కుర్ర హీరోలు ఫుల్ బిజీ

Sunday,November 15,2020 - 01:26 by Z_CLU

ప్రస్తుతం యంగ్ హీరోల్లో కొందరు బిజీ బిజీ గా సినిమాలు చేస్తున్నారు. అవును ఒక్కొక్కరి లిస్టులో మూడు నాలుగు సినిమాలు లైనప్ ఉన్నాయి. ఈ లిస్టులో Nani , Sharwanand, Nithiin, Naga Shaurya ముందున్నారు.

ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో Tuck Jagadish సినిమా చేస్తున్న నాని ఈ సినిమా ఇంకా పూర్తవ్వకుండానే రెండు సినిమాలు ఫైనల్ చేసుకొని లైనప్ పెట్టుకున్నాడు. Rahul Sankrityan తో Shyam Singha Roy చేయబోతున్న నేచురల్ స్టార్ తాజాగా Vivek Atreya తో మరో సినిమా కన్ఫర్మ్ చేసుకొని ఎనౌన్స్ కూడా ఎనౌన్స్ చేసాడు. ఈ మూడు సినిమాలతో పాటు నాని లిస్టులో మరో రెండు సినిమాలు ఫైనల్ డిస్కషన్ లో ఉన్నాయని సమాచారం.

ఇక Sharwanand చేతిలో మూడు సినిమాలున్నాయి. అవును ప్రస్తుతం Sreekaram సినిమాతో పాటు తెలుగు , తమిళ్ లో ఓ బై లింగ్వెల్ సినిమా చేస్తున్న శర్వా నెక్స్ట్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో Aadallu Meku Joharlu చేయబోతున్నాడు. ఈ సినిమాతో పాటే మరోసినిమాను కూడా ఫైనల్ చేసుకొని సెట్స్ పైకి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నాడు శర్వా.

Nithin చేతిలో ఏకంగా నాలుగు సినిమాలున్నాయి. ఇప్పటికే ‘Rang De’, ‘Check’ సినిమాలను ఫినిషింగ్ స్టేజికి తీసుకొచ్చిన నితిన్ ‘Andhadhun’, ‘PowerPeta’ సినిమాలను లైన్ లో పెట్టి త్వరలోనే ఆ సినిమాలను కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.

కుర్ర హీరో Naga Shaurya కూడా మంచి లైనప్ పెట్టుకొని వతుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సౌజన్య అనే డెబ్యూ డైరెక్టర్ తో ‘Varudu Kavalenu’ సంతోష్ జాగర్లపూడి తో ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేస్తున్న ఈ యంగ్ హీరో మరో రెండు సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు. అందులో ఒకటిగా Anish Krishna సినిమా కాగా మరొకటి డిస్కషన్ స్టేజిలో ఉంది.

ఇలా మూడు నాలుగు సినిమాలతో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న ఈ యువ హీరోలు వచ్చే ఏడాది ఎలాంటి విజయాలు అందుకుంటారో చూడాలి.