'పెళ్లి చూపులు' దర్శకుడి కి బంపర్ అఫర్ ...

Wednesday,July 27,2016 - 11:13 by Z_CLU

 

ఒక చిన్న సినిమా విడుదల ముందే సూపర్ హిట్ టాక్ అందుకోవడం చాలా అరుదు అనే చెప్పాలి. అయితే అలాంటి అరుదైన అభినందనలతో సూపర్ హిట్ టాక్ ను విడుదలకి ముందే కైవసం చేసుకుంది ‘పెళ్లి చూపులు’ చిత్రం. ట్రైలర్ తోనే అందరినీ ఆకట్టుకున్న ఈ చిత్రం ఈ నెల 29 న విడుదల కానుంది. విడుదలకి ముందే ప్రివ్యూ షో ల ద్వారా ప్రదర్శించడం తో విడుదలకి ముందే అందరి అభినందనలు అందుకుంటూ పరిశ్రమలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది ఈ చిత్రం. ఇక ఈ సినిమాను సమర్పిస్తున్న డి.సురేష్ బాబు ఈ చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ కి తన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఓ సినిమా నిర్మించడానికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇక ఈ చిత్రం లో ఓ స్టార్ హీరో నే నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. మరి విడుదలకి ముందే రెండో సినిమా గాను ఇలా భారీ బ్యానర్ లో అవకాశం అందుకోవడం తో తెగ సంతోష పడిపోతున్నాడట ఈ యువ దర్శకుడు.