అదిరిపోలా: యాత్ర టైటిల్ లోగో రిలీజ్

Saturday,April 07,2018 - 02:01 by Z_CLU

ఓ పక్క సావిత్రి బయోపిక్, మరో పక్క ఎన్టీఆర్ బయోపిక్, ఇప్పుడు వీటితో పాటు వైఎస్ఆర్ బయోపిక్ కూడా వస్తున్న విషయం తెలిసిందే. దీనికి యాత్ర అనే పేరు పెట్టిన విషయం కూడా తెలిసిందే. ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. ఇలా చూడగానే అలా ఎట్రాక్ట్ చేసేలా ఉంది ఈ డిజైన్.

వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కావడానికి ముందు చేసిన సుదీర్ఘ పాదయాత్రే బయోపిక్ లో కీలకంగా వుంటుంది. అందుకే దీనికి యాత్ర అని పేరు పెట్టారు. థీమ్ కు తగ్గట్టుగానే పాదముద్రలో యాత్ర అనే అక్షరాల్ని డిజైన్ చేశారు. టైటిల్ లోగో చాలా ఆర్టిస్టిక్ గా వుంది. ఆ డిజైన్ టోన్ కూడా బాగుంది.

‘కడప దాటి ప్రతి గడపలోకి వస్తున్నాను, మీతో కలిసి నడవాలనుంది.. మీ గుండె చప్పుడువినాలనుంది’ అన్న డైలాగ్ పెట్టి యాత్రపై మరింత క్యూరియాసిటీ రగిల్చారు మేకర్స్. ఇక టైటిల్ డిజైన్ తో పాటు మూవీ రెగ్యులర్ షూటింగ్ వివరాల్ని కూడా వెల్లడించాడు. ఏప్రియల్ 9న యాత్ర సినిమా సెట్స్ పైకి రానుంది.

ఈ సినిమాలో వైఎస్ఆర్ గా మమ్ముట్టి నటించబోతున్నాడు. విజయ్, శశి నిర్మించనున్న ఈ సినిమాకు మహి వి రాఘవ్ దర్శకుడు.