'యుద్ధంశరణం' టీం టూర్ డీటెయిల్స్

Wednesday,September 06,2017 - 01:00 by Z_CLU

అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘యుద్ధం శరణం’. వారాహి చలన చిత్ర బ్యానర్ పై రజిని కొర్రపాటి నిర్మాణంలో యాక్షన్ ఫామిలీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారమే థియేటర్స్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సందర్భంగా సినిమాను ప్రమోట్ చేస్తూ ప్రీ రిలీజ్ టూర్ తో బిజీ అయ్యారు యూనిట్.

నిన్న వైజాగ్ చైతన్య ఇంజినీరింగ్ కాలేజ్ నుంచి టూర్ ను స్టార్ట్ చేసిన యూనిట్ ఆ తర్వాత గోదావరి ఇంజినీరింగ్ కాలేజ్ తో పాటు భీమవరం విష్ణు ఇంజినీరింగ్ కాలేజ్ లో కూడా హంగామా చేశారు. ఈరోజు ఉదయం ఏలూరు రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజ్ లో స్టూడెంట్స్ తో గడిపిన యూనిట్  గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీ లో జరగనున్న ఈవెంట్ లో పాల్గొని నేటితో టూర్ ను ముగించుకోనున్నారు.


నాగ చైతన్య సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్నాడు. కృష్ణ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.