జీ సినిమాలు ( 10th సెప్టెంబర్ )

Sunday,September 09,2018 - 10:05 by Z_CLU

గణేష్

హీరోహీరోయిన్లు – రామ్,కాజల్
నటీనటులు – పూనమ్ కౌర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం
సంగీతం – మిక్కీ జె మేయర్
దర్శకత్వం – శరవణన్
విడుదల తేదీ – 2009

రామ్ కాజల్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘గణేష్ జస్ట్ గణేష్’. 2009 లో విడుదలైన ఈ సినిమా యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది. మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలైట్. చిన్న పిల్లలతో గణేష్ చేసే హంగామా , కాజల్-రామ్ మధ్య వచ్చే లవ్ సీన్స్ బాగా అలరిస్తాయి. అబ్బూరి రవి అందించిన మాటలు సినిమాకు ప్లస్, ముఖ్యంగా క్లైమాక్స్ లో మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. కాజల్ కుటుంబ సభ్యుల మధ్య మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అందరినీ హత్తుకుంటాయి.

_____________________________________________

అష్టా చెమ్మా

నటీనటులు : నాని, శ్రీనివాస్ అవసరాల, స్వాతి, భార్గవి
ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, హేమ, ఝాన్సీ, వాసు ఇంటూరి, శివన్నారాయణ, రాగిణి
మ్యూజిక్ డైరెక్టర్ : కల్యాణి మాలిక్
డైరెక్టర్ : మోహన్ కృష్ణ ఇంద్రగంటి
ప్రొడ్యూసర్ : రామ్ మోహన్
రిలీజ్ డేట్ : 5 సెప్టెంబర్ 2008

నాని, అవసరాల శ్రీనివాస్, స్వాతి, భార్గవి నలుగురికి ఒకేసారిగా ఓ రేంజ్ స్టార్ డం ని తీసుకొచ్చి పెట్టిన సినిమా ‘అష్టా చెమ్మా’. సూపర్ స్టార్ మహేష్ బాబుని పెళ్ళి చేసుకోవాలనుకునే లావణ్య చివరికి మహేష్ అనే పేరున్నా చాలు అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. ఆ తరవాత ఏం జరిగింది అన్నదే ప్రధాన కథాంశం.

______________________________


ముత్తు

నటీనటులు : రజినీకాంత్, మీనా
ఇతర నటీనటులు : రఘువరన్, శరత్ బాబు, జయ భారతి, వడివేలు, కాంతిమతి, రాధా రవి మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్
డైరెక్టర్ : K.S. రవికుమార్
ప్రొడ్యూసర్ : రాజం బాలచందర్
రిలీజ్ డేట్ : 23 అక్టోబర్ 1995

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ముత్తు సెన్సేషనల్ హిట్ అయింది. రాకుమారుడైన ముత్తు, అతని కుటుంబ సభ్యులు చేసిన కుట్ర వల్ల పనివాడిలా పెరుగుతాడు. పెరిగి పెద్దవాడైన ముత్తు తన అధికారాన్ని ఎలా సాధించుకున్నాడు. అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

_____________________________


బాలు

హీరో హీరోయిన్లు : పవన్ కళ్యాణ్, శ్రియ శరన్, నేహ ఒబెరాయ్
ఇతర నటీనటులు : గుల్షన్, సుమన్, జయసుధ, తనికెళ్ళ భరణి, సునీల్, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ తదితరులు
సంగీతం : మణిశర్మ
దర్శకత్వం : కరుణాకరన్
నిర్మాత : అశ్విని దత్
విడుదల తేది : 6 జనవరి 2015

తొలి ప్రేమ తర్వాత పవన్ కళ్యాణ్ -కరుణాకరన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘బాలు‘. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ను ఓ కొత్త కోణంలో ఆవిష్కరించింది. అటు చలాకీ కుర్రాడిగా ఎంటర్టైన్ చేస్తూనే మరో వైపు యాక్షన్ ఎపిసోడ్స్ లో అదరగొట్టేసాడు పవర్ స్టార్. మణిశర్మ అందించిన పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్.

___________________________________


నక్షత్రం

నటీనటులు : సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్, రెజినా
ఇతర నటీనటులు : తనిష్, శ్రియ శరణ్, ప్రకాష్ రాజ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్
డైరెక్టర్ : కృష్ణవంశీ
ప్రొడ్యూసర్స్ : K. శ్రీనివాసులు, S. వేణు గోపాల్
రిలీజ్ డేట్ : 4 ఆగష్టు

రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంతటి ప్రాధాన్యత కలిగి ఉంటుందో.. సమాజంలో ‘పోలీస్’ పాత్ర అలాంటిది. పోలీస్ అంటే హనుమంతుడు అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కింది నక్షత్రం. పోలీస్ అవ్వాలనే ప్రయత్నంలో వున్న ఓ యువకుడి కథే ఈ ‘నక్షత్రం’. అతడ్ని పోలీస్ కాకుండా అడ్డుకున్నది ఎవరు.. చివరికి సందీప్ కిషన్ పోలీస్ అయ్యాడా లేదా అనేది స్టోరీ. ఈ బేసిక్ ప్లాట్ కు లవ్, రొమాన్స్, సెంటిమెంట్ ను యాడ్ చేశాడు దర్శకుడు కృష్ణవంశీ. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ స్పెషల్ రోల్ ప్లే చేశాడు.

______________________________


వాసుకి

నటీనటులు : మమ్ముట్టి, నయనతార
ఇతర నటీనటులు : బేబీ అనన్య, షీలు అబ్రహాం, రచన నారాయణ కుట్టి, S.N. స్వామి, రోషన్ మాథ్యూ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : గోపీ సుందర్
డైరెక్టర్ : A.K. సాజన్
ప్రొడ్యూసర్ : జియో అబ్రహాం, P. వేణు గోపాల్
రిలీజ్ డేట్ : 12 ఫిబ్రవరి 2016

నయనతార లీడ్ రోల్ ప్లే చేసిన రివేంజ్ థ్రిల్లర్ వాసుకి. కథాకళి డ్యాన్సర్ అయిన ఒక సాధారణ మహిళ తనకు జరిగిన అన్యాయానికి ఏ విధంగా రివేంజ్ తీసుకుంది అనేదే ఈ సినిమాల్ని ప్రధాన కథాంశం. నయనతార నటన ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది.