సక్సెస్ ఫుల్ నిర్మాతల వారసులు

Saturday,October 12,2019 - 10:02 by Z_CLU

టాలీవుడ్ టాప్ మోస్ట్ నిర్మాతల్లో ఒకరు అల్లు అరవింద్ గారు. ఇప్పుడు ఇదే బాటలో నడవడానికి సిద్ధమయ్యాడు అల్లు బాబీ. ఇద్దరు తమ్ముళ్ళు ఆన్ స్క్రీన్ పై స్టార్స్ గా వెలిగిపోతుంటే తను మాత్రం తండ్రిలా సినిమాలు నిర్మించడానికే ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఇలా టాలీవు లో మరింత మంది సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ల వారసులు… సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు.

చినబాబు – నాగవంశీ : గత రెండేళ్లుగా సిల్వర్ స్క్రీన్ పై తమ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది సితార ఎంటర్టైన్ మెంట్స్. ఓ వైపు తండ్రి చినబాబు గారు హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ లోనే సినిమాను నిర్మిస్తూనే ఉన్నారు.  మరోపక్క ఏ మాత్రం తగ్గకుండా తండ్రికి తగ్గట్టుగానే సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకుంటున్నాడు ఈ యంగ్ ప్రొడ్యూసర్.  

BVSN ప్రసాద్ – బాపినీడు: టాలీవుడ్ లో B.V.S. N. ప్రసాద్ అంటే అటు స్టార్ హీరోల్లోను… ఇటు ఆడియెన్స్ లోను మంచి గుర్తింపు ఉంది. ఈ నిర్మాత కొడుకు బాపినీడు కూడా చిన్నగా అదే స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి హోమ్ వర్క్ బిగిన్ చేశాడు. రీసెంట్ గా శర్వానంద్ తో ‘రాధ’ సినిమాని నిర్మించాడు.

అశ్విని దత్ – స్వప్న దత్ – ప్రియాంక దత్ : సినిమాలు జస్ట్ డిఫెరెంట్ గా ఉండవు. గ్రాండియర్ కూడా గ్యారంటీ. ఇది జస్ట్ అశ్విని దత్ సినిమాలపై ఉన్న ఒపీనియన్ కాదు. ఈ సీనియర్ నిర్మాత వారసత్వాన్ని అంది పుచ్చుకున్న యంగ్ ప్రొడ్యూసర్స్ స్వప్న దత్, ప్రియాంక దత్ సినిమాలది కూడా. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో సేనిస్బుల్ నిర్మాతలు అనిపించుకున్న వీళ్ళిద్దరూ, ‘మహానటి’ సినిమాతో ఇండస్ట్రీని కంప్లీట్ గా చదివేశారు అనేంతలా మెస్మరైజ్ చేశారు.

దిల్ రాజ్ – హర్షిత్ : దిల్ రాజుకి బ్రాండెడ్ ప్రొడ్యూసర్ అనే స్థాయి ఉంది టాలీవుడ్ లో. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ లో దిల్ రాజుకి ఉన్న క్రేజే వేరు. ఇప్పుడు ఈ బాటలో నడవడానికి చిన్నగా దిల్ రాజు తమ్ముడి కొడుకు హర్షిత్ ప్రిపేర్ అవుతున్నాడు. ఇప్పటికే రాజ్ తరుణ్ తో ‘లవర్’ సినిమాని నిర్మించిన ఈ ఈ యంగ్ ప్రొడ్యూసర్ తన కరియర్ మరింత పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు.