'కాటమరాయుడు' ఫామిలీలో యంగ్ హీరో .....

Monday,February 27,2017 - 08:20 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లెటస్ట్ సినిమా ‘కాటమరాయుడు’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఉన్నట్టుంది ఈ సినిమా సెట్లో కాసేపు సందడి చేసాడు యంగ్ హీరో నితిన్.


నితిన్ పవన్ మధ్య రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరంటే ఒకరికి ప్రేమ అభిమానం కూడా. ఆ రిలేషన్ తోనే నితిన్ హీరో గా పవన్ ఓ సినిమాను కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన నెక్స్ట్ సినిమా షూటింగ్ లో బిజీ ఉన్న నితిన్ ప్రెజెంట్ కాస్త గ్యాప్ దొరకడంతో తన అభిమాన హీరో నటిస్తున్న కాటమరాయుడు సెట్లో అడుగుపెట్టాడట.. కాటమరాయుడు ఫామిలీ తో ఓ ఫోటో కూడా దిగి సోషల్ మీడియా ద్వారా ‘కాటమరాయుడు ఫామిలీ తో ‘ అంటూ పోస్ట్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నాడు నితిన్…