జీ సినిమాలు ( 10th మే )

Thursday,May 09,2019 - 10:08 by Z_CLU

త్రిపుర
నటీనటులు : స్వాతి రెడ్డినవీన్ చంద్ర
ఇతర నటీనటులు : రావు రమేష్సప్తగిరిశివన్నారాయణ నడిపెద్దిజయ ప్రకాష్ రెడ్డిప్రీతీ నిగమ్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : కామ్రాన్
డైరెక్టర్ : రాజ్ కిరణ్
ప్రొడ్యూసర్స్ : A. చినబాబు & రాజశేఖర్
రిలీజ్ డేట్ : 6 నవంబర్ 2015
స్వాతి లీడ్ రోల్ ప్లే చేసిన త్రిపుర పర్ఫెక్ట్ ఇమోషనల్ హారర్ థ్రిల్లర్. పల్లెటూరిలో పెరిగిన త్రిపురకు చిన్నప్పటి నుండి తన చుట్టూ పక్కల జరగబోయే ఇన్సిడెంట్స్ గురించి కలలు వస్తుంటాయి. అవి కాస్తా నిజమవుతుంటాయి. దాంతో త్రిపురకు ట్రీట్ మెంట్ కోసమని సిటీకి తీసుకువస్తారు. అక్కడ నవీన్ చంద్రత్రిపురలు ప్రేమలో పడతారుపెళ్ళి కూడా చేసేసుకుంటారు. ఆ తరవాత ఏం జరుగుతుందనేదే సినిమా ప్రధాన కథాంశం. సస్పెన్స్ ఎలిమెంట్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది.

==============================================================================

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
నటీనటులు : వెంకటేష్త్రిష
ఇతర నటీనటులు : శ్రీరామ్, K. విశ్వనాథ్కోట శ్రీనివాస రావుస్వాతి రెడ్డిసునీల్ప్రసాద్ బాబుసుమన్ శెట్టి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా
డైరెక్టర్ : శ్రీ రాఘవ
ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్, S. నాగ అశోక్ కుమార్
రిలీజ్ డేట్ : 27 ఏప్రియల్ 2007
వెంకటేష్త్రిష నటించిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా ఒక సరికొత్త లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇప్పటికే హై ఎండ్ ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉన్న వెంకటేష్ ని ఫ్యాన్స్ కి మరింత దగ్గర చేసిందీ సినిమా.  యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఈ సినిమాకే హైలెట్.

==============================================================================

బ్రూస్ లీ

నటీనటులు : రామ్ చరణ్రకుల్ ప్రీత్ సింగ్

ఇతర నటీనటులు : అరుణ్ విజయ్కృతి కర్బందానదియాసంపత్ రాజ్బ్రహ్మానందంఆలీ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ శ్రీను వైట్ల

ప్రొడ్యూసర్ : D.V.V. దానయ్య

రిలీజ్ డేట్ : 16 అక్టోబర్ 2015

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరియర్ లోనే డిఫెరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్రూస్ లీ. తన అక్క చదువు కోసం స్టంట్ మ్యాన్ గా మారిన యువకుడి క్యారెక్టర్ లో చెర్రీ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. మెగాస్టార్ క్యామియో సినిమాకి మరో హైలెట్.

==============================================================================

తడాఖా
నటీనటులు : నాగచైతన్య, సునీల్, తమన్నా, ఆండ్రియా జెరెమియా
ఇతర నటీనటులు : ఆశుతోష్ రానా, నాగేంద్ర బాబు, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రఘుబాబు, రమాప్రభ మరితు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్
డైరెక్టర్ : కిషోర్ కుమార్ పార్ధసాని
ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 10th మే 2013
నాగచైతన్య, సునీల్ అన్నాదమ్ములుగా నటించిన ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తడాఖా. తండ్రి చనిపోగానే వచ్చిన పోలీసాఫీసర్ ఉద్యోగంలో ఇమడలేని అన్నకు తమ్ముడు ఎలాచేదోడు వాదోడుగా నిలిచాడు, కథ చివరికి ఏ మలుపు తిరిగిందనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

లౌక్యం

నటీనటులు గోపీచంద్రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : బ్రహ్మానందంముకేష్ రిషిసంపత్ రిషిచంద్ర మోహన్రాహుల్ దేవ్మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్
డైరెక్టర్ శ్రీవాస్
ప్రొడ్యూసర్ : V. ఆనంద్ ప్రసాద్
రిలీజ్ డేట్ : 26 సెప్టెంబర్ 2014
గోపీచంద్రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లౌక్యం. తన ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా ఆఇంట్లోంచి ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చి  వారిద్దరి పెళ్ళి చేస్తాడు వెంకీ. దాంతో ఆ అమ్మాయి అన్న వెంకీపై కక్ష కడతాడు. ఈ ఇన్సిడెంట్ తరవాత వెంకీ ఒక ఆమ్మాయి ప్రేమలో పడతాడు. తర్వాత ఆ లోకల్ క్రిమినల్ మరో చెల్లెలే తను ప్రేమించిన అమ్మాయి అని తెలుసుకుంటాడు. అప్పుడువెంకీ ఏం చేస్తాడు..అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

విన్నర్
నటీనటులు : సాయి ధరమ్ తేజ్రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : జగపతి బాబుఠాకూర్ అనూప్ సింగ్ఆదర్శ్ బాలకృష్ణప్రియదర్శి పుల్లికొండముకేష్ రిషిఆలీవెన్నెల కిషోర్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్
డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని
ప్రొడ్యూసర్ నల్లమలుపు బుజ్జిఠాగూర్ మధు
రిలీజ్ డేట్ : 24 ఫిబ్రవరి 2017
సిద్దార్థ్ అనే యువకుడు (సాయి ధరమ్ తేజ్) చిన్నతనంలో కొన్ని సంఘటనల వల్ల తన తండ్రి మహేందర్ రెడ్డి(జగపతి బాబు) కి దూరంగా ఉంటూ రేసింగ్గుర్రాలపై ద్వేషం పెంచుకుంటాడు.. అలా తండ్రికి దూరంగా ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న సిద్దార్థ్ ఒక సందర్భంలో సితార(రకుల్) అనే రన్నర్ ని చూసి ప్రేమలో పడతాడు. అలా తన ప్రేమలో పడిన సిద్దార్థ్ ను ఓ అనుకోని సందర్భంలో ఆది అనే రేసింగ్ జాకీ తో బెట్ కట్టిస్తుంది సితార. అలా సితార ప్రేమ కోసం తనకిష్టం లేని రేసింగ్ మొదలుపెట్టిన సిద్దార్థ్… ఆ రేసింగ్ లో ఎలా గెలిచాడు.. చివరికి తనకు 20 ఏళ్ల క్రితం దూరమైన తండ్రికి ఎలా దగ్గరయ్యాడు.. అనేది సినిమా కథాంశం.