

Wednesday,July 27,2016 - 10:50 by Z_CLU
సాయి కుమార్ తనయుడిగా ‘ప్రేమ కావాలి’ చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయకుడిగా అరంగేట్రం చేసి తొలి చిత్రం తోనే కథానాయకుడిగా మంచి మార్కులు అందుకున్న ఆది తక్కువ సినిమాలతోనే చక్కటి గుర్తింపు అందుకున్నాడనే చెప్పాలి. ఇక ఆగస్టు 5 న `చుట్టాలబ్బాయి`గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆది ఈ సినిమా విడుదల తర్వాత తన తదుపరి చిత్రంగా కన్నడ లో ఘన విజయం సాధించిన `ఫస్ట్ ర్యాంక్ రాజ్` అనే చిత్రాన్ని రీమేక్ చెయాయనున్నాడనే టాక్ వినిపిస్తుంది . తెలుగులో ఈ చిత్రానికి `ఫస్ట్ ర్యాంక్ రాజు` అనే టైటిల్‌నే పరిశీలిస్తున్నారట యూనిట్. ఇక ‘సీతమ్మఅందాలు-రామయ్య సిత్రాలు’ చిత్రంతో దర్శకుడుగా పరిచయమై ఆది నటించిన ‘గరమ్’ తో సహా పలు చిత్రాలకు రచయితగా పని చేసిన శ్రీనివాస్ గవిరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. మరి ప్రస్తుతం టాలీవుడ్ లో రీమేక్ ల హవా కొనసాగుతుండడం తో ఈ కుర్ర హీరో కూడా ఇలా రీమేక్ రాజా అవతార మెత్తనున్నాడన్న మాట
Wednesday,September 20,2023 01:19 by Z_CLU
Saturday,March 25,2023 06:24 by Z_CLU
Tuesday,September 27,2022 06:18 by Z_CLU
Monday,September 19,2022 11:44 by Z_CLU