్రీనివాసరావు)అనే పెద్ద మనిషి ఇంట్లో హోమం చేయించడానికి వెళ్ళినప్పుడు అమెరికా నుంచి వచ్చిన ఆయన మనవరాలు రేణుక(ప్రగ్యా జైస్వాల్)తో ప్రేమలో పడతాడు కృష్ణమాచార్య. అదే సమయంలో రేణుక మీద హత్య ప్రయత్నం జరుగుతుంది. హోమం చివరి రోజు అనుకోకుండా చక్రపాణి చనిపోతాడు. రేణుక కూడా కనుమరుగై పోతుంది. అయితే రేణుక అమెరికా వెళ్లిందని తెలుసుకుని అప్పలాచారికి ఉద్యోగ ఆశ చూపించి ఎట్టకేలకు తన టీంతో కలిసి అమెరికా వెళతాడు కృష్ణమాచార్య. అలా రేణుక ను కలుసుకోవడానికి అమెరికాకు వెళ్ళిన కృష్ణమాచారి రేణుకకు విక్కీతో పెళ్లి జరగబోతుందని తెలుసుకుంటాడు. ఇక విక్కీ నుండి రేణుకను ఎలా కాపాడాడు చివరికి కృష్ణమాచార్య తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనేదే బాలన్స్ కథ.

==============================================================================

చిన్నారి

నటీనటులు : ప్రియాంక ఉపేంద్ర, బేబీ యువిన ఐశ్వర్య షిందోగి, మదిసూధన రావు

మ్యూజిక్ డైరెక్టర్ : B. అజనీత్ లోకనాథ్

డైరెక్టర్ : లోహిత్ M.

ప్రొడ్యూసర్ : K. రవి కుమార్

రిలీజ్ డేట్ : డిసెంబర్ 16, 2016

 ప్రియాంక ఉపేంద్ర నటించిన చిన్నారి మూవీ పర్ఫెక్ట్ హారర్ ఎంటర్ టైనర్. చనిపోయిన తన భర్త కోరిక మేరకు గర్భవతి అయిన ప్రియా తన 6 ఏళ్ల కూతురు క్రియ, ఇంకో ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి గోవాలోని తన విల్లాకి వెళుతుంది. అక్కడకు వెళ్లిన కొద్ది రోజుల తరువాత విల్లాలో జరిగే విచిత్రమైన కొన్ని సంఘటనలు వాళ్లకు భయాన్ని కలిగిస్తాయి.

ఆ ఇంట్లో ఉన్న ఏదో అదృశ్య శక్తి ప్రియను, ఆమె కూతురు క్రియను, ఇతర కుటుంబ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు ? అది ప్రియను, ఆమె కూతురు క్రియను ఎందుకు ఇబ్బంది పెడుతోంది ? ఆ అదృశ్య శక్తి బారి నుండి ప్రియ, క్రియలు తప్పించుకున్నారా లేదా ? అనేదే ఈ సినిమా కథ. హారర్ ఎలిమెంట్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి.