జీ సినిమాలు ( 13th జూన్ )

Wednesday,June 12,2019 - 10:06 by Z_CLU

ఇది మా ప్రేమకథ
నటీనటులు : రవిమేఘనా లోకేష్
ఇతర నటీనటులు : ప్రభాస్ శ్రీనుప్రియదర్శితులసి శివమణి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : కార్తీక్ కొడకండ్ల
డైరెక్టర్ అయోధ్య కార్తీక్
ప్రొడ్యూసర్ : P.L. K. రెడ్డి
రిలీజ్ డేట్ : డిసెంబర్ 15, 2017
రవిమేఘన లోకేష్ జంటగా నటించిన ఇమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ ‘ఇది మా ప్రేమకథ’. అప్పటివరకు టెలివిజన్ షోస్ లో ఎంటర్టైన్ చేసిన రవి ఏ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. హీరోయిన్ మేఘా లోకేష్ కి కూడా ఇది డెబ్యూ మూవీ కావడం విశేషం.
ఇక సినిమా విషయానికి వస్తే అరుణ్ (రవి) సంధ్యను చూసి చూడగానే ప్రేమలో పడతాడు. కొన్నాళ్ళకు సంధ్య కూడా రవికి దగ్గరవుతుంది. ఈ లవ్ స్టోరీ సరిగ్గా ట్రాక్ లో పడే మూమెంట్ లో ప్రియ అనే అమ్మాయి రావడందానికి మరికొన్ని ఇన్సిడెంట్స్ జతై అరుణ్సంధ్య విడిపోతారు. అసలు అంతగా ప్రేమించుకున్న జంట విడిపోవడానికి కారణమేంటి..వీళ్ళిద్దరినీ మళ్ళీ ఒకటి చేసిన సందర్భమేమిటన్నది జీ సినిమాలు చూడాల్సిందే.

==============================================================================

కథానాయకుడు

నటీనటులు : రజినీ కాంత్జగపతి బాబుమీనానయన తార

ఇతర నటీనటులు మమత మోహన్ దాస్ప్రభువిజయ్ కుమార్బ్రహ్మానందంఆలీసునీల్, M.S.నారాయణ

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : P.వాసు

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 1 ఆగష్టు 2008

ఒక ఇమోషనల్ కథాంశంతో తెరకెక్కిందే కథానాయకుడు సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఫ్రెండ్ గా నటించాడు జగపతి బాబు ఈ సినిమాలో. ఒక పెద్ద స్టార్ కిఒక మధ్య తరగతి సాధారణ వ్యక్తికి మధ్య ఉండే స్నేహానికి ప్రతిబింబమే ఈ కథా నాయకుడు. ఈ సినిమాకి P. వాసు డైరెక్టర్.

==============================================================================

హైపర్
నటీనటులు : రామ్ పోతినేనిరాశిఖన్నా
ఇతర నటీనటులు : సత్యరాజ్నరేష్రావు రమేష్తులసి శివమణిప్రభాస్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్
డైరెక్టర్ : సంతోష్ శ్రీనివాస్
ప్రొడ్యూసర్ : రామ్ ఆచంటగోపీ ఆచంటఅనిల్ సుంకర
రిలీజ్ డేట్ : 30 సెప్టెంబర్ 2016
వైజాగ్ లో  ప్రభుత్వ ఆఫీస్ లో ఉద్యోగిగా పనిచేసే నారాయణ మూర్తి(సత్య రాజ్) కొడుకు సూర్య( రామ్) తన నాన్నని అమితంగా ప్రేమిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. అయితే అంతలో ఎంతో నిజాయితీగా ఉద్యోగం చేస్తూ త్వరలో రిటైర్ కాబోయే నారాయణ మూర్తిని టార్గెట్ చేస్తాడు మినిస్టర్ రాజప్ప(రావు రమేష్). అలా నారాయణమూర్తిని టార్గెట్ చేసిన రాజప్ప… గజ(మురళి శర్మ)తో కలిసి నారాయణ మూర్తిని చంపాలని చూస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సూర్య తన తండ్రిని ఎలా కాపాడుకున్నాడు. మినిస్టర్ రాజప్పను ఎలా సవాలు చేసి ఎదుర్కొన్నాడుఅనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

=============================================================================

నాగవల్లి
నటీనటులు : వెంకటేష్అనుష్క శెట్టి
ఇతర నటీనటులు రజినీకాంత్జ్యోతికరిచా గంగోపాధ్యాయశ్రద్దా దాస్కమలినీ ముఖర్జీపూనం కౌర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ గురుకిరణ్
డైరెక్టర్ : P. వాసు
ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 16 డిసెంబర్ 2010
విక్టరీ వెంకటేష్అనుష్క నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ నాగవల్లి. రజినీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ ఈ సినిమా. అనుష్క నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.

==============================================================================

కందిరీగ
నటీనటులు : రామ్హన్సిక  మోత్వాని
ఇతర నటీనటులు : అక్ష పార్ధసానిజయ ప్రకాష్ రెడ్డిసోను సూద్జయ ప్రకాష్ రెడ్డిచంద్ర మోహన్శ్రీనివాస రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్
డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్
ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 12 ఆగష్టు 2011
ఎనర్జిటిక్ స్టార్ రామ్హన్సిక మోత్వాని జంటగా నటించిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కందిరీగ. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్ గా నిలిచింది.

=============================================================================

చిరుత

నటీనటులు : రామ్ చరణ్ తేజనేహా శర్మ

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్ఆశిష్ విద్యార్థిబ్రహ్మానందంఆలీసాయాజీ షిండే, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : పూరి జగన్నాథ్

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 28 సెప్టెంబర్ 2007

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ రామ్ చరణ్ లోని పర్ఫామెన్స్ ని స్టామినాని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసింది. దానికి తోడు మణిశర్మ సంగీతం సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది.