ఇయర్ ఎండ్ స్పెషల్: టాప్ హీరోయిన్స్ 2018

Thursday,December 27,2018 - 10:19 by Z_CLU

మన ఇండస్ట్రీలో హీరోల కంటే హీరోయిన్ల మధ్య ఎక్కువ పోటీ ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఏడాదికి కనీసం పది మంది హీరోయిన్లు పరిచయం అవుతుంటారు. వీళ్లలో కనీసం ముగ్గురైనా క్లిక్ అవుతుంటారు. సో.. హీరోయిన్ల మధ్యే పోటీ ఎక్కువ. ఈ ఏడాది కూడా అలాంటి కాంపిటిషన్ కనిపించింది. 2018 టాప్ హీరోయిన్లపై జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్

టాప్ హీరోయిన్లలో ముందుగా చెప్పుకోవాల్సింది కచ్చితంగా రష్మిక గురించే. ఈ ఏడాదే ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. డెబ్యూ మూవీ ఛలోతో సూపర్ హిట్ కొట్టిన రష్మిక, ఆ వెంటనే గీతగోవిందంతో ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా షార్ట్ గ్యాప్ లో దేవదాస్ రూపంలో మరో హిట్ అందుకుంది. ఇలా హ్యాట్రిక్ హిట్స్ తో టాప్ ప్లేస్ లో నిలిచింది రష్మిక

ఈ ఇయర్ టాప్ హీరోయిన్లలో కీర్తిసురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇయర్ స్టార్టింగ్ లో అజ్ఞాతవాసి సినిమాతో ఫ్లాప్ అందుకున్నప్పటికీ, మహానటి మూవీతో ఈమె లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఈ బయోపిక్ లో కీర్తతిసురేష్ యాక్టింగ్ కు టోటల్ టాలీవుడ్ ఫిదా అయింది. అలా ఒకేఒక్క సినిమాతో తిరుగులేని ఇమేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ

అనుష్క కూడా ఈ ఏడాది టాప్ హీరోయిన్ల లిస్ట్ లో ఉంది. ఇంకా చెప్పాలంటే లిస్ట్ లో కొనసాగుతున్న సీనియర్ హీరోయిన్ అనుష్క మాత్రమే. బాహుబలి-2తో భారీ క్రేజ్ సంపాదించుకున్న బొమ్మాళి, ఈ ఏడాది భాగమతితో హిట్ కొట్టింది. ప్రతి ఏడాది అనుష్క పేరిట ఓ హిట్ మూవీ ఉండాల్సిందే. ఈ ఏడాది కూడా ఉంది.

సమంత కూడా టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో ఉంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ రంగస్థలం సినిమాలో ఈమె నటించింది. ఆ తర్వాత తనే లీడ్ రోల్ పోషించి, యూటర్న్ అనే సినిమా చేసి క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది.

రష్మిక టైపులోనే, ఇలా ఎంట్రీ ఇచ్చి అలా బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్ కైరా అద్వానీ. మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ అయిన ఈ బ్యూటీ, తొలి సినిమాకే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సక్సెస్ తో చరణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది

కొన్నేళ్లుగా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రాశి ఖన్నా కూడా ఈ ఏడాది హిట్ హీరోయిన్స్ జాబితాలో ఉంది. ఈమె నటించిన టచ్ చేసి చూడు, శ్రీనివాసకల్యాణం ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయకపోయినా తొలిప్రేమ మాత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఏడాదికో హిట్ ఇస్తున్న పూజా హెగ్డే కూడా 2018లో మెరిసింది. ఈమె యాక్ట్ చేసిన అరవింద సమేత సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకు తను సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది. ఈ మూవీతో పాటు ఈ ఏడాది సాక్ష్యం అనే మరో సినిమా కూడా చేసింది పూజా హెగ్డే.

బ్లాక్ బస్టర్స్ లేకపోయినా భారీ బడ్జెట్ చిత్రాల హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది అను ఎమ్మాన్యుయేల్. ఇయర్ స్టార్టింగ్ లో అజ్ఞాతవాసితో ఫ్లాప్ తెచ్చుకున్నప్పటికీ.. అను నటించిన నా పేరు సూర్య సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఇక నాగచైతన్యతో చేసిన శైలజారెడ్డి అల్లుడు సినిమా అను కెరీర్ లో మరో హిట్ మూవీగా నిలిచింది.

ఇంతమంది టాప్ హీరోయిన్ల మధ్య ఈ ఏడాది ఎదురుదెబ్బలు తిన్న హీరోయిన్లు కూడా ఉన్నారు. ఫిదా లాంటి సక్సెస్ తర్వాత సాయిపల్లవి మరో హిట్ కొట్టలేకపోయింది. స్టార్ హీరోయిన్ కాజల్ కూడా మెప్పించలేకపోయింది. ఎంతో సీనియారిటీ ఉన్న తమన్నా కూడా ఫెయిలైంది. అనుపమ పరమేశ్వరన్, ప్రగ్యా జైశ్వాల్, మెహ్రీన్, లావణ్య త్రిపాఠి లాంటి ముద్దుగుమ్మలు కూడా ఈ ఏడాది ఎట్రాక్ట్ చేయలేకపోయారు.