
అష్టాచెమ్మా
నటీనటులు : నాని, శ్రీనివాస్ అవసరాల, స్వాతి, భార్గవి
ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, హేమ, ఝాన్సీ, వాసు ఇంటూరి, శివన్నారాయణ, రాగిణి
మ్యూజిక్ డైరెక్టర్ : కల్యాణి మాలిక్
డైరెక్టర్ : మోహన్ కృష్ణ ఇంద్రగంటి
ప్రొడ్యూసర్ : రామ్ మోహన్
రిలీజ్ డేట్ : 5 సెప్టెంబర్ 2008
నాని, అవసరాల శ్రీనివాస్, స్వాతి, భార్గవి నలుగురికి ఒకేసారిగా ఓ రేంజ్ స్టార్ డం నితీసుకొచ్చి పెట్టిన సినిమా ‘అష్టా చెమ్మా’. సూపర్ స్టార్ మహేష్ బాబుని పెళ్ళిచేసుకోవాలనుకునే లావణ్య చివరికి మహేష్ అనే పేరున్నా చాలు అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. ఆ తరవాత ఏం జరిగింది అన్నదే ప్రధాన కథాంశం.
==============================================================================

ఒంగోలు గిత్త
నటీనటులు : రామ్ పోతినేని, కృతి కర్బందా
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కిషోర్ దాస్, ప్రభు, అజయ్, అభిమన్యు సింగ్, ఆహుతి ప్రసాద్, రమాప్రభ, రఘుబాబు, సంజయ్ రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్
డైరెక్టర్ : భాస్కర్
ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్
రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013
రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి, ఆ కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.
==============================================================================

దమ్ము
నటీనటులు : N.T.R, త్రిష కృష్ణన్, కార్తీక నాయర్
ఇతర నటీనటులు : వేణు తొట్టెంపూడి, అభినయ, భానుప్రియ, నాజర్, సుమన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, సంపత్ రాజ్, కిషోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి
డైరెక్టర్ : బోయపాటి శ్రీను
ప్రొడ్యూసర్ : అలెగ్జాండర్ వల్లభ
రిలీజ్ డేట్ : 27 ఏప్రియల్ 2012
బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన అల్టిమేట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ దమ్ము. N.T.R స్టామినా పర్ ఫెక్ట్ గా ఎలివేట్ అయిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించాడు. యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.
=============================================================================

భగీరథ
నటీనటులు : రవితేజ, శ్రియ
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, నాజర్, విజయ్ కుమార్, బ్రహ్మానందం, జీవ, నాజర్, సునీల్, రఘునాథ రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి
డైరెక్టర్ : రసూల్ ఎల్లోర్
ప్రొడ్యూసర్ :మల్లిడి సత్య నారాయణ రెడ్డి
రిలీజ్ డేట్ : అక్టోబర్ 13, 2005
రవి తేజ, శ్రియ హీరో హీరోయిన్స్ గా రసూల్ ఎల్లోర్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా ‘భగీరథ’. ఈ సినిమాకు ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) కథ ను అందించారు. కృష్ణ లంక అనే పల్లెటూరి లో జనాలు పడే ఇబ్బందులను ఓ యువకుడు ఎలా పరిష్కరించాడు అనే కథతో ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో రవితేజ నటన, శ్రియ గ్లామర్, పల్లెటూరి సీన్స్, చక్రి పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రవి తేజ-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే పోటా పోటీ సీన్స్ అందరినీ అలరిస్తాయి.
==============================================================================

ఎక్కడికి పోతావు చిన్నవాడా
నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ, హేబా పటేల్, అవిక గోర్
ఇతర నటీనటులు : నందితా శ్వేత, వెన్నెల కిషోర్, అన్నపూర్ణ, సత్య, సుదర్శన్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
డైరెక్టర్ : వి. ఐ. ఆనంద్
ప్రొడ్యూసర్ : P.V. రావు
రిలీజ్ డేట్ : 18 నవంబర్ 2016
ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయిన అర్జున్(నిఖిల్) తన స్నేహితుడి అన్నయ్య కు దెయ్యం వదిలించడానికి అనుకోకుండా ఆత్మలను వదిలించే కేరళ లోని మహిశాసుర మర్దిని గుడికి వెళ్లాల్సి వస్తుంది. అలా కిషోర్(వెన్నెల కిషోర్) తో కేరళ వెళ్లిన అర్జున్ కి అమల(హెబ్బా పటేల్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అలా పరిచయమైన అమల తన యాటిట్యూడ్ తో అర్జున్ కు దగ్గరవుతుంది. ఇంతకీ అమల అక్కడికి ఎందుకొచ్చింది? అర్జున్ కి కావాలనే ఎందుకు దగ్గరైంది? అసలు అమల ఎవరు? కేరళ వెళ్లిన అర్జున్ హైదరాబాద్ తిరిగొచ్చాక అమల గురించి ఏం తెలుసుకున్నాడు? అనేది చిత్ర కధాంశం.
==============================================================================

బ్రదర్ అఫ్ బొమ్మాళి
నటీనటులు : అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్
ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
డైరెక్టర్ : చిన్ని కృష్ణ
ప్రొడ్యూసర్ : అమ్మి రాజు కనిమిల్లి
రిలీజ్ డేట్ : నవంబర్ 7 , 2014
కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా , కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. కోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ పెర్ఫార్మెన్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, కామెడీ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.