ఇయర్ ఎండ్ స్పెషల్ : టాలీవుడ్ బెస్ట్ క్యారెక్టర్స్

Friday,December 28,2018 - 11:02 by Z_CLU

సినిమాలో ఓ సీను పండితే ఆ క్రెడిట్ కచ్చితంగా ఆ సీనులో పెర్ఫాం చేసిన ఆర్టిస్ట్ కే దక్కుతుంది.. కొందరు నటీ నటులు కథలో ఇన్వాల్వ్ అయి, క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసి సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తుంటారు. ఈ ఏడాది అలా కొంత మంది క్యారెక్టర్స్ తో బెస్ట్ అనిపించుకొని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ ఇయర్ రిలీజయిన సినిమాల్లో బెస్ట్ క్యారెక్టర్స్ పై ‘జీ సినిమాలు’ స్పెషల్ స్టోరీ…


రాజేంద్ర ప్రసాద్ గురించి కొత్తగా చేప్పెదేముంది.. కామెడీ, సెంటిమెంట్ లో ఆయనది అందెవేసిన చేయి.. ‘మహానటి’ సినిమాలో ఈ రెండు రసాలు సమపాళ్ళల్లో ఉండే క్యారెక్టర్ లో నటించి ఈ ఏడాది ప్రేక్షకులను మరింతగా అలరించారు. మహానటి సినిమాలో కీర్తి సురేష్ తర్వాత అందరూ మాట్లాడుకుంది రాజేంద్ర ప్రసాద్ చేసిన చౌదరి క్యారెక్టర్ గురించే.. సినిమా ఆరంభం నుండి చివరి వరకూ ఎంతో కీలకమైన పాత్రది. ఈ క్యారెక్టర్ కి బెస్ట్ ఇచ్చి సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించారు నటకిరీటి.


ఈ ఏడాది ఆది పినిశెట్టి, అనసూయ ఇద్దరూ ‘రంగస్థలం’ సినిమాలో బెస్ట్ క్యారెక్టర్స్ చేసారు. రంగమ్మత్త గా అనసూయ అందరి దృష్టి ఆకర్షిస్తే ఊరికి మంచి చేయాలనుకునే కుమార్ బాబు క్యారెక్టర్ లో బెస్ట్ అనిపించుకున్నాడు ఆది పినిశెట్టి. నిజానికి సినిమాలో ఈ రెండు క్యారెక్టర్స్ చాలా కీలకమైనవి. ఈ క్యారెక్టర్స్ లో ఆది, అనసూయ కాకుండా మరొకర్ని ఊహించుకోలేం. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ఇవి.


‘గీత గోవిందం’ సినిమాతో ఈ ఇయర్ బెస్ట్ క్యారెక్టర్స్ లిస్టు లో చేరిపోయాడు సుబ్బరాజు. కథలో కీలకమైన క్యారెక్టర్ లో కూల్ గా నటించి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసాడు. సినిమాలో విజయ్ దేవరకొండ -సుబ్బరాజు మధ్య వచ్చే ప్రతీ సీను బాగా పండింది.

 

‘రంగస్థలం’, ‘మహానటి’ సినిమాలు ఈ ఏడాది మహేష్ ఆచంట ని స్టార్ ని చేసేసాయి. అప్పటివరకూ అడపాదడపా క్యారెక్టర్స్ చేస్తూ కెరీర్ ని కొనసాగిస్తున్న మహేష్ రంగస్థలంలో మహేష్ గా మహానటిలో సత్యంగా బాగా పాపులర్ అయ్యాడు. నటుడిగా తన ప్రతిభ నిరూపించుకోవాలని ఎదురుచూస్తున్న సమయంలో మహేష్ కి కుంబస్థలం లాంటి క్యారెక్టర్స్ దొరికాయి . ముఖ్యంగా రంగస్థలంలో చనిపోయిన అన్నయ్యని చరణ్ భుజాలపై వేసుకొచ్చే సీన్ లో ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ తో అదరగోట్టేసాడు. ఈ రెండు క్యారెక్టర్స్ తో ఈ ఇయర్ బెస్ట్ అనిపించుకున్నాడు
మహేష్ ఆచంట.


‘అరవింద సమేత’ సినిమాలో నాయినమ్మ క్యారెక్టర్ చేసి బెస్ట్ పెర్ఫార్మర్ అనిపించుకున్నారు సుప్రియా పాఠక్. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల్లో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. తెలుగు రాకపోయినా నేర్చుకొని రాయలసీమ యాసలో ఆమె చెప్పిన డైలాగ్స్ కథను ఎలివేట్ చేసాయి.


గతేడాది శివగామి క్యారెక్టర్ తో అందరినీ స్పెల్ బౌండ్ చేసిన రమ్యకృష్ణ ఈ ఏడాది కూడా ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ తో బెస్ట్ అనిపించుకుంది. ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాలో శైలజా రెడ్డిగా తన పెర్ఫార్మెన్స్ తో బెస్ట్ అనిపించుకుంది రమ్య కృష్ణ.


‘చిలసౌ’ సినిమాలో హీరోయిన్ మదర్ క్యారెక్టర్ లో నటించి ఈ ఇయర్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో ఒకరనిపించుకున్నారు రోహిణి. ఇప్పటికే చాలా సినిమాల్లో అమ్మ పాత్రలో కనిపించి ఆకట్టుకున్న రోహిణి చిలసౌ సినిమాలో అమ్మ క్యారెక్టర్ చేసి ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టించుకున్నారు. చాలా సందర్భాల్లో ఆమె నటన కంటతడి పెట్టిస్తుంది.


ఈ ఏడాది కామెడీ రోల్స్ తో పాటు మంచి క్యారెక్టర్స్ ప్లే చేసారు నరేష్. ‘రంగస్థలం’, ‘మహానటి’ ,’దేవదాసు’ వంటి సినిమాల్లో బెస్ట్ క్యారెక్టర్స్ చేసి మరోసారి బెస్ట్ పెర్ఫార్మర్
అనిపించుకున్నాడు.


ఇప్పటికే ఎన్నో బెస్ట్ క్యారెక్టర్స్ మెప్పించిన ప్రకాష్ రాజ్ ఈ ఏడాది ‘శ్రీనివాస కళ్యాణం’, ‘గూడచారి’,’హలో గురు ప్రేమకోసమే’ సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేసి మరోసారి ఆడియన్స్ ని అలరించాడు. ముఖ్యంగా ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కి మంచి మార్కులే పడ్డాయి.


మురళి శర్మ కూడా ఈ ఏడాది బెస్ట్  క్యారెక్టర్స్ లో విజేత అనిపించుకున్నాడు.  విజేత  సినిమాలో ఓ తండ్రి క్యారెక్టర్ లో మెప్పించాడు. కథ వినగానే ఈ క్యారెక్టర్ కి మురళి శర్మ అయితేనే బెస్ట్  అంటూ మెగా స్టార్ ఛాయస్ కి  పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. ‘అ!’,’భాగమతి’ సినిమాల్లో కూడా మురళి శర్మ క్యారెక్టర్స్ ఆకట్టుకున్నాయి.


ఈ ఏడాది ‘భరత్ అనే నేను’ ,’సాక్ష్యం’ సినిమాల్లో మెయిన్ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు శరత్ కుమార్.. ముఖ్యంగా సాక్ష్యం సినిమాలో శరత్ కుమార్ కనిపించింది కొంచెం సేపే అయినా ఆ క్యారెక్టర్ మంచి ఇంపాక్ట్ చూపించింది.


అర్జున్ కూడా ఈ ఏడాది ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో ప్రొఫెసర్ రామ కృష్ణం రాజు గా ఆకట్టుకున్నాడు. సినిమాలో చాలా రోల్స్ ఉన్నా అర్జున్ క్యారెక్టర్  బాగా క్లిక్ అయింది.


ఆర్.ఎక్స్ 100 సినిమాతో మళ్ళీ తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన ఒకప్పటి హీరో రాంకీ డాడీ క్యారెక్టర్ లో మెప్పించాడు. హీరోకి వెన్నుదన్నుగా నిలిచే క్యారెక్టర్ లో బెస్ట్ అనిపించుకున్నాడు.

 


ఈ ఏడాది నటిగా రీ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ కూడా నదియా ఖురేషీ క్యారెక్టర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గూఢచారి సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసిన సుప్రియా ఐయాం బ్యాక్ అనిపించుకుంది.

 

ఈ ఏడాది చిన్న సినిమాలకు ఊపిరినిచ్చింది ‘కేరాఫ్ కంచరపాలెం’అనే చిన్న సినిమా. క్యారెక్టర్స్ బేస్డ్ మూవీ అయినప్పటికీ రాజు అనే క్యారెక్టర్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. నటనలో ఎటువంటి అనుభవం లేనప్పటికీ ఈ క్యారెక్టర్ లో అదుర్స్ అనిపించాడు సుబ్బరాజు.

ఓ వైపు హీరోగా కనిపిస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న సత్య దేవ్ ఈ ఏడాది ‘అంతరిక్షం’ సినిమాలో డ్యుయల్ రోల్ చేసి రెండు క్యారెక్టర్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసాడు. స్పేస్ స్టేషన్ లో వర్క్ చేసే ట్విన్స్ క్యారెక్టర్స్ తో నటుడిగా మరో మెట్టు పైకెక్కాడు సత్య దేవ్.