ఇయర్ ఎండ్ స్పెషల్ : '2019' ను మిస్సయిన హీరోలు
Friday,December 20,2019 - 10:12 by Z_CLU
2019 లో సిల్వర్ స్క్రీన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. స్టార్ హీరోలు మినిమం రెండేసి సినిమాలతో సక్సెస్ రేషియోని బ్యాలన్స్ చేసుకున్నారు. కానీ అంత ఫాస్ట్ పేజ్ లోను కొందరు హీరోల అకౌంట్ లో కనీసం ఒక్క రిలీజ్ కూడా లేకుండానే 2019 క్లోజ్ అయిపోయింది.

ఈ ఏడాది ఎన్టీఆర్ నుండి ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. ‘అరవింద సమేత’ తర్వాత స్మాల్ బ్రేక్ తీసుకున్న తారక్ వెంటనే రాజమౌళి సినిమా సెట్స్ లో జాయిన్ అయిపోయాడు. ఈ ఏడాది వచ్చిన గ్యాప్ ను వచ్చే ఏడాది చరణ్ తో కలిసి ఓ భారీ బడ్జెట్ సినిమాతో మరిపించబోతున్నాడు.

“ఇవ్వలేదు..వచ్చింది” అంటూ ‘అల వైకుంఠపురములో’ టీజర్ లో ఓ డైలాగ్ తో తన గ్యాప్ గురించి చెప్పేసాడు బన్నీ. అవును ఈ ఏడాది స్టైలిష్ స్టార్ నుండి సినిమా రాలేదు. ఆ లోటు బాగా కనిపించింది. అందుకే వచ్చే ఏడాది రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నాడు బన్నీ. ‘అల వైకుంఠపురములో’ తో పాటు సుకుమార్ తో చేయనున్న సినిమా కూడా వచ్చే ఏడాదే థియేటర్స్ లోకి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

మాస్ మహారాజా నుండి ప్రతి ఏడాది రెండు సినిమాలు పక్కా… కానీ ఈ ఏడాది మాత్రం ఒక్క సినిమా కూడా రాలేదు. వరుస అపజయాలు పలకరించడంతో చిన్న గ్యాప్ తీసుకొని ‘డిస్కో రాజా’, క్రాక్’ సినిమాలు చేస్తున్నాడు. ‘డిస్కో రాజా’తో వచ్చే ఏడాది ఆరంభంలోనే ప్రేక్షకులను పలకరించబోతున్న రవితేజ 2020 ఎండింగ్ లోపు క్రాక్ తో థియేటర్స్ లోకి వస్తాడు.

గతేడాది రెండు సినిమాలతో సందడి చేసిన నితిన్ కూడా ఈ ఇయర్ సినిమాను రిలీజ్ చేయలేదు. కొన్ని నెలల పాటు తీసుకున్న గ్యాప్ లో ఏకంగా నాలుగు ప్రాజెక్ట్స్ సెట్ చేసుకొని అందులో మూడు సినిమాలను సెట్స్ పై పెట్టేశాడు. ఈ ఏడాది మిస్ అయినా వచ్చే ఏడాది మాత్రం నితిన్ మూడు సినిమాలు రిలీజ్ అవ్వడం పక్కా.

గతేడాది ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో ఎంటర్టైన్ చేసిన సుధీర్ బాబు ఈ ఇయర్ ను మిస్ అయ్యాడు. ప్రస్తుతం వచ్చే ఏడాది సినిమాల మీదే ఫోకస్ పెట్టి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ‘V’ , పుల్లెల గోపీచంద్ బయోపిక్ సినిమాలతో 2020 లో సందడి చేయనున్నాడు.