జీ సినిమాలు (05-12-16)

Sunday,December 04,2016 - 08:00 by Z_CLU

samara-simha
నటీనటులు : ఉపేంద్ర, లైలా, సాక్షి శివానంద్, ఆశిష్ విద్యార్థి
మ్యూజిక్ డైరెక్టర్ : S.A.రాజ్ కుమార్
డైరెక్టర్ : S. మహేందర్
నిర్మాత : డి. రత్న కుమార్
ఉపేంద్ర, లైలా, సాక్షి శివానంద్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా సమర సింహా. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాను కమల్ హాసన్ రచించడం విశేషం. ఉపేంద్ర తో పాటు ఆశిష్ విద్యార్థి నటన సినిమాకు హైలెట్.
=======================

Vikram Anushka Nanna Movie Posters Wallpapers

నటీనటులు : విక్రమ్, బేబీ సారా, అనుష్క
ఇతర నటీనటులు : అమలా పాల్, నాజర్, సంతానం, M.S.భాస్కర్, సచిన్ ఖేడ్కర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్
డైరెక్టర్ : A.L. విజయ్
ప్రొడ్యూసర్ : M. చింతామణి
రిలీజ్ డేట్ : 15 జూలై 2011

విక్రం హీరోగా నటించిన ఇమోషనల్ ఎంటర్ టైనర్ నాన్న’. తండ్రి ప్రేమ గొప్పతనాన్ని, తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కన్న బిడ్డ కోసం పడే ఆరాటంలో తేడా ఉండదు అనే ఒక చిన్న ఇమోషనల్ పాయింట్ తో తెరకెక్కిందే నాన్న. విక్రం నటన ఈ సినిమాకి ప్రాణం.
==========================
premabhishekam-anr

నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, శ్రీదేవి, జయసుధ

ఇతర నటీనటులు : మురళి మోహన్, మోహన్ బాబు, గుమ్మడి, ప్రభాకర రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : దాసరి నారాయణ రావు

ప్రొడ్యూసర్ : వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని

రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 1981

టాలీవుడ్ లెజెండ్రీ యాక్టర్ ANR నటించిన అద్భుతమైన సినిమాలలో ప్రేమాభిషేకం ఒకటి. దాసరి నారాయణ రావు గారి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆధారంగా చేసుకుని ఆ తరవాత కూడా ఎన్నో ప్రేమ కథలు తెరకెక్కాయి. ANR నట జీవితంలో మైలు రాయిలాంటిదీ ప్రేమాభిషేకం. ఈ సినిమాలో సన్నివేశానుసారంగా పొదిగిన పాటలు సినిమాకే హైలెట్.
=======================

ranga-the-donga-1

హీరోహీరోయిన్లు – శ్రీకాంత్, విమలా రామన్
నటీనటులు – రమ్యకృష్ణ, తెలంగాణ శకుంతల, జీవీ, నాగబాబు
సంగీతం – చక్రి
దర్శకత్వం – జీవీ సుధాకర్ నాయుడు
విడుదల తేదీ – 2010, డిసెంబర్ 30

ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించిన జీవీ… దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా రంగ ది దొంగ. అప్పటికే దర్శకుడిగా మారి నితిన్ తో ఓ సినిమా తీసిన జీవీ… ఈసారి ఓ విభిన్న కథాంశంతో శ్రీకాంత్ ను హీరోగా పెట్టి రంగ ది దొంగ సినిమాను తెరకెక్కించాడు. సినిమాలో  విమలారామన్ పోలీస్ గా కనిపిస్తే… మరో కీలకపాత్రలో రమ్యకృష్ణ నటించింది.  తెరపై భయంకరమైన విలనిజం చూపించిన జీవీ… దర్శకుడిగా మాత్రం ఈ సినిమాలో మంచి కామెడీ పండించాడు. 2010లో విడుదలైన ఈ సినిమాకు చక్రి సంగీతం అందించాడు.
========================

raraju-2
నటీనటులు : గోపీచంద్, మీరా జాస్మిన్
ఇతర నటీనటులు : అంకిత, శివాజీ, ఆశిష్ విద్యార్థి, జయ ప్రకాష్ రెడ్డి, చంద్ర మోహన్
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : ఉదయ శంకర్
ప్రొడ్యూసర్ : GVG రాజు
రిలీజ్ డేట్ : 20 అక్టోబర్ 2006

గోపీచంద్ హీరోగా ఉదయ్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కింది రారాజు. అతి సున్నితమైన లవ్ స్టోరి కి  మాస్ ఎలిమెంట్స్ జోడించి ఇంటరెస్టింగ్ గా తెరకెక్కించాడు. ఈ సినిమాలో కలెక్టర్ కావాలని కలలు కనే ఆంబీషియస్ అమ్మాయిగా మీరా జాస్మిన్ సరికొత్తగా కనిపిస్తుంది.  మణిశర్మ మ్యూజికే సినిమాకి హైలెట్.
=========================
chanti
హీరోహీరోయిన్లు – రవితేజ,  చార్మి
నటీనటులు –  డైజీ బోపన్న, అతుల్ కులకర్ణి, రేవతి, రఘుబాబు, సుబ్బరాజు, వేణుమాధవ్
సంగీతం – శ్రీ
దర్శకత్వం – శోభన్
విడుదల తేదీ – 2004, నవంబర్ 12

హీరో రవితేజ అప్పటికే పూర్తిస్థాయి హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇడియట్, ఖడ్గం, ఇట్లు శ్రావణి  సుబ్రమణ్యం లాంటి హిట్స్ ఉన్నాయి. మరోవైపు శోభన్ వర్షం సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్నాడు. అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ చంటి. చార్మి హీరోయిన్  గా నటించిన ఈ సినిమాకు శ్రీ సంగీతం అందించాడు. దర్శకుడు  శోభన్ కు ఇదే ఆఖరి చిత్రం. ఈ సినిమా తర్వాత కన్నడంలో మరో సినిమా ఎనౌన్స్ చేసినప్పటికీ… అది సెట్స్ పైకి వెళ్లకముందే తీవ్రమైన గుండెపోటుతో శోభన్ చనిపోయారు. అదే ఏడాది శోభన్ సోదరుడు, ప్రముఖ కమెడియన్ లక్ష్మీపతి కూడా కన్నుమూయడం బాధాకరం.