జీ సినిమాలు ( 10th నవంబర్)

Thursday,November 09,2017 - 10:03 by Z_CLU

వెంగమాంబ

నటీనటులు : మీనా, శరత్ బాబు, సాయి కిరణ్

ఇతర నటీనటులు : సాయి కిరణ్, సన, సుబ్బరాయ శర్మ, అశోక్ రావు, అనంత, సుధా, శివ పార్వతి, శ్రీరామ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ఎం.ఎం.కీరవాణి

డైరెక్టర్ : ఉదయ్ భాస్కర్

ప్రొడ్యూసర్ : దొరై స్వామి రాజు

రిలీజ్ డేట్ : జులై 17, 2009

మీనా, శరత్ బాబు , సాయికిరణ్ వంటి మొదలగు వారితో దర్శకుడు ఉదయ్ భాస్కర్ తెరకెక్కించిన వెంగమాంబ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన భక్తి రస చిత్రం ‘వెంగమాంబ’. ఈ చిత్రం లో కథానాయకుడు సాయి కిరణ్ వెంకటేశ్వర స్వామిగా నటించారు. కొన్ని భక్తి రస సన్నివేశాలు, నటీ నటుల గెటప్స్ ఈ సినిమాకు హైలైట్స్.

==============================================================================

 

భగీరథ

నటీనటులు : రవి తేజ, శ్రియ

ఇతర నటీనటులు :  ప్రకాష్ రాజ్, నాజర్, విజయ్ కుమార్, బ్రహ్మానందం, జీవా తదితరులు

మ్యూజిక్  డైరెక్టర్  :  చక్రి

డైరెక్టర్ :   రసూల్ ఎల్లోర్

ప్రొడ్యూసర్ :మల్లిడి సత్య నారాయణ రెడ్డి

రిలీజ్ డేట్ : అక్టోబర్ 13, 2005

రవి తేజ, శ్రియ హీరో హీరోయిన్స్ గా రసూల్ ఎల్లోర్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా          ‘భగీరథ’. ఈ సినిమాకు ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) కథ ను అందించారు. కృష్ణ లంక అనే పల్లెటూరి లో జనాలు పడే ఇబ్బందులను ఓ యువకుడు ఎలా పరిష్కరించాడు అనే కథతో ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో రవి తేజ నటన, శ్రియ గ్లామర్, పల్లెటూరి సీన్స్, చక్రి పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రవి తేజ-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే పోటా పోటీ సీన్స్ అందరినీ అలరిస్తాయి.

==============================================================================

 

 బ్రదర్ అఫ్ బొమ్మాళి

నటీనటులు : అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్

ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : చిన్ని కృష్ణ

ప్రొడ్యూసర్ : అమ్మి రాజు కనిమిల్లి

రిలీజ్ డేట్ : నవంబర్ 7 , 2014

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా , కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.  కోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ  పెరఫార్మెన్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, కామెడీ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.

=============================================================================

 

రంగ ది దొంగ

హీరో  హీరోయిన్లు – శ్రీకాంత్, విమలా రామన్

ఇతర నటీనటులు – రమ్యకృష్ణ, తెలంగాణ శకుంతల, జీవీ, నాగబాబు

సంగీతం – చక్రి

దర్శకత్వం – జీవీ సుధాకర్ నాయుడు

విడుదల తేదీ – 2010, డిసెంబర్ 30

ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించిన జీవీ… దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా రంగ ది దొంగ. అప్పటికే దర్శకుడిగా మారి నితిన్ తో ఓ సినిమా తీసిన జీవీ… ఈసారి ఓ విభిన్న కథాంశంతో శ్రీకాంత్ ను హీరోగా పెట్టి రంగ ది దొంగ సినిమాను తెరకెక్కించాడు. సినిమాలో  విమలారామన్ పోలీస్ గా కనిపిస్తే… మరో కీలకపాత్రలో రమ్యకృష్ణ నటించింది.  తెరపై భయంకరమైన విలనిజం చూపించిన జీవీ… దర్శకుడిగా మాత్రం ఈ సినిమాలో మంచి కామెడీ పండించాడు. 2010లో విడుదలైన ఈ సినిమాకు చక్రి సంగీతం అందించాడు.

==============================================================================

 

సుడిగాడు

నటీనటులు : అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆలీ, M.S. నారాయణ, రఘుబాబు, వేణు మాధవ్, చంద్ర మోహన్, చలపతి రావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్

డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు

ప్రొడ్యూసర్ : చంద్రశేఖర్ D రెడ్డి

రిలీజ్ డేట్ : 24 ఆగష్టు 2012

అల్లరి నరేష్ నటించిన స్పూఫ్ కామెడీ చిత్రం సుడిగాడు. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అనిపించుకుంది. అల్లరి నరేష్,  బ్రహ్మానందం కాంబినేషన్ లోని కామెడీ సీన్స్ సినిమాకే హైలెట్.

==============================================================================

 

మహానంది

నటీనటులు – సుమంత్, అనుష్క

ఇతర నటీనటులు – శ్రీహరి, సుమన్, కోటశ్రీనివాసరావు, సాయికిరణ్

సంగీత దర్శకుడు –  కృష్ణమోహన్

దర్శకుడు – సముద్ర

విడుదల తేదీ – 2005, డిసెంబర్ 3

సూపర్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన అనుష్క.. తన రెండో ప్రయత్నంగా చేసిన మూవీ మహానంది. సూపర్ తో సక్సెస్ కొట్టిన స్వీటీ… మహానందితో కూడా మరో సక్సెస్ అందుకుంది. ఆర్ ఎస్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీహరి ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించారు. ఈ సినిమా హిందీలో ‘ఏక్ ఔర్ మహాయుధ్’… మలయాళంలో ‘ఉల్లాసం’ పేర్లతో డబ్ అయింది.