యేసుదాస్ బర్త్ డే స్పెషల్

Tuesday,January 10,2017 - 09:00 by Z_CLU

ఒకటా రెండా దాదాపు 40,000 పాటలు పాడిందా స్వరం. తన 5 దశాబ్దాల కరియర్ లో ఇండియన్  లాంగ్వేజెస్ తో పాటు మలయ్, రష్యన్, అరబిక్, లాటిన్, ఇంగ్లిష్ భాషల్లోనూ పాటలుపాడిన లెజెండ్ సింగర్ యేసుదాస్. భారతీయ సంగీతానికి దొరికిన వెలకట్టలేని సంపద యేసుదాసు. ఈరోజు ఆ అమృత స్వరం… తన 77 వ పుట్టిన రోజును సెలెబ్రేట్ చేసుకుంటోంది.

ఫోర్ట్ కొచ్చి లో 1940 జనవరి 10 న జన్మించారు యేసుదాస్. తండ్రి క్లాసికల్ మ్యూజిషియన్ కావడంతో, చిన్నారి యేసుదాసు కూడా మ్యూజిక్ కి కనెక్ట్ అయిపోయాడు. అలా పుట్టుకతోనే సంగీతంతో మమేకమయ్యారు.

కరియర్ లో మొట్టమొదటగా జై జవాన్ జై కిసాన్ అనే సినిమాకి పాడారు, కానీ ఆ సినిమా కాస్త లేట్ గా రిలీజ్ అవడంతో, ఛోటి సీ బాత్ సినిమాతో ఫస్ట్ టైం ఆయన గొంతు సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది.

1968 లో రిలీజైన ‘బంగారు తిమ్మరాజు’ సినిమాలో ఓ నిండు చందమామ పాటతో మొదటిసారి తన వాయిస్ ని పంచుకున్న ఏసుదాస్ ఇప్పటికీ 5 దశాబ్దాలుగా ప్రతి జెనెరేషన్ కి ఫేవరేట్ సింగర్ అన్పించుకున్నారు.

 అంతులేని కథ సినిమాలో ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి’ సాంగ్ తో, అ తరవాత పెద్దరికం సినిమాలో ‘ఇదేలే తరతరాల కథనం’ పాటలతో తెలుగు వారికి మరింత దగ్గరైంది ఈ మధుర స్వరం.

తెలుగులో ఏసుదాసు-మోహన్ బాబుది సూపర్ హిట్ కాంబినేషన్. ఒక దశలో తన ప్రతి సినిమాలో ఏసుదాసుతో ఓ పాట పాడించేవారు కలెక్షన్ కింగ్. అలా ఏసుదాసు గొంతు వినిపించిన మోహన్ బాబు సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.

కేవలం సినిమా పాటలకే పరిమితం అయిపోలేదు ఈ గాత్రం. ఎన్నో వేల భక్తిపాటలు ఆలపించారు. మరీ ముఖ్యంగా అయ్యప్ప స్వామి గీతాలకు ఏసుదాసు బ్రాండ్ అంబాసిడర్. వేంకటేశ్వర సుప్రభాతాన్ని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గాత్రంలో మాత్రమే వినగలం, అలాగే అయ్యప్ప స్వామి భక్తిపాటల్ని ఏసుదాసు గొంతు నుంచి వింటేనే ఆ భక్తిభావం, పరవశం రెండూ.

తన కెరీర్ లో లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నారు ఏసుదాసు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో పాటు… అన్ని దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉత్తమ గాయకుడి పురష్కారాలు అందుకున్నారు. కేరళ రాష్ట్ర ఆస్థాన గాయకుడిగా అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. ఈ సుస్వర సంగీత సాగరం… మరిన్ని పాటలతో అలరించాలని కోరుకుంటూ…. ఏసుదాసుకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది జీ-సినిమాలు.