భారీ సినిమాలతో యంగ్ డైరెక్టర్స్

Wednesday,December 15,2021 - 05:25 by Z_CLU

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మెగాఫోన్ పట్టిన ఎవరికయినా ఫైనల్ టార్గెట్ పెద్ద స్టార్ తో సినిమానే. కాకపోతే అంత వరకూ వెళ్ళాలంటే సక్సెస్ తో పాటు కాసింత అనుభవం కూడా ఉండాలి. కానీ ఓ ముగ్గురు యంగ్ డైరెక్టర్స్ మాత్రం రెండు మూడు సినిమాలతోనే మెగాస్టార్ , పవర్ స్టార్ , రెబల్ స్టార్ లను ఇంప్రెస్ చేసి వారిని డైరెక్ట్ చేసే అవకాశం అందేసుకున్నారు. తక్కువ అనుభవంతో పెద్ద సినిమాలను డైరెక్ట్ చేయబోతున్న దర్శకులపై స్పెషల్ స్టోరీ.

ఒకప్పుడు ప్రభాస్ స్టార్ హీరో. కానీ ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ బడా దర్శకులతోనే ఒక్క ‘రాధే శ్యామ్‘ మినహా. అవును గోపీచంద్ తో జిల్ సినిమా తీసి టాలీవుడ్ కి పరిచయమైన డైరెక్టర్ రాధాకృష్ణ రెండో సినిమాకే ప్రభాస్ ని డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. జిల్ చేసిన నిర్మాతలతో కలిసి ప్రభాస్ కి ఓ లవ్ స్టోరీ చెప్పేసి బాహుబలి టైంలోనే ప్రాజెక్ట్ లాక్ చేసుకొని ‘రాధేశ్యామ్’ సినిమా చేసేశాడు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిచింది. ఈ సినిమా హిట్టయితే పాన్ ఇండియా లెవెల్ లో రాధాకృష్ణ డైరెక్టర్ గా ఫేమస్ అయిపోవడం ఖాయం.

సాగర్ కే చంద్ర .. దర్శకుడిగా చేసింది కేవలం రెండు సినిమాలే. అందులో ఒకటి ‘అయ్యారే’, మరొకటి ‘అప్పట్లో ఒకడుండే వాడు’. ఈ రెండు సినిమాల అనుభవంతోనే మూడో సినిమాకు పవన్ స్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న’భీమ్లా నాయక్‘ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సాగర్ కే చంద్ర ఈ సినిమా కోసం  త్రివిక్రమ్ తో కలిసి వర్క్ చేస్తుండటం మరో విశేషం.

chiranjeevi venky kudumula DVV Danayya

ఈ మధ్య కాలంలో మొదటి సినిమాతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన దర్శకుల్లో వెంకీ కుడుముల ఒకడు. ఆ తర్వాత డైరెక్ట్ చేసిన రెండో సినిమా ‘భీష్మ’ కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో ఏకంగా మూడో సినిమాను మెగా స్టార్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు వెంకీ కుడుముల. ఇటివలే చిరంజీవి -వెంకీ కుడుముల కాంబో ఎనౌన్స్ చేశారు. త్వరలోనే సినిమా పట్టాలెక్కనుంది. ఏదేమైనా మూడో సినిమాకే మెగాస్టార్ ని డైరెక్ట్ చేయడం అంటే ఆశా మాషీ విషయం కాదు. అందుకే వెంకీ కుడుముల ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాడు. మరి మెగా అభిమానిగా మెగా స్టార్ ని వెంకీ కుడుముల ఎలా ప్రెజెంట్ చేస్తాడో ? ఏ రేంజ్ సినిమా తీస్తాడో వేచి చూడాల్సిందే.

మరి తక్కువ అనుభవంతోనే స్టార్ హీరోలతో భారీ సినిమాలు చేస్తున్న ఈ యంగ్ డైరెక్టర్స్ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్  అందుకుంటే ఇక వీరికి తురుగుండదు.

– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics