జీ సినిమాలు (08-12-16)

Wednesday,December 07,2016 - 09:30 by Z_CLU

sumanth-yuvakudu

నటీనటులు : సుమంత్, భూమిక చావ్లా
ఇతర నటీనటులు : జయసుధ, ఆలీ, వేణు మాధవ్
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : A. కరుణాకరన్
ప్రొడ్యూసర్స్ : అక్కినేని నాగార్జున, N. సుధాకర్ రెడ్డి
రిలీజ్ డేట్ : ఆగస్ట్ 2000

కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ యువకుడు. తన తండ్రి లాగే సైనికుడు కావాలని తపన పడే యువకుడిలా సుమంత్ నటన సినిమాకే హైలెట్. భూమిక తెలుగు తెరకు పరిచయమైంది ఈ సినిమాతోనే. తల్లి పాత్రలో జయసుధ నటన చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది.

==============================================================================

balakrishna-pavitraprema

హీరోహీరోయిన్లు – బాలకృష్ణ, లైలా
నటీనటులు – రోషిని, కోట శ్రీనివాసరావు, సుధాకర్, అలీ, పొన్నాంబలం
సంగీతం – కోటి
దర్శకత్వం – ముత్యాల సుబ్బయ్య
విడుదల – 1998, జూన్ 4

నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి 1997లో పెద్దన్నయ్య, ముద్దుల మొగుడు అనే రెండు సూపర్ హిట్స్ వచ్చాయి. వాటి తర్వాత బాలయ్య సినిమాలపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అలా 1998లో భారీ అంచనాల మధ్య వచ్చిన చిత్రం పవిత్ర ప్రేమ. అప్పటికే యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న లైలాను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంటుంది.

==============================================================================

madhumasam

హీరో హీరోయిన్స్ : సుమంత్, స్నేహ, పార్వతి మెల్టన్
ఇతర నటీ నటులు :గిరి బాబు, నరేష్, చలపతి రావు, ఏ.వి.ఎస్, ఆహుతి ప్రసాద్, రవి బాబు, ధర్మ వరపు సుబ్రహ్మణ్యం, వేణు మాధవ్ తదితరులు
సంగీతం : మణిశర్మ
నిర్మాత : రామానాయుడు
దర్శకత్వం : చంద్ర సిద్దార్థ్
రిలీజ్ డేట్ : 9 ఫిబ్రవరి 2007

అప్పటి వరకూ ప్రేమ కథ, యాక్షన్ సినిమాలతో ఎంటర్టైన్ చేసిన సుమంత్ ను కథానాయకుడిగా ఫామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసిన చిత్రం ‘మధు మాసం’. ప్రేమ, పెళ్లి అంటే ఇష్టం లేని ఓ అబ్బాయి, ప్రేమ లో మాధుర్యాన్ని పొందాలని ఆరాట పడే ఓ అమ్మాయి మధ్య జరిగే కథ తో, యూత్ ఫుల్, ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకొని విజయవంతమైన సినిమాగా నిలిచింది. రచయిత బలభద్ర పాత్రుని రమణి రచించిన నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు చంద్ర సిద్దార్థ్ తన దైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కించి అలరించాడు . ప్రముఖ నిర్మాత రామానాయుడు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించి సూపర్ హిట్ సినిమాగా మలిచారు..

==============================================================================

pandu-rangadu

నటీ నటులు : నందమూరి బాలకృష్ణ, స్నేహ, టాబూ
ఇతర నటీనటులు : అర్చన, మేఘనా నాయుడు, సుహాసిని, మోహన్ బాబు, K.విశ్వనాథ్, బ్రహ్మానందం, సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం
మ్యూజిక్ డైరెక్టర్ : కీరవాణి
డైరెక్టర్ : రాఘవేంద్ర రావు
నిర్మాత : కృష్ణమోహన రావు
రిలీజ్ డేట్ : 30 మే 2008

1957 లో NTR నటించిన పాండురంగ మహాత్యం సినిమాకి రీమేక్ ఈ “పాండు రంగడు” సినిమా. అన్నమయ్య, శ్రీరామ దాసు లాంటి సినిమాల తర్వాత బాలకృష్ణ తో కూడా ఒక భక్తిరస చిత్రం చేయాలనుకున్న రాఘవేంద్ర రావు ఈ సినిమాని తెరకెక్కించారు. పాండురంగనిగా బాలకృష్ణ నటన, దానికి తోడు కీరవాణి సంగీతం ప్రతీది సినిమాకు ప్రత్యేక ఆకర్షణే. బాలయ్య సరసన స్నేహ, టాబూ హీరోయిన్ లుగా నటించారు.

==============================================================================

police-story-2

హీరో – సాయికుమార్, సన
నటీనటులు – రాక్ లైన్ వెంకటేశ్, పీజే శర్మ, శోభరాజ్, పొన్నాంబలం
సంగీతం – ఆర్పీ పట్నాయక్
దర్శకత్వం – థ్రిల్లర్ ముంజు
నిర్మాత : G.H. గురుమూర్తి
విడుదల తేదీ – 1996

అప్పటికే సౌత్ లో పెద్ద హిట్ అయిన పోలీస్ స్టోరీకి సీక్వెల్ గా పోలీస్ స్టోరీ-2ను తెరకెక్కించారు. పోలీస్ స్టోరీ సినిమాకు పనిచేసిన టీం అంతా దాదాపుగా ఈ సీక్వెల్ కు కూడా పనిచేశారు. ఇప్పటికీ సాయికుమార్ కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే అగ్ని పాత్ర ఈ సినిమాలోనిదే. యాక్షన్ సినిమాలు, అదిరిపోయే మాస్ డైలాగులు కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటిది.

==============================================================================

jaya-final

నటీ నటులు : జయలలిత, కొంగర జగ్గయ్య

ఇతర నటీనటులు : వాణిశ్రీ, నాగభూషణం, ప్రభాకర రెడ్డి, K. మాలతి, రాజబాబు, రాధ

మ్యూజిక్ డైరెక్టర్ : వేద

డైరెక్టర్ : B.S. నారాయణ

ప్రొడ్యూసర్ : P.S. వీరప్ప

రిలీజ్ డేట్ : 1996

అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ లిస్టులో చేరిన జయలలిత కరియర్ లో మైల్ స్టోన్ మూవీ ‘ఆమె ఎవరు..?’ సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ నే క్రియేట్ చేసింది. B.S. నారాయణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి వేద సంగీతం అందించారు.