కుడిఎడమైతే.. సూపర్ హిట్టే

Saturday,August 18,2018 - 10:00 by Z_CLU

హీరో మెగా ఫోన్ పట్టి  డైరెక్టర్ గా మారితే… ఓ సూపర్ కొడితే …  అది మాములు విషయమా….  అప్పట్లో నందమూరి తారకరామారావు, కృష్ణ హీరోలుగా చేస్తూ దర్శకులుగా మారి సూపర్ హిట్స్ కొట్టినవారే.. అయితే లేటెస్ట్ గా ఓ ఇద్దరు యంగ్ హీరోలు కూడా దర్శకులుగా మారి ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. ఆ ఇద్దరూ మరెవరో కాదు. ఒకరు  వెంకీ అట్లూరి మరొకరు రాహుల్ రవీంద్రన్.. ఇద్దరూ హీరో నుండి దర్శకులుగా మారి హిట్స్ అందుకున్నవారే.

ముందుగా మెగా ఫోన్ పట్టింది వెంకీ అట్లూరి…’స్నేహగీతం’ సినిమాతో హీరోగా పరిచయమైన వెంకీ ఆ తర్వాత ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’, ‘కేరింత’ సినిమాలకు రైటర్ గా పనిచేసాడు. ఈ సినిమాల తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఈ యంగ్ హీరో కమ్ రైటర్ కట్ చేస్తే వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ సినిమాతో దర్శకుడిగా సూపర్ సక్సెస్ అయ్యాడు


రాహుల్ రవీంద్రన్ కూడా ఇంతే… హీరోగా వరుస సినిమాలు చేస్తూనే  ‘చిలసౌ’ తో మెగా ఫోన్ అందుకున్నాడు. కేవలం నెల రోజుల్లోనే  సినిమాను పూర్తి చేసిన రాహుల్… దర్శకత్వం తన పదేళ్ళ కల అంటూ ప్రమోషన్స్ లో చెప్పే వరకూ ప్రేక్షకులకే కాదు ఇండస్ట్రీ లో కూడా  పెద్దగా ఎవరికీ తెలియదు.

ఇలా తొలిప్రేమ, చిలసౌ సినిమాలతో ఈ ఇద్దరు హీరోలు ఎట్టకేలకు తమ కలను నెరవేర్చుకొని అందరితో శెభాష్ అనిపించుకున్నారు. కాకపోతే  డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఏ ఒక్క ఫ్రేములో కూడా వీరు కనిపించకపోవడం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం.