టార్గెట్ ఫిక్స్: వారం రోజులు మాత్రమే!

Sunday,March 10,2019 - 04:01 by Z_CLU

సమ్మర్ వచ్చేసింది.. తెలుగు సినిమాలు ఒక్కొక్కటి వరుసగా థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. ఏప్రిల్ నుండి యంగ్ హీరోలు వారానికో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ముందుగా ఏప్రిల్ 5న  నాగ చైతన్య ‘మజిలీ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఆ నెక్స్ట్ వీక్ 12న ‘చిత్రలహరి’ అంటూ సాయి ధరం తేజ్ థియేటర్స్ లోకొస్తున్నాడు. సాయి ధరం తేజ్ వచ్చిన వారానికే స్పోర్ట్స్ బేస్డ్ ఫిలిం ‘జెర్సీ’ తో ఏప్రిల్ 19న అర్జున్ కథ చెప్పబోతున్నాడు నాని. ఇక  బెల్లంకొండ శ్రీనివాస్ -కాజల్ జంటగా నటిస్తున్న ‘సీత’ సినిమా ఏప్రిల్ 25 న రిలీజ్ అవుతుంది.

ఇలా నాగ చైతన్య , సాయి ధరం తేజ్ , నాని , బెల్లంకొండ  శ్రీనివాస్ వారానికో సినిమాతో ఏప్రిల్ లో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారు. మరి మహేష్ ‘మహర్షి’ వచ్చే లోపు ఈ కుర్ర హీరోలు ఏ రేంజ్ కలెక్షన్స్ రాబడతారో..చూడాలి.