ఇయర్ ఎండ్ స్పెషల్ : కొత్త హీరోలు

Sunday,December 29,2019 - 10:02 by Z_CLU

ఏ హీరో కయినా మొదటి సినిమా అనేది చాలా కీలకం. మొదటి సినిమాతో ఇంప్రెస్ చేయగలిగితే హీరోగా వరుస అవకాశాలు అందుకోవచ్చు. అయితే ప్రతీ ఏడాది లాగే ఈ ఇయర్ కూడా కొందరు కొత్త హీరోలు తమ డెబ్యూ సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీదకొచ్చారు. మరి అలా వచ్చిన వారిలో బెస్ట్ అనిపించుకున్న డెబ్యూ హీరోలెవరో చూద్దాం.

ఈ ఇయర్ ఎంత మంది హీరోలు పరిచయమైనా అందులో బెస్ట్ మాత్రం నవీన్ పోలిశెట్టి అనే చెప్పాలి. మొదటి సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ అనే సినిమాతో  సైలెంట్ గా వచ్చి సప్రయిజ్ హిట్ అందుకున్నాడు నవీన్. సినిమాలో తన యాక్టింగ్ తో అందరినీ మెస్మరైజ్ చేసి హీరోగా చకచకా మూడు సినిమాలు కమిట్ అయిపోయాడు.

తమిళ్ హీరో అథర్వ మురళి కూడా ఈ ఏడాది ‘గద్దల కొండ గణేష్’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఓ ఇన్నోసెంట్ అబ్బాయి పాత్రతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.

ఈ ఏడాది రియల్ స్టార్ స్వర్గీయ డా. శ్రీహరి కొడుకు మేఘాంశ్ కూడా ‘రాజ్ దూత్’ అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా హీరోగా తన యాక్టింగ్ తో మంచి మార్కులు అందుకున్నాడు. త్వరలోనే రెండో సినిమాతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఈ ఇయర్ అన్నయ్య సపోర్ట్ తో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా డెబ్యూ హీరోగా పరిచయమయ్యాడు. ‘దొరసాని’ అనే పీరియాడిక్ లవ్ స్టోరీతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చి నటుడిగా ఆకట్టుకున్నాడు.

ఇప్పటికే ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన కిరణ్ అబ్బవరం కూడా ఈ ఏడాది వెండితెరపై హీరోగా మెరిసాడు. ‘రాజా వారు రాణి గారు’ అనే పల్లలెటూరి ప్వ్రేమకథతో  ప్రేక్షకులను మెప్పించి హీరోగా సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం మొదటి సినిమా ఇచ్చిన ఉత్సాహంతో రెండో సినిమాకు రెడీ అవుతున్నాడు.

కొన్ని పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు చేసి మెప్పించిన రాకేశ్ వర్రే ఈ ఏడాది ‘ ఎవరికీ చెప్పొద్దు’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. సినిమాలో తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా మంచి మార్కులే అందుకున్నాడు. మరి నెక్స్ట్ కూడా హీరోగానే కంటిన్యూ అవుతాడా లేదా మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అవుతాడా చూడాలి.

కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహ కూడా ఈ ఇయర్ హీరోగా డెబ్యూ ఇచ్చాడు. ‘మత్తు వదలరా’ అనే క్రైం థ్రిల్లర్ సినిమాతో హీరోగా ప్రేక్షకులను పలకరించి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం హీరోగా మొదటి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న శ్రీ సింహ కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని రెండో సినిమా గురించి ఆలోచించనున్నాడు.

శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా కూడా ఈ ఇయర్ ఏదైనా జరగొచ్చు’ అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో హీరోగా పరవాలేదనిపించుకొని ఇటివలే రెండో సినిమాను మొదలు పెట్టేసాడు.

శివాజీ తనయుడి లాగే సీనియర్ నటుడు గౌతం రాజు కొడుకు కృష్ణ కూడా ‘కృష్ణారావు సూపర్ మార్కెట్’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.