ఇయర్ ఎండ్ స్పెషల్ : సూపర్ హిట్ సాంగ్స్

Thursday,December 20,2018 - 10:01 by Z_CLU

రిలీజ్ కి ముందే సినిమా పై  అంచనాలు పెంచడంలో పాటలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఏడాది కొన్ని పాటలు మ్యూజిక్ లవర్స్ ని మెస్మరైజ్ చేసి చార్ట్ బస్టర్స్ లో చోటు సంపాదించుకున్నాయి.  సినిమా రిలీజ్ కి ముందే హల్చల్ చేసిన టాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్స్ పై ‘జీ సినిమాలు’ స్పెషల్ స్టోరీ.

ఈ ఏడాది ఆరంభంలో ‘చూసి చూడంగానే నచ్చేసావే’ అంటూ రిలీజయిన ఓ సాంగ్ అందరి నోట్లో నానుతూ మొబైల్ ఫోన్ లో మోగుతూ హంగామా చేసింది. ‘ఛలో’ సినిమాలోని ఈ పాట యూత్ కి విపరీతంగా కనెక్ట్ అవ్వడానికి రీజన్ సాగర్ మహాత్ మ్యూజిక్ , భార్కరభట్ల గారి లిరిక్స్… ఇప్పటి వరకూ వినని ఓ కొత్త సౌండింగ్ తో ఈ సాంగ్ ని కంపోజ్ చేసిన సాగర్ మహతి మ్యూజిక్ ఒకేత్తైతే.. వినగానే కనెక్ట్ అయ్యేలా ఉండే భాస్కరభట్ల క్యాచీ లిరిక్స్ మరో ఎత్తు. ముఖ్యంగా ఓ అమ్మాయిని చూడగానే ఆ అందానికి మంత్ర ముగ్ధుడైన ఓ అబ్బాయి మనసులో మాటల్ని పాటగా మలిచిన విధానం అందరినీ కట్టిపడేసింది.

 ఈ ఏడాది మోస్ట్  పాపులర్ సాంగ్ అనగానే టక్కున గుర్తొచ్చే పాట ‘ఇంకేం ఇంకేం కావలె’… ‘గీతగోవిందం’ సినిమాలోని ఈ సాంగ్ ఓ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి అనంత్ శ్రీరాం లిరిక్స్ అందించాడు. ఈ సాంగ్ ఇంతలా పాపులర్ అవ్వడానికి మెయిన్ రీజన్ సిద్ శ్రీరామే… తన గొంతుతో పాటకి ప్రాణం పోసాడు సిద్.

 ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాలో ‘పిల్ల రా’ అనే సాంగ్ ఈ ఇయర్ బెస్ట్ సాంగ్స్ లో ఒకటి.  సాంగ్ వచ్చే ముందు మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే థియేటర్స్ అంతా అరుపులతో దద్దరిల్లిన సాంగ్ ఇది.  చైతన్ భరద్వాజ్ ఇచ్చిన ట్యూన్ కి పర్ఫెక్ట్ లిరిక్స్ అందించారు చైతన్య ప్రసాద్.. లిరిక్స్ యూత్  కి  బాగా కనెక్ట్ అవ్వడం వల్లే ఈ సాంగ్ ఈ రేంజ్ హిట్ సాదించింది. అనురాగ్ కులకర్ణి పాడిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో భారీ రికార్డు వ్యూస్ సాదించి 2018 లో పాపులర్ సాంగ్ అనిపించుకుంది.

‘రంగస్థలం’ సినిమాలో ‘ఎంత సక్కగున్నవే’ సాంగ్ ఈ ఇయర్ లో మరో బెస్ట్ సాంగ్… ఫస్ట్ సింగిల్ అంటూ రిలీజ్ అయిన ఈ సాంగ్ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేసింది. దేవి శ్రీ ప్రసాద్ వినసొంపైన సంగీతానికి అచ్చ తెలుగు పదాలతో అదిరిపోయే సాహిత్యం అందించారు చంద్ర బోస్.. ఓ పల్లెటూరి అమ్మాయి గురించి గొప్పగా వర్ణిస్తూ  పల్లెటూరి కుర్రాడు పాడే ఈ పాట మళ్ళీ మళ్ళీ వినేలా చేసి సంగీతాభిమానుల మనసు దోచుకుంది.

‘పెనివిటి’ సాంగ్ ఈ ఇయర్ వచ్చిన బెస్ట్ సాంగ్ లో మంచి ప్లేస్ అందుకుంది…  అరవింద సమేత సినిమాలో ఓ ఎమోషనల్ స్విచువేషణ్ లో భార్య బాధ గురించి చెప్తూ వచ్చే ఈ  సాంగ్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. థమన్ కంపోజ్ చేసిన ట్యూన్ కి అద్భుతమైన సాహిత్యం అందించాడు రామ జోగయ్య శాస్త్రీ గారు.

ఈ ఏడాది మ్యూజిక్ లవర్స్ ని బాగా ఎట్రాక్ట్ చేసిన ఆల్బం ‘లవర్స్’. ఈ ఆల్బం లో ‘నాలో చిలిపి కల’ అనే సాంగ్ ఈ ఇయర్ మోస్ట్  ఫేవరేట్ సాంగ్స్ లిస్టు లో చోటు సంపాదించుకుంది.  సాయి కార్తీక్  ఓ స్విచువేషణ్ కోసం కంపోజ్ చేసిన ఓ బిట్  మ్యూజిక్ ఆ తర్వాత ట్యూన్ గా మారి చివరికి  ఆల్బం లో సాంగ్ గా చేరింది. ఈ సాంగ్ లో వచ్చే వాయిలిన్ మ్యూజిక్ తో పాటు శ్రీమణి అందించిన లిరిక్స్ అందరినీ ఎట్రాక్ట్ చేసాయి.

ఈ ఏడాది టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన అనిరుద్ కూడా ఓ బెస్ట్ మెలోడీ సాంగ్ అందించాడు. ‘గాలి వాలుగా ఓ గులాబీ వాలి’ అనే సాంగ్  2018 చార్ట్ బస్టర్స్ లో మంచి ప్లేస్ దక్కించుకుంది. అనిరుద్ క్లాసీ ట్యూన్ కి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అద్భుతమైన సాహిత్యం శ్రోతల మనసు దోచుకుంది.

నాని కెరీర్ లో బెస్ట్ మాస్ సాంగ్ అనిపించుకుంది ‘దారి చూడు దుమ్మూ చూడు’… ఈ ఏడాది గట్టిగా వినిపించిన పాటల్లో ఇదొకటి. హిపాప్ తమిళ అందించిన మాస్ బీట్ ట్యూన్ కి చిత్తూరి యాసతో అదిరిపోయే లిరిక్స్ అందించాడు పెంచల్ దాస్… సాహిత్యంతో అందించడంతో పాటు తనే  పాడి  పాటకి ఓ అందం తీసుకొచ్చాడు .

ఈ ఇయర్ ‘సైనికా’ సాంగ్ కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది… విశాల్ & శేకర్ అందించిన ట్యూన్ కి బెస్ట్ లిరిక్స్ అందించాడు రామజోగయ్య శాస్త్రీ గారు… దేశ సరిహద్దుల్లో ఉండే సైనికుల గురించి తన సాహిత్యం ద్వారా ఎంతో గొప్పగా చెప్పిన తీరు అందరికీ కనెక్ట్ అయింది.

మహేష్ బాబు – దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో ఇప్పటికే చాలా సాంగ్స్ వచ్చినా ‘భరత్ అనే నేను’ టైటిల్ సాంగ్ ఓ కొత్త అనుభూతి కలిగించింది. ఒక ముఖ్యమంత్రి ప్రజలకి ఇచ్చే హామీతో వచ్చే ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. ‘వచ్చాడయ్యో సామి’ కూడా ఈ ఆల్బంలో బెస్ట్ సాంగ్ అనిపించుకుంది. ముఖ్యంగా ఈ రెండు పాటలకు రామజోగయ్య శాస్త్రీ అందించిన సాహిత్యం హైలైట్ గా నిలిచింది.

ఈ ఏడాది  థమన్ నుంచి వచ్చిన బెస్ట్ ఆల్బమ్స్ లో  ‘తొలిప్రేమ’ ఒకటి. ఈ ఆల్బంలో ‘తొలి ప్రేమ’  టైటిల్ సాంగ్ లవర్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా థమన్ కంపోజ్ చేసిన ఈ పాటకి శ్రీమణి లిరిక్స్ అందరినీ ఎట్రాక్ట్ చేసాయి.

పెళ్లి పాటలకు సంబంధించి ఇప్పటికే చాలా పాటలొచ్చాయి… కానీ పెళ్లి గొప్పతనాన్ని చెప్తూ వచ్చిన పాటల్లో బెస్ట్ సాంగ్ అనిపించుకుంది ‘కళ్యాణం వైభోగం’.. శ్రీనివాస కళ్యాణంలోని ఈ సాంగ్ ఈ ఏడాది పెళ్లి మండపాల్లో బాగా హల్చల్ చేసింది. మిక్కీ జే మేయర్ అందించిన ట్యూన్ కి గొప్ప సాహిత్యం అందించాడు శ్రీమణి. మిక్కీ -శ్రీమణి తమ వర్క్ తో పాటని క్రియేట్ చేస్తే తన గానంతో ఈ సాంగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు ఎస్.పి.బాలు. బాలు గానంతో కూడిన శ్రీమణి సాహిత్యం బాగా ఆకట్టుకుంది.

ఈ ఏడాది సిద్ శ్రీరాం పాడిన మరో సాంగ్ ‘మాటే వినదుగా’ కూడా ఓ రేంజ్ లో హల్చల్ చేసింది.  ‘టాక్సీ వాలా’ సినిమాలోని ఈ సాంగ్ కి జేక్స్ మ్యూజిక్ కంపోజ్ చేయగా కృష్ణకాంత్ లిరిక్స్ అందించాడు. యూత్ కి బాగా కనెక్ట్ అయిన  ఈ సాంగ్ ఈ ఇయర్ సూపర్ హిట్ సాంగ్స్ లో మంచి స్థానం అందుకుంది.

‘బొంబై పోతావా’ రాజా అనే మాస్ సాంగ్ ఈ ఏడాది ఓ ఊపు ఊపింది… పేపర్ బాయ్ ఆల్బంలో  ఫోక్ టచ్ తో వచ్చే ఈ సాంగ్ డాన్సింగ్ నంబర్ అనిపించుకుంది. ఈ ఏడాది అన్ని ఫెస్టివల్స్ లో ఈ సాంగ్ బాగా వినిపించింది. ముఖ్యంగా భరాత్ లాంటి వేడుకల్లో యూత్ ఈ సాంగ్ కే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. భీమ్స్ సెసిరోలియో అందించిన ట్యూన్ కి మాస్ కి కనెక్ట్ అయ్యేలా ధూంధాం లిరిక్స్ అందించాడు సురేష్ గంగుల.

హలో గురు ప్రేమకోసమే సినిమాలోని దేవి స్వరపరిచిన పెద్ద పెద్ద కళ్ళతోటి పాట కూడా ఈ ఏడాది అందరినీ ఆకట్టుకుంది. తొలి చూపులోనే తనని ప్రేమలో పడేసిన అమ్మాయి కళ్ళను ఆమె అందాన్ని పొగుడుతూ సాగే ఈ సాంగ్ ఈ ఇయర్ చార్ట్ బస్టర్స్ లో చోటు సంపాదించుకుంది. శ్రీమణి లిరిక్స్ అందించిన ఈ పాటకు యాజిన్ నిసార్ సింగింగ్ కూడా కలిసొచ్చింది.

‘కాదని నువ్వంటున్నది’ అంటూ రిలీజయిన లవ్ సాంగ్ కూడా  ఈ ఏడాది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమాలోని ఈ సాంగ్ బ్యూటిఫుల్ మెలోడీ అనిపించుకుంది. శక్తి కాంత్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి సిరివెన్నెల సీతారామ శాస్త్రీ గారు సాహిత్యం అందించారు. ముఖ్యంగా హేమ చంద్ర వాయిస్ ఈ సాంగ్ కి సోల్ అని చెప్పొచ్చు.

 ‘మంచు కురిసే వేళ అందమంతా నీల’ అంటూ ఓ సాంగ్ ఈ ఇయర్ మరో మంచి మెలోడీ అనిపించుకుంది… శ్రావణ్ భరద్వాజ్ అందించిన ఈ ట్యూన్ కి వసిష్ఠ శర్మ లిరిక్స్ అందించాడు…ఈ ఇయర్ సూపర్ హిట్ సాంగ్స్ లో  ఈ సాంగ్ కూడా మంచి ప్లేస్ దక్కించుకుంది.

ఇయర్ ఎండింగ్ లో వచ్చి అందరినీ మెస్మరైజ్ చేసింది ‘పడి పడి లేచె మనసు’ సాంగ్. విశాల్ చంద్ర శేకర్ మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన ఈ స్వీట్ మెలోడీ మ్యూజిక్ లవర్స్ ఫేవరేట్ సాంగ్స్ లిస్టు లో చేరిపోయింది. రిలీజ్ కి ముందే సినిమాపై బజ్ క్రియేట్ చేసిన ఈ సాంగ్ విజువల్ గానూ అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా కృష్ణ కాంత్ అందించిన లిరిక్స్ మళ్ళీ మళ్ళీ వినేలా అనిపిస్తాయి.

2018లో వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ లో మహానటి టైటిల్ సాంగ్ కూడా ఒకటి. మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి ఈ పాటను అద్భుతంగా ఆలపించాడు. మహానటి పేరుచెప్పగానే గుర్తుకొస్తుంది ఈ టైటిల్ సాంగ్.