కుర్ర హీరోలు... మూడు సినిమాలతో !

Monday,February 17,2020 - 10:02 by Z_CLU

ఈ ఏడాది  ముగ్గురు కుర్ర హీరోలకి స్పెషల్.. దీనికి రీజన్ వరుసపెట్టి మూడు సినిమాలతో వస్తుండటమే. ఆడియన్స్ ఊహించని కాంబినేషన్స్ తో పాటు కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ బ్యాక్ టూ బ్యాక్  సినిమాలు చేస్తున్న కుర్ర హీరోలెవరో చూద్దాం.

గతేడాది గ్యాప్ తీసుకున్న నితిన్ ఈ ఇయర్ మూడు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ నెల ‘భీష్మ’ తో వస్తున్న నితిన్ కొన్ని నెలలకే ‘రంగ్ దే’ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా వచ్చిన షార్ట్ గ్యాప్ లోనే చంద్ర శేఖర్ ఏలేటి తో చేస్తున్న సినిమాను థియేటర్స్ లోకి తీసుకురానున్నాడు నితిన్.

నితిన్ తో పాటే ఈ ఏడాది శర్వా కూడా మూడు సినిమాలు ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే ‘జాను’ తో పలకరించిన శర్వా సమ్మర్ లో ‘శ్రీకారం’ సినిమాను థియేటర్స్ కి తీసుకురాబోతున్నాడు. ఆ వెంటనే కొన్ని నెలలకే నెక్స్ట్ చేస్తున్న బైలింగ్వెల్ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు.

ఇక నాగ శౌర్య చేతిలో ఏకంగా నాలుగు సినిమాలున్నాయి. ఇప్పటికే ‘అశ్వథామ’ రిలీజైంది. ప్రస్తుతం షూటింగ్ స్టేజిలో ఉన్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ను త్వరలోనే ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. ఇక లక్ష్మి సౌజన్య డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కూడా ఇదే ఏడాది థియేటర్స్ లోకి రానుంది. సో ఈ ఇయర్ శౌర్యా నుండి మూడు సినిమాలు పక్కా… ఇవి కాకుండా మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి.