YSR ‘యాత్ర’ రిలీజ్ డేట్ ఫిక్సయింది

Thursday,September 13,2018 - 11:06 by Z_CLU

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతుంది YSR బయోపిక్. రీసెంట్ గా రిలీజైన ఈ సింగిల్ సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేసింది. అయితే అదే ఎగ్జైట్ మెంట్ తో ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. YS జగన్మోహన్ రెడ్డి బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 21 న ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

Y.S. రాజశేఖర్ రెడ్డి పొలిటికల్ కరియర్ లోని అతి ముఖ్యమైన ఘట్టం పాదయాత్ర. ఆ సందర్భంలో జరిగిన ముఖ్య సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఇమోషనల్ పొలిటికల్ ఎంటర్ టైనర్ ఈ సినిమా. YSR గా ఈ సినిమాలో మమ్ముట్టి నటిస్తున్న విషయం తెలిసిందే.

K. మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ చల్లా, శశిదేవి రెడ్డి సంయుక్తంగా 70 MM ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.