జీ సినిమాలు ( 12th అక్టోబర్ )

Friday,October 11,2019 - 10:03 by Z_CLU

సుబ్రహ్మణ్యపురం

నటీనటులు : సుమంత్ఈషా రెబ్బ

ఇతర నటీనటులు : సురేష్తనికెళ్ళ భరణిసాయి కుమార్ఆలీసురేష్జోష్ రవిభద్రం గిరిమాధవిహర్షిని, TNR తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : సంతోష్ జాగర్లపూడి

ప్రొడ్యూసర్ : బీరం సుధాకర్ రెడ్డి

రిలీజ్ డేట్ : 7 డిసెంబర్ 2018

నాస్తికుడైన కార్తీక్ (సుమంత్) దేవాలయాలపై పరిశోధనలు చేస్తుంటుంటాడు. ఈ క్రమంలో మహా భక్తురాలైన ప్రియ( ఈషా)ను తొలి చూపులోనే ఆమె మంచితనం చూసి ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యపురం అనే గ్రామంలో ఊహించని రీతిలో వరుసగా ఆత్మహత్యలు జరుగుతుంటాయి. ఆ ఊరికి ప్రెసిడెంట్ అయిన వర్మ(సురేష్) ఊరిలో ఎం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నించినా అది అంతు చిక్కని సమస్యలా కనిపిస్తుంది. అయితే ప్రియ ద్వారా సుబ్రహ్మణ్యపురం ఊరిలో అడుగుపెట్టిన కార్తీక్ ఆ ఆత్మ హత్యలపై రీ సెర్చ్ మొదలుపెడతాడు. అలా రీ సెర్చ్ మొదలుపెట్టిన కార్తీక్ పది రోజుల్లో సుబ్రహ్మణ్యపురం గుడి వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదిస్తానని ఊరి ప్రజలకు మాటిస్తాడు. ఇంతకీ సుబ్రహ్మణ్యపురం ఏం జరిగింది… చివరికి కార్తీక్ ఆ రహస్యాన్ని ఎలా ఛేదించాడు అనేది మిగతా కథ.

============================================================================

రామయ్యా వస్తావయ్యా
నటీనటులు : NTR, శృతి హాసన్సమంత రుత్ ప్రభు
ఇతర నటీనటులు : విద్యుల్లేఖ రమణ్, P.రవి శంకర్ముకేష్ రిషికోట శ్రీనివాస్ రావురావు రమేష్తనికెళ్ళ భరణి
సంగీతం : S.S. తమన్
డైరెక్టర్ : హరీష్ శంకర్
నిర్మాత : దిల్ రాజు
జూనియర్ ఎన్టీఆర్ కరియర్ లోనే కలర్ ఫుల్ గా ఎంటర్ టైనర్ గా నిలిచింది రామయ్యా వస్తావయ్య. శృతి హాసన్సమంతా లు హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ లో లవర్ బాయ్ లాజాలీగా ఉండే కుర్రాడిలా ఉండే NTR, ఇంటర్వెల్ బ్యాంగ్ తరవాత తన విశ్వరూపం చూపిస్తాడు. ఎక్స్ పెక్ట్ చేయని ట్విస్టు లతో సినిమాని చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించాడు హరీష్ శంకర్. S.S. తమన్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

==============================================================================

అ..ఆ

నటీనటులు : నితిన్సమంతా అక్కినేని , అనుపమ పరమేశ్వరన్

ఇతర నటీనటులు : నరేష్నదియాహరితేజఅనన్యరావు రమేష్శ్రీనివాస్ అవసరాల మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ.జె.మేయర్

డైరెక్టర్ : త్రివిక్రమ్

ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ

రిలీజ్ డేట్ : 2 జూన్ 2016

నితిన్సమంతా జంటగా నటించిన బ్యూటిఫుల్ లవ్ ఎంటర్ టైనర్ అ..ఆ. రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అనసూయ (సమంతా)తల్లి క్రమశిక్షణతో విసుగెత్తి పోతుంది. దానికి తోడు తన ఇష్టా ఇష్టాలతో సంబంధం కుదర్చడం మరో తలపోతులా ఫీలవుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తండ్రి సలహా మేరకు తన మేనత్త ఇంటికి  వెళ్తుంది. ఆనంద్  విహారి ( నితిన్) తో పాటుతక్కిన ఫ్యామిలీని కలుసుకుంటుంది. ఆస్తిఆర్భాటాలు లేకపోయినా అనురాగ ఆప్యాయతలతో  ఉండే ఆ ఫ్యామిలీని ఇష్టపడటమే కాదు ఆనంద్ విహారితో ప్రేమలో కూడా పడుతుంది అనసూయ.  ఆ తరవాత ఏం జరుగుతుంది..అనేదే ఈ సినిమాలో ప్రధాన కథాంశం.

=============================================================================

సుడిగాడు
నటీనటులు : అల్లరి నరేష్మోనాల్ గజ్జర్
ఇతర నటీనటులు : బ్రహ్మానందంఆలీ, M.S. నారాయణరఘుబాబువేణు మాధవ్చంద్ర మోహన్చలపతి రావుధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్
డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు
ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ D రెడ్డి
రిలీజ్ డేట్ : 24 ఆగష్టు 2012
అల్లరి నరేష్ నటించిన స్పూఫ్ కామెడీ చిత్రం సుడిగాడు. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అనిపించుకుంది. అల్లరి నరేష్,  బ్రహ్మానందం కాంబినేషన్ లోని కామెడీ సీన్స్ సినిమాకే హైలెట్.

=============================================================================

అరవింద సమేత

నటీనటులు : N.T. రామారావు, పూజా హెగ్డే

ఇతర నటీనటులు : ఈషా రెబ్బ, సునీల్, జగపతి బాబు, నవీన్ చంద్ర, సుప్రియా పాఠక్,  నాగబాబు, రావు రమేష్, నరేష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : తమన్

డైరెక్టర్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ

రిలీజ్ డేట్ : 11 అక్టోబర్ 2018

కొమ్మద్ది గ్రామానికి చెందిన నారపరెడ్డి(నాగబాబు), నల్లగుడికి చెందిన బసిరెడ్డి(జగపతిబాబు)కి కొన్నేళ్ళుగా ఫ్యాక్షన్ గొడవలు. ఈ క్రమంలో నారపరెడ్డిని చంపడానికి బసిరెడ్డి ఓ అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. అదే సమయంలో లండన్ నుండి వచ్చిన వీరరాఘవరెడ్డి(ఎన్టీఆర్)ని స్టేషన్ నుంచి తీసుకొస్తున్నప్పుడు అదే అవకాశంగా భావించి నారపరెడ్డిని హతమారుస్తాడు బసిరెడ్డి. కళ్ళ ముందే తండ్రి ప్రత్యర్దుల చేతిలో చనిపోవడంతో బసిరెడ్డిపై కత్తి దూస్తాడు వీర రాఘవ.. అక్కడి నుండి మళ్ళీ గొడవలు మొదలవుతాయి.

అయితే తన కొడుకు చావుతో గొడవలు ఆపేయమని వీర రాఘవుణ్ణి కోరుతుంది నానమ్మ సుగుణ(సుప్రియ పాఠక్)అలా నానమ్మ మాటకి కట్టుబడి గొడవలు ఆపేయాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ వెళ్ళిపోయిన రాఘవ.. నీలంబరి(సునీల్) గ్యారేజ్ లో ఆశ్రయం పొందుతాడు. ఆ సమయంలోనే క్రిమినల్ లాయర్(నరేష్)కూతురు అరవింద(పూజా హెగ్డే)పరిచయం ప్రేమగా మారుతుంది.

ఇక చావు నుండి బ్రతికి బయటపడ్డ బసిరెడ్డి తన కొడుకు బాల్ రెడ్డి(నవీన్ చంద్ర) ద్వారా శత్రువు వీరరాఘవ రెడ్డి కోసం వెతుకుతూనే ఉంటాడు. ఈ క్రమంలో రాఘవ హైదరాబాద్ లో ఉన్నాడని పసిగట్టి చంపడానికి చూస్తుంటాడు బసి రెడ్డి. ఈ క్రమంలో వీర రాఘవ ఫ్యాక్షన్ గొడవలను ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు.. చివరికి పగతో రగిలిపోతూ క్రూరంగా తయారైన బసిరెడ్డిని వీరరాఘవ మార్చగలిగాడా.. లేదాఅనేది సినిమా కథ.

==============================================================================

రాయుడు

నటీనటులు : విశాల్శ్రీదివ్య

ఇతర నటీనటులు : R.K. సురేష్కుళ్ళప్పులి లీలరాధారవిసూరిఆదిర పాండిలక్ష్మిఆరుళ్ దాస్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : D. ఇమ్మన్

డైరెక్టర్ : M. ముత్తయ్య

ప్రొడ్యూసర్ : G.N. అంబు చెళియన్   

రిలీజ్ డేట్ : 20 మే 2016

విశాల్శ్రీదివ్య జంటగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ రాయుడు. విశాల్ ఈ సినిమాలో సాధారణ కూలీగా నటించాడు. తను ప్రేమించిన భాగ్యలక్ష్మి ని చంపాలని చూస్తున్న రోలెక్స్ కి ఎదురు తిరిగిన రాయుడుఎలాంటి పరిస్థితులు ఎదురుకుంటాడు..అసలు రోలెక్స్ భాగ్యలక్ష్మిని ఎందుకు చంపాలనుకుంటాడు అనేదే ఈ సినిమాలోని ప్రధాన కథాంశం. యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాలో హైలెట్ గా నిలిచాయి.