జీ సినిమాలు ( 13th డిసెంబర్ )

Tuesday,December 12,2017 - 10:02 by Z_CLU

శీనుగాడు చిరంజీవి ఫ్యాన్

హీరో  హీరోయిన్లు – విజయవర్థన్, మన్సి ప్రీతమ్

ఇతర నటీనటులు – ఆదిన్ ఖాన్, నాగబాబు, శివాజీ రాజా, వేణుమాధవన్, ఎల్బీ శ్రీరామ్

సంగీతం – శివ కాకాని

స్క్రీన్ ప్లే – దర్శకత్వం –  పూసల రాధాకృష్ణ

విడుదల తేదీ – 2005, నవంబర్ 23

ఓ చిన్న ప్రేమకథకు చిరంజీవి కనెక్షన్ ను యాడ్ చేసి అందంగా చెప్పిన సినిమా శీనుగాడు చిరంజీవి ఫ్యాన్స్. మెగాస్టార్ చిరంజీవి గొప్పదనాన్ని చాటిచెబుతూనే, చిరు నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ కు ఈ కథతో ముడిపెట్టడం సినిమాకు హైలెట్. అందుకే ఈ సినిమాకు శీనుగాడు చిరంజీవి ఫ్యాన్ అనే టైటిల్ పెట్టారు. టైటిల్ కు తగ్గట్టే సినిమాలో హీరో చిరంజీవికి హార్డ్ కోర్ ఫ్యాన్ గా నటించాడు. చాలా సందర్భాల్లో చిరంజీవి మేనరిజమ్స్ ను చక్కగా అనుకరించి చూపించాడు హీరో విజయ్ వర్థన్. దాదాపు మెగాస్టార్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమాను చూశారు. ఓ మంచి స్టోరీలైన్ తో పాటు… కామెడీ సన్నివేశాలు కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్.

==============================================================================

కౌసల్య రామ  సుప్రజా

నటీనటులు : శ్రీకాంత్, చార్మీ

ఇతర నటీనటులు : శివాజీ, గౌరీ ముంజల్, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, రఘుబాబు, కృష్ణ భగవాన్, L.B. శ్రీరామ్, చలపతి రావు, హేమ, సన తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : సూర్య ప్రసాద్

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 2008 అక్టోబర్ 9

అప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ లో మూడు సినిమాల్లో నటించిన శ్రీకాంత్ తో రామానాయుడు గారు నిర్మించిన నాలుగో సినిమా కౌసల్యా సుప్రజా రామ. అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సూర్యప్రకాష్ దర్శకుడు.

=============================================================================

వసంతం 

నటీనటులు : వెంకటేష్, ఆర్తి అగర్వాల్, కళ్యాణి

ఇతర నటీనటులు : V.V.S. లక్ష్మణ్, ఆకాష్, సునీల్, చంద్ర మోహన్, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్

డైరెక్టర్ : విక్రమన్

ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్

రిలీజ్ డేట్ : 11 జూలై 2003

స్నేహానికి, ప్రేమకు మధ్య డిఫెరెన్స్ ని అద్భుతంగా ఎలివేట్ చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వసంతం. ఎంత పెద్ద త్యాగానికైనా వెనకాడని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కథే ఈ సినిమా. ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి.

=============================================================================

 ఓ మై  ఫ్రెండ్

హీరో  హీరోయిన్లు – సిద్దార్థ్, శృతిహాసన్

ఇతర నటీనటులు – నవదీప్, హన్సిక,

సంగీతం – రాహుల్ రాజ్

నిర్మాత – దిల్ రాజు

దర్శకత్వం – వేణుశ్రీరాం

విడుదల – 2011, నవంబర్ 11

స్నేహానికి  సరికొత్త అర్థాన్నిస్తూ తెరకెక్కిన ఓ మై ఫ్రెండ్ సినిమాకు చాలా విశేషాలున్నాయి. తెలుగులో  శృతిహాసన్ కు ఇది రెండో సినిమా. అయితే శృతిహాసన్ కంటే ముందే  ఆ క్యారెక్టర్ కోసం సమంతను అనుకున్నారు. అప్పటికే ఏమాయచేశావెతో సక్సెస్ అందుకున్న సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని దిల్ రాజు కూడా అనుకున్నాడు. ఆ తర్వాత అమలాపాల్, నిత్యామీనన్ లాంటి హీరోయిన్లపై కూడా ఫొటోషూట్ చేశారు. ఫైనల్ గా హీరో సిద్ధార్థ్ పట్టుబట్టి మరీ శృతిహాసన్ ను తీసుకున్నాడు. ఈ సినిమాతోనే వేణుశ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కాగా.. ఇదే మూవీతో మలయాళం ఇండస్ట్రీకి చెందిన రాహుల్ రాజ్ సంగీత దర్శకుడిగా కూడా పరిచయం అయ్యాడు. ఆన్ లైన్ లో పైరసీ జరగకుండా నిరోధించే అత్యాధునిక టెక్నాలజీ ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయమైంది.

==============================================================================

తులసి

నటీనటులు : వెంకటేష్, నయనతార

ఇతర నటీనటులు : రమ్యకృష్ణ,  శ్రియ, మాస్టర్ అతులిత్, ఆశిష్ విద్యార్థి, రాహుల్ దేవ్, శివాజీ, జయ ప్రకాష్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : బోయపాటి శ్రీను

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 12 డిసెంబర్ 2007

వెంకటేష్, నయనతార జంటగా నటించిన అల్టిమేట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ తులసి. బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన ప్రతి సెంటర్ లోను సూపర్ హిట్టయింది. సెంటిమెంట్, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి. రమ్యకృష్ణ క్యారెక్టర్ సినిమాకి ప్లస్.

=============================================================================

సీతారాముల కళ్యాణం లంకలో

నటీనటులు : నితిన్, హన్సిక

ఇతర నటీనటులు : సుమన్, సలీమ్, చంద్ర మోహన్, ప్రగతి, బ్రహ్మానందం, వేణు మాధవ్, ఆలీ, M.S.నారాయణ, సుబ్బరాజు, దువ్వాసి మోహన్, జయ ప్రకాష్ రెడ్డి

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : ఈశ్వర్

ప్రొడ్యూసర్ : మల్ల విజయ్ ప్రసాద్

రిలీజ్ డేట్ : జనవరి 22, 2010

భయమంటే ఏమిటో తెలియని ఒక యంగ్ స్టర్ ఫ్యాక్షనిస్ట్ కూతురితో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమను దక్కించుకోవడానికి, తను ప్రేమించిన అమ్మాయిని ప్రమాదం నుండి కాపాడటానికి ఏం చేశాడు అనే కథాంశంతో తెర కెక్కింది సీతారాముల కళ్యాణం లంకలో. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి.