జీ సినిమాలు ( 11th నవంబర్ )

Saturday,November 10,2018 - 10:02 by Z_CLU

దోచెయ్

హీరో హీరోయిన్లు నాగచైతన్య, కృతి సనోన్

ఇతర నటీనటులు బ్రహ్మానందం, రవిబాబు, పోసాని, సప్తగిరి, ప్రవీణ్

సంగీతం – సన్నీ

దర్శకత్వం సుధీర్ వర్మ

విడుదల తేదీ – 2015, ఏప్రిల్ 24

స్వామిరారా సినిమాతో అప్పటికే సూపర్ హిట్ అందుకున్న సుధీర్ వర్మకు పిలిచిమరీ ఛాన్స్ ఇచ్చాడు నాగచైతన్య. స్వామిరారా సినిమాతో తన మార్క్ ఏంటో చూపించిన సుధీర్ వర్మతన  రెండో ప్రయత్నంగా తీసిన దోచెయ్ సినిమాకు కూడా అదే ఫార్మాట్ ఫాలో అయ్యాడు. మహేష్ సరసన వన్-నేనొక్కడినే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి సనోన్ కు ఇది రెండో సినిమా. అలా వీళ్లందరి కాంబోలో తెరకెక్కిన దోచెయ్ సినిమా కుర్రాళ్లను బాగానే ఎట్రాక్ట్ చేసింది. సన్నీ సంగీతం అదనపు ఆకర్షణ. క్లయిమాక్స్ కు ముందొచ్చే బ్రహ్మానందం కామెడీ టోటల్ సినిమాకే హైలెట్.

==============================================================================

బుజ్జిగాడు

నటీనటులు : ప్రభాస్త్రిష కృష్ణన్

ఇతర నటీనటులు : మోహన్ బాబుసంజనాకోట శ్రీనివాస రావు, M.S. నారాయణసునీల్బ్రహ్మాజీ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సందీప్ చౌతా

డైరెక్టర్ : పూరి జగన్నాథ్

ప్రొడ్యూసర్ : K. S. రామారావు

రిలీజ్ డేట్ : 23 మార్చి 2008

ప్రభాస్త్రిష జంటగా నటించిన అల్టిమేట్ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ బుజ్జిగాడుపూరిజగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన  సినిమాలో మోహన్ బాబు కీ రోల్ ప్లే చేశారుప్రభాస్ డిఫెరెంట్ మ్యానరిజం సినిమాకి హైలెట్ గా నిలిచింది.

==============================================================================

నక్షత్రం

నటీనటులు : సందీప్ కిషన్సాయి ధరమ్ తేజ్ప్రగ్యా జైస్వాల్రెజినా

ఇతర నటీనటులు : తనిష్శ్రియ శరణ్ప్రకాష్ రాజ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్

డైరెక్టర్ : కృష్ణవంశీ

ప్రొడ్యూసర్స్ : K. శ్రీనివాసులు, S. వేణు గోపాల్

రిలీజ్ డేట్ :  4 ఆగష్టు

రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంతటి ప్రాధాన్యత కలిగి ఉంటుందో.. సమాజంలో ‘పోలీస్’ పాత్ర అలాంటిది. పోలీస్ అంటే హనుమంతుడు అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కింది నక్షత్రం. పోలీస్ అవ్వాలనే ప్రయత్నంలో వున్న ఓ యువకుడి కథే ఈ ‘నక్షత్రం’. అతడ్ని పోలీస్ కాకుండా అడ్డుకున్నది ఎవరు.. చివరికి సందీప్ కిషన్ పోలీస్ అయ్యాడా లేదా అనేది స్టోరీ. ఈ బేసిక్ ప్లాట్ కు లవ్రొమాన్స్సెంటిమెంట్ ను యాడ్ చేశాడు దర్శకుడు కృష్ణవంశీ. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ స్పెషల్ రోల్ ప్లే చేశాడు.

=============================================================================

కూలీ నం 1

నటీనటులు : వెంకటేష్టాబూ

ఇతర నటీనటులు : రావు గోపాల్ రావు, శారద, మోహన్ బాబు, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, బాబు మోహన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయరాజా

డైరెక్టర్ : K. రాఘవేంద్ర రావు

ప్రొడ్యూసర్ : D. సురేష్

రిలీజ్ డేట్ : 12 జూన్ 1991

వెంకటేష్ హీరోగా K. రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన కలర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ కూలీ నం 1. ఒక సాధారణ కూలీపొగరుబోతులైన తండ్రీ కూతుళ్ళ అహాన్ని ఎలా నేలకూల్చాడనే ప్రధానాంశంతో తెరకెక్కిందే ఈ సినిమా. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రాణం.

==============================================================================

కాష్మోరా

నటీనటులు కార్తీనయనతార

ఇతర నటీనటులు : సి.దివ్యశరత్ లోహిత్ వాలామధుసూదన్ రావుపట్టిమంద్రం రాజామరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సంతోష్ నారాయణన్

డైరెక్టర్ : గోకుల్

ప్రొడ్యూసర్ : S.R. ప్రకాష్ బాబు, S.R. ప్రభు

రిలీజ్ డేట్ : 28 అక్టోబర్ 2016

ప్రజల బలహీనతను వాడుకుంటూ దొంగ బాబాగా జీవితాన్ని కొనసాగించే కాష్మోరా(కార్తీకుఅతని మంత్రశక్తులకు లోబడిన మినిస్టర్ అండదండగా నిలుస్తాడుఅలా దొంగ బాబాగా ప్రజలనుండి డబ్బు దండుకునే కాష్మోరా అనుకోకుండా రాజ్ నాయక్(కార్తీఅనే  ప్రేతాత్మ తో  పాడుబడ్డ బంగ్లాలో బంధించబడతాడుఅసలింతకీ రాజ్ నాయక్ అనే  ప్రేతాత్మ ఎవరుఅతను ఎందుకు ప్రేతాత్మగా మారాడు ప్రేతాత్మకి..  కాష్మోరాకి సంబంధం ఏమిటిచివరికి కాష్మోరా  దుష్టశక్తీని  శక్తితో ఎదిరించి అంతమొందించాడుఅనేది చిత్రకథాంశం.

==============================================================================

శకుని

నటీనటులు : కార్తీప్రణీత

ఇతర నటీనటులు : సంతానంప్రకాష్ రాజ్కోట శ్రీనివాస రావునాజర్రాధిక శరత్ కుమార్రోజాకిరణ్ రాథోడ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ శంకర్ దయాళ్

ప్రొడ్యూసర్ : S. R. ప్రభు

రిలీజ్ డేట్ : 22 జూన్ 2012

కార్తీ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ శకుని’. రొటీన్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమా కార్తీ కరియర్ లోనే వెరీ స్పెషల్ సినిమా. సంతానం పండించే కామెడీ తోబోర్ కొట్టకుండా సినిమాలో ఎప్పటికప్పుడు వచ్చే ట్విస్ట్ లే ఈ సినిమాకి హైలెట్. ఈ సినిమాలో ప్రణీత హీరోయిన్ గా నటించింది.