జీ సినిమాలు ( 11th డిసెంబర్ )

Sunday,December 10,2017 - 11:40 by Z_CLU

మిస్టర్  మేధావి

నటీనటులు : జెనీలియా, రాజా, సోను సూద్, సుమన్

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : నీలకంఠ రెడ్డి

ప్రొడ్యూసర్ : రామారావు బొద్దులూరి, గోపీచంద్ లగడపాటి

రిలీజ్ డేట్ : 26 జనవరి 2008

రాజా, జెనీలియా నటించిన Mr. మేధావి పర్ ఫెక్ట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. సోను సూద్ ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో నటించాడు. సెలవుల కోసం వచ్చిన శ్వేత, విశ్వాక్ పసితనంలోనే ప్రేమలో పడతారు. ఆ ప్రేమను విశ్వాక్ పెద్దయ్యాక కూడా కొనసాగిస్తాడు కానీ శ్వేత మరిచిపోతుంది. దానికి తోడు బిలియనీర్ అయిన సిద్ధార్థ్ తో పెళ్ళికి రెడీ అయిపోతుంది. అప్పుడు విశ్వాక్ తన ప్రేమను దక్కించుకోవడానికి ఏం చేస్తాడు. ఎలా Mr. మేధావి అనిపించుకుంటాడు అన్నదే ప్రధాన కథాంశం.

============================================================================

గ్రీకువీరుడు

నటీనటులు : నాగార్జున అక్కినేని, నయనతార

ఇతర నటీనటులు : మీరా చోప్రా, K. విశ్వనాథ్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, ఆలీ, M.S. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : దశరథ్

ప్రొడ్యూసర్ : D. శివ ప్రసాద్ రెడ్డి

రిలీజ్ డేట్ : 3 మే 2013

దశరథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ గ్రీకు వీరుడు. ఒంటరిగా విదేశాల్లో పెరిగి, కుటుంబమంటే ఏంటో తెలియని యువకుడిగా నాగార్జున నటన సినిమాకే హైలెట్. నయన తార అసలు నాగార్జున జీవితంలోకి ఎలా అడుగు పెడుతుంది. ఆ తరవాత వారిద్దరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేదే ప్రధాన కథాంశం. ఈ సినిమాకి S.S. తమన్ సంగీతం అందించాడు.

============================================================================

పవిత్ర ప్రేమ

హీరో  హీరోయిన్లు – బాలకృష్ణ, లైలా

ఇతర నటీనటులురోషిని, కోట శ్రీనివాసరావు, సుధాకర్, అలీ, పొన్నాంబలం

సంగీతంకోటి

దర్శకత్వంముత్యాల  సుబ్బయ్య

విడుదల – 1998, జూన్  4

నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి 1997లో పెద్దన్నయ్య, ముద్దుల మొగుడు అనే రెండు సూపర్ హిట్స్ వచ్చాయి. వాటి తర్వాత బాలయ్య సినిమాలపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అలా 1998లో భారీ అంచనాల మధ్య వచ్చిన చిత్రం పవిత్ర ప్రేమ. అప్పటికే యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న లైలాను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంటుంది.

============================================================================

సంఘర్షణ

నటీనటులు : చిరంజీవి, విజయ శాంతి, నళిని

ఇతర నటీనటులు : శివకృష్ణ, గుమ్మడి, నూతన్ ప్రసాద్, ప్రభాకర్ రెడ్డి, రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య, కాకరాల, రావి కొండల రావు, సరళ, సూర్యకాంతం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : K. మురళీ మోహన రావు

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : డిసెంబర్ 29, 2013

స్మగ్లింగ్ చేస్తూ పెడదారిన పట్టిన తండ్రిని సరైన దారిలో పెట్టడం కోసం ఒక కొడుకు పడ్డ ఘర్షనే ఈ సంఘర్షణ. 1983 లో రామా నాయుడు గారి పుట్టిన రోజున జూన్ 6 సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా అదే సంవత్సరం డిసెంబర్ 29 న రిలీజైంది. ఇమోషనల్ సీక్వెన్సెస్ సినిమాకి పెద్ద ఎసెట్.

===========================================================================

అమరావతి

నటీనటులు : స్నేహ, భూమిక, తారకరత్న, సింధూర గద్దె, రవి బాబు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
రచన, స్క్రీన్ ప్లే ,డైరెక్టర్ : రవి బాబు
ప్రొడ్యూసర్ : ఆనంద్ ప్రసాద్
రిలీజ్ డేట్ : 3 డిసెంబర్ 2009

థ్రిల్లర్ సస్పెన్స్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా నిలిచే దర్శకుడు రవి బాబు తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘అమరావతి’. ఈ చిత్రం లో భూమిక, స్నేహ ల నటన, సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలు, రవి బాబు టేకింగ్, నందమూరి తారక రత్న క్యారెక్టర్ సినిమాకు హైలైట్స్. ఈ సినిమా కోసం తొలి సారిగా విలన్ అవతారమెత్తిన తారకరత్న ఈ చిత్రం లో నటన కు గాను నంది అవార్డు అందుకున్నారు. ఆద్యంతం  సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలతో ఈ సినిమా అలరిస్తుంది.

============================================================================

నటీనటులు : జీవా, నయనతార

ఇతర నటీనటులు : పశుపతి, ఆశిష్ విద్యార్థి, కరుణాస్, రాజేష్, అజయ్ రత్నం, చరణ్ రాజ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీకాంత్ దేవ

డైరెక్టర్ : S.P. జగన్నాథన్

ప్రొడ్యూసర్ : R.B.చౌదరి

రిలీజ్ డేట్ : 20 అక్టోబర్ 2006

బాధ్యతా రాహిత్యంగా తిరిగే ఒక మాస్ కుర్రాడు, ఒక బార్ డ్యాన్సర్ జ్యోతిని కలుసుకుంటాడు. అతని గతాన్ని తెలుసుకున్న జ్యోతి, చిన్నగా అతనికి జీవితమంటే ఏంటో, దాని విలువేంటో తెలియజేసే ప్రయత్నం చేస్తుంటుంది. ఇంతలో వారికి తెలిసిన ఒక నిజం ఇద్దరి జీవిత లక్ష్యాన్నే  మార్చేస్తుంది. జీవా, నయనతార నటించిన సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్టయింది.