జీ సినిమాలు ( 11th ఆగష్టు)

Thursday,August 10,2017 - 10:06 by Z_CLU

శుక్రవారం మహాలక్ష్మి

నటీనటులు : కుమార్ రాజా, సితార ,కె.ఆర్. విజయ, బేబీ షామిలి.

ఇతర నటీనటులు : సుత్తి వేలు, సాక్షి రంగారావు, జీవ, కాకా రావు  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కృష్ణ తేజ

డైరెక్టర్ : రామ్ సురేష్

ప్రొడ్యూసర్స్ : కన్నెగంటి రామ్ మోహన్ రావు

రిలీజ్ డేట్ : 1996

కుమార్ రాజా, సితార జంటగా రామ్ సురేష్ దర్శకత్వం లో తెరకెక్కిన భక్తి రస చిత్రం ‘శుక్రవారం మహా లక్ష్మి’. కె.ఆర్.విజయ మహాలక్ష్మి దేవతగా నటించిన ఈ సినిమాలో కొన్ని భక్తి సన్నివేశాలు, కె.ఆర్.విజయ నటన, కుమార్ రాజా సితార మధ్య వచ్చే సీన్స్, కృష్ణ తేజ సంగీతం హైలైట్స్.

==============================================================================

వెంగమాంబ

నటీ నటులు : మీనా, శరత్ బాబు, సాయి కిరణ్

ఇతర నటీ నటులు : సాయి కిరణ్, సన, సుబ్బరాయ శర్మ, అశోక్ రావు, అనంత, సుధా, శివ పార్వతి, శ్రీరామ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఎం.ఎం.కీరవాణి

డైరెక్టర్ : ఉదయ్ భాస్కర్

ప్రొడ్యూసర్ : దొరై స్వామి రాజు

రిలీజ్ డేట్ : జులై 17, 2009

మీనా, శరత్ బాబు , సాయికిరణ్ వంటి మొదలగు వారితో దర్శకుడు ఉదయ్ భాస్కర్ తెరకెక్కించిన వెంగమాంబ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన భక్తి రస చిత్రం ‘వెంగమాంబ’. ఈ చిత్రం లో కథానాయకుడు సాయి కిరణ్ వెంకటేశ్వర స్వామిగా నటించారు. కొన్ని భక్తి రస సన్నివేశాలు, నటీ నటుల గెటప్స్ ఈ సినిమాకు హైలైట్స్.

==============================================================================

వసంతం  

నటీనటులు : వెంకటేష్, ఆర్తి అగర్వాల్, కళ్యాణి

ఇతర నటీనటులు : V.V.S. లక్ష్మణ్, ఆకాష్, సునీల్, చంద్ర మోహన్, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్

డైరెక్టర్ : విక్రమన్

ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్

రిలీజ్ డేట్ : 11 జూలై 2003

స్నేహానికి, ప్రేమకు మధ్య డిఫెరెన్స్ ని అద్భుతంగా ఎలివేట్ చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వసంతం. ఎంత పెద్ద త్యాగానికైనా వెనకాడని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కథే ఈ సినిమా. ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి.

=============================================================================

 

భీమిలి కబడ్డీ జట్టు

నటీ నటులు : నాని, శరణ్య మోహన్

ఇతర నటులు : కిషోర్, ధనరాజ్, వినయ్, సంతోష్, శివ, రమేష్, కృష్ణ, చంటి

మ్యూజిక్ డైరెక్టర్  : V. సెల్వ గణేష్

డైరెక్టర్ : తాతినేని సత్య

నిర్మాత : NV ప్రసాద్, పరాస్ జైన్

తమిళంలో సూపర్ హిట్టయిన ‘వెన్నిల కబడీ కుజు’ సినిమాను భీమిలి కబడ్డీ జట్టు గా తెరకెక్కించారు. వైజాగ్ పరిసర ప్రాంతమైన భీమిలి పరిసర ప్రాంతాల్లో జరిగే సెన్సిటివ్ కథగా తెరకెక్కింది భీమిలి కబడ్డీ జట్టు. సెన్సిటివ్ ప్రేమ కథతో మొదలైన కథే అయినా, తన జట్టును గెలిపించడం కోసం, ఆఖరి శ్వాస వరకు పోరాడే యువకుడి క్యారెక్టర్ లో నాని నటన అద్భుతం.

=============================================================================

 

అన్నవరం

నటీనటులు : పవన్ కళ్యాణ్, ఆసిన్

ఇతర నటీనటులు : సంధ్య, ఆశిష్ విద్యార్థి, లాల్, నాగేంద్ర బాబు, వేణు మాధవ్, బ్రహ్మాజీ, L.B. శ్రీరామ్, హేమ

మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల

డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు

ప్రొడ్యూసర్స్ : పరాస్ జైన్, N.V. ప్రసాద్

రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2006

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అసిన్ జంటగా నటించిన అన్నవరం పర్ ఫెక్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన చెల్లిని ప్రాణంగా ప్రేమించే అన్నయ్యలా నటించాడు. చెల్లెల్ని రక్షించుకోవడం కోసం ఒక అన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేదే ప్రధాన కథాంశం.

============================================================================

నాగవల్లి

నటీనటులు : వెంకటేష్, అనుష్క శెట్టి

ఇతర నటీనటులు : రజినీకాంత్, జ్యోతిక, రిచా గంగోపాధ్యాయ, శ్రద్దా దాస్, కమలినీ ముఖర్జీ, పూనం కౌర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : గురుకిరణ్

డైరెక్టర్ : P.   వాసు

ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్

రిలీజ్ డేట్ : 16 డిసెంబర్ 2010

విక్టరీ వెంకటేష్, అనుష్క నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ నాగవల్లి. రజినీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ ఈ సినిమా. అనుష్క నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.