జీ సినిమాలు ( జూన్ 12th)

Sunday,June 11,2017 - 09:03 by Z_CLU

కోతి మూక

హీరోహీరోయిన్లు – కృష్ణుడు, శ్రద్ధ ఆర్య

ఇతర నటీనటులు – ఏవీఎస్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ఎల్బీ శ్రీరాం, ఉత్తేజ్, ఎమ్మెస్ నారాయణ, హేమ, హర్షవర్థన్

సంగీతం – మణిశర్మ

దర్శకత్వం – ఏవీఎస్

విడుదల తేదీ – 2010, జులై 30

రూమ్ మేట్స్, సూపర్ హీరోస్, ఓరి నీ ప్రేమ బంగారంకాను లాంటి సినిమాలతో అప్పటికే దర్శకుడిగా మారిన ఎవీఎస్.. కృష్ణుడితో మరో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. సున్నితమైన హాస్యాన్ని పండిస్తూ తెరకెక్కిన ఆ సినిమానే కోతిమూక. కృష్ణుడు, శ్రద్ధ ఆర్య హీరోహీరోయిన్లు అయినప్పటికీ.. కథ ప్రకారం ఇందులో చాలామంది హీరోలు కనిపిస్తారు. అందరూ కడుపుబ్బా నవ్విస్తారు. ఉత్తేజ్, ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం.. ఇలా ఈ హాస్యనటులంతా పండించిన కామెడీనే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. వీటితో పాటు మణిశర్మ అందించిన పాటలు కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి.

==============================================================================

ఒక్క మగాడు

నటీ నటులు : నందమూరి బాలకృష్ణ, సిమ్రాన్, అనుష్క శెట్టి

ఇతర నటీనటులు : నిషా కొఠారి, అశుతోష్ రానా, రవి కాలె, సలీం బేగ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : Y.V.S.చౌదరి

ప్రొడ్యూసర్ :  Y.V.S.చౌదరి

రిలీజ్ డేట్ : 11 జనవరి 2008

బాలకృష్ణ, అనుష్క, సిమ్రాన్ నటించిన కలర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒక్క మగాడు. ఈ సినిమా పూర్తిగా బాలక్రిష్ణ మార్క్ కథాంశంతో తెరకెక్కింది. ఈ సినిమాలో బాలకృష్ణ మ్యానరిజం హైలెట్ గా నిలుస్తుంది. Y.V.S. చౌదరి డైరెక్షన్  చేసిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించాడు.

=============================================================================

 ప్రేమ నగర్ 

నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ

ఇతర నటీనటులు : కైకాల సత్యనారాయణ, శాంత కుమారి, S.V. రంగారావు, గుమ్మడి వెంకటేశ్వర రావు, S. వరలక్ష్మి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K.V. మహదేవన్

డైరెక్టర్ : K.S. ప్రకాశ రావు

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 24 సెప్టెంబర్ 1971

అక్కినేని నాగేశ్వర రావు కరియర్ లో నటించిన అద్భుత ప్రేమకథల్లో ప్రేమ నగర్ కూడా ఒకటి. వాణిశ్రీ హీరోయిన్ గా నటించిన చిత్రం ఇప్పటికీ ఆల్ టైం క్లాసిక్ క్యాటగిరీ లో ఉంటుంది. డబ్బు కన్నా ప్రేమ విలువ గొప్పది అని చాటే సినిమాలో ఇమోషనల్ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి.

==============================================================================

కలియుగ పాండవులు

నటీ నటులు : వెంకటేష్, ఖుష్బూ

ఇతర నటీనటులు : అశ్విని, రావు గోపాల్ రావు, నూతన్ ప్రసాద్, రంగనాథ్, రాళ్ళపల్లి తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ :  K. రాఘవేంద్ర రావు

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 1986

విక్టరీ వెంకటేష్ నటించిన ఫస్ట్ మూవీ కలియుగ పాండవులు. వెంకటేష్, ఖుష్బూ జంటగా నటించిన ఈ సినిమా వెంకటేష్ కరియర్ లో ఫస్ట్ సినిమా అయినా ఇదే. టర్నింగ్ పాయింట్ సినిమా కూడా ఇదే. మొదటి సినిమాతోనే వెంకటేష్ కి మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టిందీ సినిమా. రాఘవేంద్ర రావు డైరెక్షన్ చేసిన ఈ సినిమాకి చక్రవర్తి సంగీతం అందించారు.

============================================================================

 

సౌందర్య చంద్రముఖి

హీరో హీరోయిన్లు – విష్ణువర్థన్, సౌందర్య

ఇతర నటీనటులు – రమేష్ అరవింద్, ప్రేమ

సంగీతం – గురుకిరణ్

స్క్రీన్ ప్లే, దర్శకత్వం –  పి.వాసు

విడుదల తేదీ – 2005

కన్నడలో సూపర్ హిట్ అయిన ఆప్తమిత్ర సినిమాను సౌందర్య చంద్రముఖి పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. ఈ సినిమా కేవలం శాండిల్ వుడ్ లోనే కాదు… టోటల్ సౌత్ లోనే సూపర్ సెన్సేషనల్ హిట్ అయింది. నిజానికి 1993లో వచ్చిన మలయాళం సినిమాకు రీమేక్ గా ఇది తెరకెక్కింది. మలయాళంలో మోహన్ లాల్, శోభన కీలకపాత్రలు పోషిస్తే… కన్నడలో విష్ణువర్థన్, సౌందర్య నటించారు. తర్వాత ఇదే సినిమాను తమిళ్ లో రజనీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రలుగా తెరకెక్కించారు. తర్వాత ఇది బుల్ బులయా పేరుతో హిందీలో కూడా రీమేక్ అయింది. స్టార్ కాస్ట్ తో సంబంధం లేకుండా… కథలో దమ్ముంటే సినిమా హిట్ అవుతుందని నిరూపించింది సౌందర్య చంద్రముఖి సినిమా. అన్ని భాషల్లో ఈ సినిమాకు ప్రశంసలు దక్కాయి. అప్పటివరకు ఫ్లాపుల్లో ఉన్న రజనీకాంత్ కెరీర్ ను మళ్లీ స్వింగ్ లోకి తీసుకొచ్చిన మూవీ కూడా ఇదే కావడం విశేషం. అంతేకాదు… సౌందర్య నటించిన చివరి చిత్రం కూడా ఇదే.

==============================================================================

ఒంగోలు గిత్త

నటీనటులు : రామ్ పోతినేని, కృతి కర్బందా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కిషోర్ దాస్, ప్రభు, అజయ్, అభిమన్యు సింగ్, ఆహుతి ప్రసాద్, రమాప్రభ, రఘుబాబు, సంజయ్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : భాస్కర్

ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్

రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013

రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి, ఆ కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.

=============================================================================

 

నా ఇంట్లో ఒకరోజు

నటీనటులు : టాబూ, షహబాజ్ ఖాన్

ఇతర నటీనటులు : ముకేష్ తివారి, ఇమ్రాన్ ఖాన్, గృషా కపూర్, విశ్వజిత్ ప్రధాన్, అమిత్ భేల్, అవతార్ గిల్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దిలీప్ సేన్, సమీర్ సేన్ సురేంద్ర సింగ్

డైరెక్టర్ : గుడ్డు ధనోవా

ప్రొడ్యూసర్ : సంతోష్ ధనోవా

రిలీజ్ డేట్ : 4 జూలై 2003

టాబూ, షహబాజ్ ఖాన్ నటించిన అల్టిమేట్ హారర్ చిత్రం నా ఇంట్లో ఒకరోజు. హిందీలో సూపర్ హిట్టయిన ‘హవా’ సినిమాకి డబ్బింగ్ వర్షన్ ఈ సినిమా. గుడ్డు ధనోవా దర్శకత్వం వహించిన ఈ సినిమా అనుక్షణం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. హారర్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి హైలెట్.