యుద్ధం శరణం టీజర్ రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్

Sunday,July 30,2017 - 02:02 by Z_CLU

రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాగచైతన్య.. తన నెక్ట్స్ సినిమాను రిలీజ్ కు రెడీ చేశాడు. కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో యుద్ధం శరణం అనే సినిమా చేశాడు చైతూ. ఈ సినిమా అఫీషియల్ ప్రమోషన్ రేపట్నుంచి మొదలు కాబోతోంది. రేపు సాయంత్రం సరిగ్గా 5 గంటల 45 నిమిషాలకు యుద్ధం శరణం టీజర్ ను విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే ఇండస్ట్రీలో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. వారాహి చలనచిత్ర బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. యాక్షన్ కమ్ లవ్ ఎఁటర్ టైనర్ గా యుద్ధం శరణం రూపొందింది. సీనియర్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు.

రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న యుద్ధం శరణం సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్ట్ చివరి వారంలో సినిమాను విడుదల చేసే ఛాన్స్ ఉంది.