స్టార్ట్ హీరోల రూట్లో యంగ్ హీరోస్ ....

Monday,January 23,2017 - 02:43 by Z_CLU

స్టార్ హీరోలతో సమానంగా ఫ్యూచర్ ని ప్లాన్ చేసుకుంటూ దూసుకెళ్లాలని చూస్తున్నారు టాలీవుడ్ యంగ్ హీరోస్. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో ఇద్దరు డైరెక్టర్స్ ను లైన్ పెడుతూ స్టార్ హీరోల రూట్ నే ఫాలో అవుతూ జెట్ స్పీడ్ తో దూసుకెళ్లాలని చూస్తున్న ఆ యంగ్ హీరోస్ పై ఓ లుక్కేద్దాం..

naga-chaitanya-gallery
ఇద్దరు డైరెక్టర్స్ ను లిస్ట్ పెట్టిన యంగ్ హీరోల్లో మొదటి ప్లేస్ నాగ చైతన్యదే. ప్రెజెంట్ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్న చైతు మరో వైపు కృష్ణ మారిముత్తు అనే నూతన డైరెక్టర్ తో పాటు ఇంద్రగంటి మోహన కృష్ణ, చంద్ర శేఖర్ ఏలేటి వంటి డైరెక్టర్స్ ను కూడా లైన్ పెట్టేసాడు.

allusirish
అల్లు శిరీష్ కూడా ఓ ఇద్దరి డైరెక్టర్స్ లో రెండు సినిమాలు ప్లాన్ చేసుకుంటూ ఈ లిస్ట్ లో నిలిచాడు. లేటెస్ట్ గా ‘శ్రీ రస్తు-శుభమస్తు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ మెగా హీరో ప్రస్తుతం ఓ మలయాళ సినిమాలో నటిస్తూనే మరో వైపు వి ఐ ఆనంద్, ప్రభాకర్ వంటి డైరెక్టర్స్ తో రెండు సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు.

raj-tarun-ap7am-463068
టాలీవుడ్ యంగ్ &ఎనర్జిటిక్ హీరో రాజ్ తరుణ్ కూడా ఓ ఇద్దరు డైరెక్టర్స్ తో ఓ రెండు సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఫినిష్ చేసిన రాజ్ తరుణ్ ప్రెజెంట్ వెలిగొండ శ్రీనివాస్ డైరెక్షన్ లో నటిస్తున్న ‘అందగాడు’ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే సంజన అనే లేడి డైరెక్టర్ తో ఓ సినిమాను మరో కొత్త దర్శకుడితో మరో సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు.

vijay-devarakonda1469986592
ఇక ఈ లిస్ట్ లేటెస్ట్ గా ‘పెళ్లి చూపులు’ తో గ్రాండ్ హిట్ అందుకున్న విజయ్ దేవర కొండా కూడా ఉన్నాడు. ఈ సినిమా ఇచ్చిన ఇమేజ్ తో ప్రెజెంట్ ఓ సినిమాలో నటిస్తున్న ఈ యంగ్ హీరో మరో రెండు సినిమాలను త్వరలోనే సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తున్నాడు. ఇప్పటికే నందిని రెడ్డి, క్రాంతి మాధవ్ వంటి డైరెక్టర్స్ తో నెక్స్ట్ సినిమాలను అనౌన్స్ చేసేసిన ఈ హీరో ఆ ఇద్దరు డైరెక్టర్స్ ని లైన్ పెట్టేసాడు.

ఇలా రెండు మూడు సినిమాలను ప్లాన్ చేసుకుంటూ స్టార్ హీరోల రూట్లో నే టాలీవుడ్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనీ చూస్తున్నారు యంగ్ హీరోస్.