జీ సినిమాలు ( 10th జూలై )

Monday,July 09,2018 - 10:03 by Z_CLU

ప్రేమాభిషేకం

నటీనటులు : శ్రీహరి, వేణుమాధవ్, ప్రియా మోహన్

ఇతర నటీనటులు : రుతిక, ఆలీ, నాగబాబు, తదితరులు..

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : విక్రమ్ గాంధీ

ప్రొడ్యూసర్ : వేణు మాధవ్

రిలీజ్ డేట్ : 14 మార్చి 2008

వేణుమాధవ్, ప్రియా మోహన్ హీరో హీరోయిన్లుగా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ ప్రేమాభిషేకం. విక్రం గాంధీ డైరెక్షన్ చేసిన ఈ సినిమాకి చక్రి సంగీతం అందించాడు. శ్రీహరి పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

==============================================================================

అహ నా పెళ్ళంట

నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, రజని

ఇతర నటీనటులు : నూతన ప్రసాద్, కోట శ్రీనివాస రావు, రాళ్ళపల్లి, బ్రహ్మానందం, సుత్తి వీరభద్ర రావు, శుభలేఖ సుధాకర్, విద్యా సాగర్

మ్యూజిక్ డైరెక్టర్ : రమేష్ నాయుడు

డైరెక్టర్ : జంధ్యాల

ప్రొడ్యూసర్ : డి. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 27 నవంబర్ 1987

అహ నా పెళ్ళంట. ఈ సినిమా గురించి తెలుగు వారికి పెద్దగా పరిచయం అవసరం లేదు. 1987 లో జంధ్యాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆల్ టైం సూపర్ హిట్ అనిపించుకుంది. పరమ పిసినారిగా కోట శ్రీనివాస రావు నటన సినిమాకే హైలెట్. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం క్యారెక్టర్స్ సినిమా చూస్తున్నంత సేపు నవ్విస్తూనే ఉంటారు. ఈ సినిమాతోనే టాలీవుడ్ లో జంధ్యాల తరం స్టార్ట్ అయింది.

==============================================================================

బ్రహ్మోత్సవం

నటీనటులు : మహేష్ బాబు, సమంత రుత్ ప్రభు, కాజల్ అగర్వాల్

ఇతర నటీనటులు : ప్రణీత సుభాష్, నరేష్, సత్యరాజ్, జయసుధ, రేవతి, శుభలేఖ సుధాకర్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్స్ : మిక్కీ జె. మేయర్, గోపీ సుందర్

డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల

ప్రొడ్యూసర్ : ప్రసాద్ V. పొట్లూరి

రిలీజ్ డేట్ :  20 మే 2016

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బ్రహ్మోత్సవం.కుటుంబ విలువలను వాటి ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మహేష్ బాబును సరికొత్త ఆంగిల్ లో ప్రెజెంట్ చేశాడు. ఎప్పటికీ తన కుటుంబ సభ్యులు కలిసి మెలిసి ఉండాలన్న తన తండ్రి ఆలోచనలు పుణికి పుచ్చుకున్న హీరో, తన తండ్రి కలను ఎలా నేరవేరుస్తాడు అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

అందాల రాముడు

నటీనటులు : సునీల్, ఆర్తి అగర్వాల్

ఇతర నటీనటులు : ఆకాశ్, వడివుక్కరసి, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, ధర్మవరపు, వేణు మాధవ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్

డైరెక్టర్ : P. లక్ష్మి కుమార్

ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్, పరాస్ జైన్

రిలీజ్ డేట్ : ఆగష్టు 11, 2006

సునీల్ తన కరియర్ లో ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా నటించిన చిత్రం అందాల రాముడు. ఈ సినిమా సునీల్ కరియర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది. ఆర్తి అగర్వాల్ నటన సినిమాకే హైలెట్.

==============================================================================

లింగ

నటీనటులు : రజినీకాంత్, అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హా

ఇతర నటీనటులు : జగపతి బాబు, K. విశ్వనాథ్, N. సంతానం, కరుణాకరన్, దేవ్ గిల్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహ్మాన్

డైరెక్టర్ : K.S. రవి కుమార్

ప్రొడ్యూసర్ : రాక్ లైన్ వెంకటేష్

రిలీజ్ డేట్ : 12 డిసెంబర్ 2014

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన డైరెక్ట్ సినిమా ‘లింగ’. రెండు డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ ఓ ఉండే ఈ సినిమాలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడు.  అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.

==============================================================================

సికందర్

నటీనటులు : సూర్య, సమంతా రుత్ ప్రభు

ఇతర నటీనటులు : విద్యుత్ జమ్వాల్, సూరి, బ్రహ్మానందం, మనోజ్ బాజ్ పాయ్, దళిప్ తాహిల్, మురళి శర్మ, ఆసిఫ్ బస్రా మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ : N. లింగుస్వామి

ప్రొడ్యూసర్ : సిద్ధార్థ్ రాయ్ కపూర్, N. సుభాష్ చంద్రబోస్

రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 2014

సూర్య హీరోగా నటించిన సికందర్ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్. డ్యూయల్ రోల్ లో నటించిన సూర్య నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. చిన్నప్పుడే తప్పిపోయిన తన అన్నను వెదుక్కుంటూ వచ్చిన తమ్ముడు అప్పటికే తన అన్న సిటీలో పెద్ద డాన్ అని తెలుసుకుని షాక్ కి గురి అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రధాన కథాంశం. ఈ సినిమాలో సూర్య సరసన సమంతా హీరోయిన్ గా నటించింది.