జీ సినిమాలు ( 10th మే )

Wednesday,May 09,2018 - 10:02 by Z_CLU

చిన్నారి

నటీనటులు : ప్రియాంక ఉపేంద్రబేబీ యువిన, ఐశ్వర్య షిందోగిమదిసూధన రావు

మ్యూజిక్ డైరెక్టర్ : B. అజనీత్ లోకనాథ్

డైరెక్టర్ లోహిత్ M.

ప్రొడ్యూసర్ : K. రవి కుమార్

రిలీజ్ డేట్ : డిసెంబర్ 16, 2016

 ప్రియాంక ఉపేంద్ర నటించిన చిన్నారి మూవీ పర్ఫెక్ట్ హారర్ ఎంటర్ టైనర్. చనిపోయిన తన భర్త కోరిక మేరకు గర్భవతి అయిన ప్రియా తన ఏళ్ల కూతురు క్రియఇంకో ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి గోవాలోని తన విల్లాకి వెళుతుంది. అక్కడకు వెళ్లిన కొద్ది రోజుల తరువాత విల్లాలో జరిగే విచిత్రమైన కొన్ని సంఘటనలు వాళ్లకు భయాన్ని కలిగిస్తాయి.

ఆ ఇంట్లో ఉన్న ఏదో అదృశ్య శక్తి ప్రియనుఆమె కూతురు క్రియనుఇతర కుటుంబ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు అది ప్రియనుఆమె కూతురు క్రియను ఎందుకు ఇబ్బంది పెడుతోంది ఆ అదృశ్య శక్తి బారి నుండి ప్రియక్రియలు తప్పించుకున్నారా లేదా అనేదే ఈ సినిమా కథ. హారర్ ఎలిమెంట్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి.

==============================================================================

గ్రీకు వీరుడు

నటీనటులు : నాగార్జున అక్కినేనినయన తార

ఇతర నటీనటులు : మీరా చోప్రా, K. విశ్వనాథ్ఆశిష్ విద్యార్థిబ్రహ్మానందంకోట శ్రీనివాస రావుఆలీ, M.S. నారాయణధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : దశరథ్

ప్రొడ్యూసర్ : D. శివ ప్రసాద్ రెడ్డి

రిలీజ్ డేట్ : 3 మే 2013

దశరథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ గ్రీకు వీరుడు. ఒంటరిగా విదేశాల్లో పెరిగికుటుంబమంటే ఏంటో తెలియని యువకుడిగా నాగార్జున నటన సినిమాకే హైలెట్. నయన తార అసలు నాగార్జున జీవితంలోకి ఎలా అడుగు పెడుతుంది. ఆ తరవాత వారిద్దరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేదే ప్రధాన కథాంశం. ఈ సినిమాకి S.S. తమన్ సంగీతం అందించాడు.

==============================================================================

పంచాక్షరి

నటీనటులు : అనుష్క శెట్టి, చంద్ర మోహన్

ఇతర నటీనటులు : నాజర్, ప్రదీప్ రావత్, రవి ప్రకాష్, బ్రహ్మానందం, దివ్యవాణి, తెలంగాణ శకుంతల మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చిన్నా

డైరెక్టర్ : V. సముద్ర

ప్రొడ్యూసర్ : బొమ్మదేవర రామ చంద్రరావు

రిలీజ్ డేట్ : 11 జూన్ 2010

హై ఎండ్ టెక్నికల్ వ్యాల్యూస్ తో తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ పంచాక్షరి. దుర్గామాత గుడిలో పుట్టిన పంచాక్షరిని ఊళ్లూ వాళ్ళు దుర్గాదేవిలా ట్రీట్ చేస్తుంటారు. కానీ ఒక మహా పర్వదినాన పంచాక్షరి గుడిలో నిప్పుకు ఆహుతై పోతుంది. దాంతో దుర్గమ్మ వారే పంచాక్షరి ప్రాణాలు ఆహుతి చేశారు అనే భ్రమలో ఉంటారు ఊరి జనం. కానీ నిజం తరవాత బయటికి వస్తుంది, నిజానికి పంచాక్షరిని చంపింది ఎవరు..? ఆ తరవాత ఏం జరిగింది అనేదే ప్రధాన కథాంశం.

==============================================================================

దోచెయ్

నటీనటులు  – నాగచైతన్యకృతి సనోన్

ఇతర నటీనటులు – బ్రహ్మానందంరవిబాబుపోసానిసప్తగిరిప్రవీణ్

మ్యూజిక్ డైరెక్టర్  – సన్నీ

డైరెక్టర్  – సుధీర్ వర్మ

రిలీజ్ డేట్ – 2015, ఏప్రిల్ 24

స్వామిరారా సినిమాతో అప్పటికే సూపర్ హిట్ అందుకున్న సుధీర్ వర్మకు పిలిచిమరీ ఛాన్స్ ఇచ్చాడు నాగచైతన్య. స్వామిరారా సినిమాతో తన మార్క్ ఏంటో చూపించిన సుధీర్ వర్మ… తన  రెండో ప్రయత్నంగా తీసిన దోచెయ్ సినిమాకు కూడా అదే ఫార్మాట్ ఫాలో అయ్యాడు. మహేష్ సరసన వన్-నేనొక్కడినే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి సనోన్ కు ఇది రెండో సినిమా. అలా వీళ్లందరి కాంబోలో తెరకెక్కిన దోచెయ్ సినిమా కుర్రాళ్లను బాగానే ఎట్రాక్ట్ చేసింది. సన్నీ సంగీతం అదనపు ఆకర్షణ. క్లయిమాక్స్ కు ముందొచ్చే బ్రహ్మానందం కామెడీ టోటల్ సినిమాకే హైలెట్.

==============================================================================

పూజ

నటీనటులు విశాల్, శృతి హాసన్

ఇతర నటీనటులు : సత్య రాజ్, రాధికా శరత్ కుమార్, ముకేశ్ తివారి, సూరి, జయ ప్రకాష్తదిరులు

మ్యూజిక్ డైరెక్టర్ :  యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ : హరి

ప్రొడ్యూసర్ : విశాల్

రిలీజ్ డేట్ : 22 అక్టోబర్ 2014

విశాల్, శృతి హాసన్ జంటగా మాస్ సినిమా దర్శకుడు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ పూజ’.  ప్రతీ సినిమాలో మాస్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేసే విశాల్ అలాంటి మాస్ క్యారెక్టర్ లో నటించిన ఈ సినిమా లో యాక్షన్ సీన్స్, శృతి హాసన్ గ్లామర్, కామెడీ సీన్స్ , సాంగ్స్  హైలైట్స్ .

==============================================================================

అష్టా చెమ్మా

నటీనటులు : నాని, శ్రీనివాస్ అవసరాల, స్వాతి, భార్గవి

ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, హేమ, ఝాన్సీ, వాసు ఇంటూరి, శివన్నారాయణ, రాగిణి

మ్యూజిక్ డైరెక్టర్ : కల్యాణి మాలిక్

డైరెక్టర్ : మోహన్ కృష్ణ ఇంద్రగంటి

ప్రొడ్యూసర్ : రామ్ మోహన్

రిలీజ్ డేట్ : 5 సెప్టెంబర్ 2008

నాని, అవసరాల శ్రీనివాస్, స్వాతి, భార్గవి నలుగురికి ఒకేసారిగా ఓ రేంజ్ స్టార్ డం ని తీసుకొచ్చి పెట్టిన సినిమా అష్టా చెమ్మా’. సూపర్ స్టార్ మహేష్ బాబుని పెళ్ళి చేసుకోవాలనుకునే లావణ్య చివరికి మహేష్ అనే పేరున్నా చాలు అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. ఆ తరవాత ఏం జరిగింది అన్నదే ప్రధాన కథాంశం.