'యుద్ధం శరణం' టీజర్ రివ్యూ

Monday,July 31,2017 - 06:43 by Z_CLU

కేవలం యాక్షన్ మూవీ కాదనే విషయాన్ని ఫస్ట్ నుంచి చెబుతూ వస్తున్నారు. కానీ యుద్ధం శరణం టీజర్ లో మాత్రం యాక్షన్ ఎలిమెంట్సే ఎక్కువగా కనిపించాయి. రారండోయ్ వేడుక చూద్దాం లాంటి కూల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తర్వాత ఓ రివెంజ్ డ్రామాను సెలక్ట్ చేసుకున్నాడు చైతూ. కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ రిలీజైంది.

మనం బ్రతకాలంటే వాడికి ఎదురెళ్లాలి. ఇది ధైర్యం కాదు, తెగింపు.. అనే పంచ్ డైలాగ్ తో టీజర్ ముగిసింది. నాగచైతన్య ఈ సినిమాలో డ్రోన్ స్పెషలిస్ట్ గా కనిపించబోతున్నాడనే టాక్ ఎప్పట్నుంచో ఉంది. అందుకు తగ్గట్టే టీజర్ లో టెక్నికల్ ఎలిమెంట్స్ తో కొన్ని షాట్స్ చూపించారు.

ఇవన్నీ ఒకెత్తయితే.. శ్రీకాంత్ లుక్ మరో ఎత్తు. ఇన్నాళ్లూ ఫ్యామిలీ హీరోగా, పాజిటివ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన ఈ సీనియర్ నటుడు.. యుద్ధం శరణం సినిమాలో విలన్ గా నటించాడు. ఆ లుక్ ను కూడా టీజర్ లో చూపించారు. వీటితో పాటు రేవతి, రావు రమేష్, లావణ్య త్రిపాఠి షాట్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్ గా యుద్ధం శరణం సినిమా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో జరిగే రివెంజ్ డ్రామాగా కనిపిస్తోంది. సినిమాపై ఇంట్రెస్ట్ ను టీజర్ ఇంకాస్త పెంచింది.