యంగ్ హీరోలతో మల్టీ స్టారర్ ...

Friday,November 04,2016 - 05:00 by Z_CLU

ప్రస్తుతం కృష్ణ వంశీ ముగ్గురు యంగ్ హీరోలు సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, తనీష్ లతో ‘నక్షత్రం’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడే అదే రూట్ మరో మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు యంగ్ డైరెక్టర్ శ్రీ రామ్ ఆదిత్య.
సుధీర్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన ‘భలే మంచి రోజు’ సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా పరిచయమైన శ్రీరామ్ ఆదిత్య రెండో సినిమాకు రెడీ అవుతున్నాడు.

director-sriram-aditya-eloped-with-producer-daughter

   ఈ సినిమా కోసం ఇప్పటికే కథ ను సిద్ధం చేసిన ఈ యంగ్ డైరెక్టర్ ఈ చిత్రం లో సందీప్ కిషన్, నారా రోహిత్, నాగ సౌర్య లతో పాటు మరో హీరోను కూడా నటింపజేయాలని చూస్తున్నాడట. ప్రస్తుతం డిస్కషన్ లో ఉన్న ఈ సినిమాలో నాలుగో హీరో గా నటించేది సుధీర్ బాబే అని టాాక్.   మరి అనుకున్నట్లు ఈ యంగ్ హీరో లతో ఈ భారీ ప్లాన్ సెట్స్ పైకి వస్తే నలుగురు యంగ్ హీరోలతో ఓ సినిమా చేసిన యంగ్ డైరెక్టర్ గా శ్రీరామ్ ఆదిత్య కి మంచి గుర్తింపు రావడం ఖాయం.