జీ సినిమాలు ( 13th ఏప్రిల్ )

Thursday,April 12,2018 - 10:04 by Z_CLU

కౌసల్యా సుప్రజా  రామా 

నటీనటులు : శ్రీకాంత్, చార్మీ

ఇతర నటీనటులు : శివాజీ, గౌరీ ముంజల్, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, రఘుబాబు, కృష్ణ భగవాన్, L.B. శ్రీరామ్, చలపతి రావు, హేమ, సన తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : సూర్య ప్రసాద్

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 2008 అక్టోబర్ 9

అప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ లో మూడు సినిమాల్లో నటించిన శ్రీకాంత్ తో రామానాయుడు గారు నిర్మించిన నాలుగో సినిమా కౌసల్యా సుప్రజా రామ. అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సూర్యప్రకాష్ దర్శకుడు.

==============================================================================

అష్టా చెమ్మా

నటీనటులు : నాని, శ్రీనివాస్ అవసరాల, స్వాతి, భార్గవి

ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, హేమ, ఝాన్సీ, వాసు ఇంటూరి, శివన్నారాయణ, రాగిణి

మ్యూజిక్ డైరెక్టర్ : కల్యాణి మాలిక్

డైరెక్టర్ : మోహన్ కృష్ణ ఇంద్రగంటి

ప్రొడ్యూసర్ : రామ్ మోహన్

రిలీజ్ డేట్ : 5 సెప్టెంబర్ 2008

నాని, అవసరాల శ్రీనివాస్, స్వాతి, భార్గవి నలుగురికి ఒకేసారిగా ఓ రేంజ్ స్టార్ డం ని తీసుకొచ్చి పెట్టిన సినిమా ‘అష్టా చెమ్మా’. సూపర్ స్టార్ మహేష్ బాబుని పెళ్ళి చేసుకోవాలనుకునే లావణ్య చివరికి మహేష్ అనే పేరున్నా చాలు అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. ఆ తరవాత ఏం జరిగింది అన్నదే ప్రధాన కథాంశం.

==============================================================================

ఒంగోలు గిత్త

నటీనటులు : రామ్ పోతినేని, కృతి కర్బందా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కిషోర్ దాస్, ప్రభు, అజయ్, అభిమన్యు సింగ్, ఆహుతి ప్రసాద్, రమాప్రభ, రఘుబాబు, సంజయ్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : భాస్కర్

ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్

రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013

రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి, ఆ కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.

==============================================================================

మొగుడు

నటీ నటులు : గోపీచంద్, తాప్సీ పన్ను

ఇతర నటీనటులు : శ్రద్ధా దాస్, రాజేంద్ర ప్రసాద్, రోజా, నరేష్, ఆహుతి ప్రసాద్, వేణు మాధవ్

మ్యూజిక్ డైరెక్టర్ : బాబు శంకర్

డైరెక్టర్ : కృష్ణవంశీ

ప్రొడ్యూసర్ : నల్లమలుపు బుజ్జి

రిలీజ్ డేట్ : 4 నవంబర్ 2011

కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన మొగుడు  పక్కా రొమాంటి ఎంటర్ టైనర్. ఈ సినిమాలో గోపీచంద్, తాప్సీ జంటగా నటించారు. తండ్రి, అక్కా చెల్లెళ్ళ కోసం భార్యను వదులుకున్న హీరో, తిరిగి తనను తన లైఫ్ లోకి ఎలా తెచ్చుకుంటాడు అన్నదే ప్రధాన కథాంశం.

==============================================================================

భీమవరం బుల్లోడు

నటీనటులు : సునీల్, ఎస్తర్ నోరోన్హా

ఇతర నటీనటులు : విక్రమ్ జీత్ విర్క్, సాయాజీ షిండే, రఘుబాబు, సుబ్బరాజు, సత్య రాజేష్, తెలంగాణ శకుంతల మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : ఉదయ్ శంకర్

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 27 ఫిబ్రవరి 2014

తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉండటంతో ఇంకా ఎన్నో రోజులు బ్రతకనని తెలుసుకున్న రాంబాబు, ఆ మిగిలిన కొన్ని రోజులు సొసైటీలో చేంజ్ తీసుకురావడం  కోసం స్పెండ్ చేయాలనుకుంటాడు. అల్టిమేట్ గా తన చుట్టూరా జరుగుతున్న రౌడీయిజాన్ని అంతం చేయాలనుకుంటాడు. ఈ ప్రాసెస్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాడు. తీరా కొన్ని రోజుల తరవాత తన ప్రాణాలకు ఏ ఆపద లేదని, అసలు తనకు బ్రెయిన్ ట్యూమరే లేదని తెలుస్తుంది రాంబాబుకి. ఆ తర్వాత రాంబాబు ఏం చేస్తాడు..? మళ్ళీ మునుపటిలాగే సాధారణంగా బ్రతికేస్తాడా..? సొసైటీ కోసం తను చేసే పోరాటాన్ని కంటిన్యూ చేస్తాడా..? అనేదే సినిమాలోని ప్రధాన కథాంశం.

==============================================================================

లండన్  బాబులు 

నటీనటులు : స్వాతి, రక్షిత్

ఇతర నటీనటులు : మురళి శర్మ, ఆలీ, రాజా రవీంద్ర, జీవా, సత్య, ధనరాజ్, అజయ్ ఘోష్, సాయి, సత్యకృష్ణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కె.

డైరెక్టర్ : చిన్నికృష్ణ

ప్రొడ్యూసర్ : మారుతి

రిలీజ్ డేట్ : 17 నవంబర్ 2017

అంతర్వేది అనే పల్లెటూరిలో సాధారణ కుర్రాడిగా జీవితాన్ని గడిపే గాంధీ(రక్షిత్) అప్పుల కారణంగా దొంగదారిన లండన్ వెళ్లి డబ్బు సంపాదించాలని స్నేహితుడు(సత్య)తో కలిసి హైదరాబాద్ వస్తాడు. పాస్ పోర్టు నుంచి ఇమ్మిగ్రేషన్ వీసా వరకూ జరిగే అన్యాయం నేపథ్యంలో గాంధీ… సూర్య కాంతం( స్వాతి)ని ఎలా కలుస్తాడు. ఈ క్రమంలో గాంధీ కి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి..లండన్ వెళ్లాలని ఎన్నో కలలు కన్న గాంధీ చివరికీ లండన్ వెళ్లగలిగాడా… అనేది సినిమా కథాంశం.